On……. Gopi Dara facebook wall………….. “చింతామణి” నాటకం….. ఇప్పుడీ నాటకాన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ నాటక ప్రదర్శన నిలిపివేసే ఆలోచనలో ఉంది. ఈ విషయంలో ఆర్యవైశ్య సంఘం అభిప్రాయం సమర్ధనీయమే… చర్చించవచ్చు… రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక మూడు రాజధానులు వంటి తీవ్రమైన రాజకీయ అంశం కాదుకాబట్టి, దీనిపై ఎలాంటి చర్చ చేసినా “పచ్చ బ్యాచ్” అనో “పేటియం బ్యాచ్” అనో ముద్ర వేసే అవకాశం లేదు కాబట్టి ఈ పోస్టుపై చర్చ చేయవచ్చు…. “చింతామణి” ఒక సామాజిక నీతితో కూడిన ఒక సాంఘిక నాటకం… వ్యసనానికి బానిసలైన వ్యక్తులు ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటారో చెప్పే ఒక సామాజిక బాధ్యతతో కూడిన నాటకం. వ్యసనానికి బానిసలైన వారిలో అనేక కులాలవారు ఈ నాటకంలో కనిపిస్తారు…
Share this Article
Ads