Nerella Sreenath… ప్రతి క్షణం జీవితాన్ని డబ్బుతో కొలవకూడదురా, కళాదృష్టితో కూడా కొలవాలిరా”
*
బాపూ గారి request – B V Pattabhi Ram గారి చొరవ… సంవత్సరం గుర్తు లేదు గానీ ”త్యాగయ్య” సినిమాని వారు శంకరాభరణం సోమయాజులు గారితో తీస్తున్న సందర్భం . ఆ సినిమా తీస్తున్న రోజుల్లో Magician పట్టాభిరాం గారి ద్వారా నాన్న గారి అపాయింట్‌మెంట్ తీసుకొని, నాగార్జునా సిమెంట్ రాజు గారి గెస్ట్ హౌస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాన్న గారితో గడిపే విధంగా సమయం సెట్ చేసుకున్నారు…
Ads
నాన్న గారు అక్కడి నుంచి తిరిగి మా ఇంటికి వచ్చాక, డైనింగ్ టేబుల్ మీద రాత్రి భోజనానికి కూర్చున్నాము. ఏదో తెలియని సంతోషం నాన్నగారి కళ్ళల్లో ఉంది ఆరోజు. అప్రయత్నంగానే అన్నం తింటూ ”ఒరేయ్ శ్రీనాథ్, ఈరోజు 12 గంటలు ఇట్టే గడిచిపోయాయి బాపు రమణల గారితో... వారు అడుగుతూ పోతున్నారు, నేను Mimicry లో వివరణ యిస్తూ… తెలుగు, హిందీ, ఇంగ్లీషు నటుల్ని కవులని, కళాకారులని, సాహితీవేత్తలని అనుకరిస్తూ పోతున్నాను…
అలా రోజంతా గడిచిన తరువాత చివరాఖరికి నాగయ్య గారి పద్యం వాటి లక్షణాలు అని డిస్కషన్ స్టార్ట్ అయ్యిందని చెబుతూ ఆ సమయాన్ని ఇలా వివరించారు నాన్నగారు (నేరెళ్ల వేణుమాధవ్)…
నాగయ్య గారు cinema hero గా ఉన్న రోజుల్లో నాటకాల్లో పద్యాలు, కీర్తనలు అనేక రకాలుగా సాగదీసి, రాగం తీసి పాడేవారు ఆ రోజుల్లో… అంటూ ఆకాలం నాటి ప్రముఖ కళాకారులు పద్యాలు పాడే విధానాలను అనుకరించి చూపించాను… తరువాతే తన అనుభవాన్ని క్రోడీకరించి, బాపురమణలకు, పట్టాభిగార్లకు, నాగయ్యగారి పద్యగానం గొప్పదనాన్ని ఉదహరించాను… పద్యగానంతో వివరించాను…
పానుగంటి లక్ష్మీనరసింహం గారు పద్యానికి రాగం అక్కర్లేదు అన్నారు, నాగయ్య గారేమో ఎంత అవసరమో, సన్నివేశాన్ని బట్టి అంతే ఉంచాలన్నారు... ఎక్కడ రాగం ఉండాలి, ఎక్కడ భావం ఉండాలి అన్న విషయాన్ని వారు నటించి గానం చేసిన భక్త పోతన సినిమాలో ”ఎవ్వనిచే జనించు ఎవ్వని లోపల లీనమై” అన్న పద్యాన్ని నాగయ్య గారు పాడిన విధంగానే పాడి వినిపించాను… బాపు రమణులు ఆనందిస్తూ మరిన్ని పద్యాలు నాగయ్య గారు పాడినవి వారు పాడించుకున్నారు… తన్మయులై కన్నీళ్ళు పెట్టుకొని, నాన్నగారి చేతులు పట్టుకొని ”ఏడుస్తూ” ఆలింగనం చేసుకున్నారని చెప్పారు…
ఆ తరువాత ……తాను సాయంత్రం బయలుదేరేటప్పుడు బాపు రమణలు నాన్నగారి దగ్గరకొచ్చి వంగి దండం పెట్టి, పట్టు శాలువా కప్పి, ఒక తెల్ల కవరులో ”పైకం” కట్ట తనకిచ్చి సవినయంగా… “మీతో గడిపిన మధుర క్షణాలకు గుర్తుగా ఈ కవరు” అని నాన్నగారి చేతిలో పెట్టారట… వెంటనే నాన్నగారు “అదేమిటి బాపు గారు, రమణ గారు… మరి నేను మీతో గడిపిన మధుర క్షణాలకు నేనే మీకు ఏమైనా ఇవ్వాలి కదా’’ అంటూ ఆ కవరు తిరిగి ఇచ్చేసారట నాన్నగారు… ఈ స్పందన చూసి బాపు రమణలు అశ్చర్యానికి లోనయ్యారట…
ఆ పైకం తీసుకోక పోవడంపై… నాన్నగారు మళ్ళీ కొనసాగించారు … ”శ్రీనాధూ, ప్రతి క్షణం జీవితాన్ని డబ్బుతో కొలవకూడదురా, కళాదృష్టితో కూడా కొలవాలిరా’’ అంటూ ఇలా కంటిన్యూ చేశారు…
पान अडा क्योँ
घोडा सडा क्योँ
नहीं पलट्नेसे
( పాన్ అడా క్యో, గోడా శడా క్యో, నహీ పల్టానే సే)
” కరెక్టు నాన్నగారు’’ అని అన్నాను నేను… తమలపాకు వడిలిపోయింది, గుర్రం పరిగెత్తలేకపోయింది.. ఎందుకు అంటే, అప్పుడప్పుడూ ఆ రెంటినీ తిప్పుతూ ఉండాలట– కళాకారులే కాదు, ప్రతి మనిషి నిజ జీవితంలో అప్పుడప్పుడు ఇలా గడపాలని వారి ఉద్దేశం….
Share this Article