పాత ఈటీవీ షోలు తిరగేస్తుంటే… ఓచోట రష్మి వర్షిణిని అంటుంది… శని, ఆదివారాల్లో సుధీర్‌తో నువ్వు పబ్బులెంబడి తిరుగుతవ్, నేనెందుకు ప్రపోజ్ చేయాలి తనకు… ఫన్ క్రియేటైనా సరే వర్షిణి, సుధీర్ పబ్బులకు కలిసి తిరుగుతారు అని ఎక్స్‌పోజైంది… మరో సందర్భంలో ఇదే వర్షిణి ఇదే రష్మిని పట్టుకుని, ఏమో మసాజ్ మీరెలా చేసుకుంటారో నాకెలా తెలుసు అంటుంది… హహ… సుధీర్, రష్మి సాన్నిహిత్యాన్ని ఎక్స్‌పోజ్ చేసింది…
స్టార్ మాలో ప్రారంభమైన సూపర్ సింగర్ షో మెగా లాంచింగ్ రెండు ఎపిసోడ్లు పైపైన పరిశీలిస్తుంటే… ఓచోట ఓ కంటెస్టెంట్ మంగ్లితో మాట్లాడుతూ కాస్త టెన్షన్ ఉండి శృతి కాస్త గతి తప్పింది అంటాడు… నీకు టెన్షనేమిటి..? ఏ పబ్బులో చూసినా నువ్వే పాడుతున్నావుగా అంటుంది మంగ్లి… అంటే అన్ని పబ్బులూ ఆమెకు మాంచి పరిచయమే ఉన్నట్టు తనే ఎక్స్‌పోజ్ చేసుకుంది… సరే, సరదా సంగతులు వదిలేస్తే…
Ads
కొత్తగా ప్రారంభమైన ఈ సూపర్ సింగర్‌లో నచ్చిన ఒక అంశం… ఇదుగో ఈమె కనిపించింది… పేరు అంబటిపూడి కామాక్షి… వయోలినిస్టు… ప్లజెంట్‌గా, మెరిటోరియస్‌గా ఉంటుంది ఆమె వాద్యసహకారం… ఆహాలో ఇండియన్ ఐడల్ షోకు వచ్చిన ప్రతి సంగీత అతిథి ఆమెను మెచ్చుకున్నారు… ఆమెతో పాటు మృదంగం, తబలా, డోలు, కంజెర అన్నీ తన బోర్డు మీదే వాయించి పడేసే ఓ జులపాల పిల్లాడు… ఫ్యాన్ ఆఫ్ తమన్… ఫ్లూట్, కీబోర్డు ఎట్సెట్రా ఏదైనా వాయించి పడేసే మరో మ్యుజిషియన్ కూడా కనిపించారు… ఆహా, తెలుగు ఇండియన్ ఐడల్ షోలో కనిపించే ఆర్కెస్ట్రా… అది ఈ సూపర్ సింగర్ షో బలం…
అవన్నీ వదిలేస్తే… ఒకప్పటి ఎయిర్‌టెల్ సూపర్ సింగర్ సీజన్లను గుర్తుతెచ్చుకొండి… ప్రత్యేకించి ఒక సీజన్ బాగా గుర్తుంది… కల్పన, గోపిక పూర్ణిమ, కౌసల్య, మాళవిక, ధనుంజయ్, కృష్ణ చైతన్య, కుంచె రఘు, హేమచంద్ర, శ్రావణ భార్గవి… ఏక్‌సేఏక్… అదరగొట్టారు… జడ్జిలు కూడా శృతి, ప్రజెంటేషన్, గమకాలు, ల్యాండింగ్, నోట్స్, తాళం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునేవాళ్లు, చెప్పేవాళ్లు… (ఎస్, గతంలో బాలు చెప్పేవాడు ఈటీవీ మ్యూజిక్ కంపిటీషన్ షోలలో ఇలా…)
కానీ ఇప్పుడు అదే మాటీవీ, ఇప్పుడు స్టార్ మా… అదే పేరు… సూపర్ సింగర్… కానీ భ్రష్టుపట్టించారని అనిపిస్తోంది… అదే స్త్రీముఖి ఎక్సట్రా హైపిచ్ అరుపులతో భయపెడుతూనే ఉంది… (హోస్ట్ చేయడం అంటే అరుపులు, కేకలేనా..?) ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌లో నిత్యా, గీతామాధురిలను వదిలేస్తే తమన్ గానీ, కార్తీక్ గానీ కంటెస్టెంట్ల సింగింగ్‌ను నిశితంగా పరిశీలించేవాళ్లు, చెప్పేవాళ్లు, కార్తీక్ అవసరమైతే పాడి చూపించేవాడు… కానీ ఇప్పటి సూపర్ సింగర్…
మొన్నమొన్నటిదాకా జీతెలుగులో సరిగమప అని ప్రదీప్ సారథ్యంలో మ్యూజిక్ కంపిటీషన్ షోను భ్రష్టుపట్టించారు విజయవంతంగా… లెక్కకు మిక్కిలి జడ్జిలు, మెంటార్స్, ఎట్సెట్రా హంగులన్నీ ఉన్నా సంగీతం కొరవడింది… ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీలా నడిపించారు… వెకిలి జోకులు, బిగ్‌బాస్ వీకెండ్ షోలాంటి ఛాయలు… సేమ్, అవన్నీ స్టార్ మా సూపర్ సింగర్ షో పుణికి పుచ్చుకుంది… జడ్జిలే మెంటార్లు, వాళ్లకే గ్రూపులు… తమకు ఏ జడ్జి కావాలో కంటెస్టెంట్ ఎన్నుకోవడం అట… ఫన్నీ… మరో ఓచోట ఘోరం ఏమిటంటే… ఇద్దరు జడ్జిలకు డాన్స్ పోటీ పెట్టి, వాళ్లు వేసిన పిచ్చి గెంతుల ఆధారంగా కంటెస్టెంట్ ఓ జడ్జిని కమ్ ఓ మెంటార్‌ను కమ్ ఓ ఓనర్‌ను ఎన్నుకోవడం… తాగినట్టు ఊగే అనంతశ్రీరాం గెలిచాడు అందులో…
ఇది మరీ శ్రీదేవి డ్రామా కంపెనీని దాటిపోయింది… జడ్జిలకు స్టెప్పులు రావాలి… కంటెస్టెంట్లకు స్టెప్పులు రావాలి… స్టెప్పులతోనే వేదిక మీదకు రావాలి… హోస్ట్ భీకరమైన కేకలు సరేసరి… ఆమెకు దీటుగా అనంత శ్రీరాం… ఆ సరిగమపలో ఓ లిరిక్ రైటర్‌లా గాకుండా ఓ కమెడియన్‌లా అలరించిన ఆయన ఈ సూపర్ సింగర్‌లోనూ అంతే… అలవోకగా పదాల్ని అల్లేయగల ఈ కలనేత నిపుణుడు చివరకు ఇలా జోకర్ కావడం ఏమిటో… ఫాఫం… ఒక తమన్, ఒక శైలజ, ఒక కార్తీక్ తరహాలో టెక్నికల్‌గా పాటను జడ్జి చేయగల వారెవరూ లేరు… ఫాఫం… స్టార్ మా సూపర్ సింగర్ షో…!!
Share this Article