నిన్నో, మొన్నో సింగర్ సునీత ఓ సోషల్ మీడియా పోస్టులో తన పెళ్లి ఫోటో పెట్టి, ఆ వివాహ క్షణాల్ని తలుచుకుని ఆనందపడింది… కొడుకును హీరోగా లాంచ్ చేసింది… బిడ్డను కూడా సింగర్ చేయాలని ప్రయత్నిస్తోంది… బాగుంది, లేటు వయస్సులో రెండో పెళ్లి మ్యాంగో రామ్‌తో… గుడ్, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, సునీత పిల్లలు కూడా అమ్మ పెళ్లికి అతిథులయ్యారు… వాళ్ల బతుకులేవో వాళ్లు బతుకుతున్నారు కదా…
ఓ వెబ్సైట్లో ఓ వార్త కనిపించింది… అదేమిటయ్యా అంటే… సోషల్ మీడియాగా ఓ దర్శకుడు, ఓ రైటర్ తిట్టుకుంటున్నారని..! నిజానికి సినిమా ఫీల్డులో ఎవరి మీద ఎవరికి ఎంత కోపం వచ్చినా, మనసులోనే దాచుకుంటారు, మౌనంగా ఉంటారు, అంతే తప్ప బజారునపడి తిట్టుకోరు… కానీ రాజసింహ అనే రైటర్ కమ్ డైరెక్టర్ శృతితప్పి సోషల్ మీడియాలో రాతలకు పూనుకున్నాడు… ఏమనీ అంటే..?
ఓ నిర్మాతపై తన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు… బ్రోకర్ అంటున్నాడు… తన కోపం నిర్మాత వివేక్ కూచిభొట్ల మీద… తన ఫోటోను షేర్ చేస్తూ… ఇతను నిర్మాతా..? లేదంటే బ్రోకరా..? అన్నాడు… ఒక రైటర్‌కు ఇంత ధైర్యం ఎలా వచ్చింది..? ఎందుకింద సంస్కారరహితంగా పోస్టులు పెడుతున్నాడు అనేది వేరే సంగతి… వాళ్ల నడుమ పంచాయితీకి కారణాల జోలికి మనం పోనక్కర్లేదు… వివేక్ కూచిభొట్ల కూడా ఈ బురద తన మీద పడకుండా దూరంగా, మౌనంగానే ఉన్నాడు…
Ads
ఈలోపు ఇంకో దర్శకుడు వీఎన్ ఆదిత్య సదరు రైటర్ మీద ఫైరయ్యాడు… ”నీకు బుద్ది లేదు.. విశ్వాస ఘాతకుడివి నువ్వు. వివేక్‌ను అనే స్థాయి నీకు లేదు. తప్ప తాగి నీ కెరీర్‌ని చెడగొట్టుకొన్నావ్. కష్టపడి పైకి వచ్చినవాడి మీద ఏడవకు. నీకు ఆరోగ్యం బాగోకపోతే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు వివేక్. ఈ కథ వినమని నిర్మాతలకు రికమెండ్ చేశారు. అలాంటి వ్యక్తిని అన్నావ్.. పర్యవసానాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండు” అంటూ ఫైర్ అయ్యాడుట…
దాంతో రాజసింహా తిట్ల పురాణం వి.ఎన్.ఆదిత్యపైకి మళ్లింది… ‘నీ బతుకు నాకు తెలుసు. సింగర్ సునీతతో నడిపిన ఎఫైర్ నాకు తెలుసు’ అంటూ రాజసింహా మళ్లీ బూతులు ఎత్తుకొన్నాడు… ఓ సినిమా ఛాన్స్ కోసం వివేక్ చుట్టూ తిరిగిన రాజసింహా… తనకు అవకాశం రాకపోయేసరికి ఇలా అక్కసు వెళ్లగక్కాడన్నది ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్న మాట అని సదరు వెబ్సైట్ రాసుకొచ్చింది… సరే, వాళ్లు తన్నుకోనీ… కానీ నడుమ సునీతను ఎందుకు లాగినట్టు..? దీన్నే కుసంస్కారం అంటారు…
ఇంత గలీజు మనస్తత్వాలు సినిమాలు తీస్తుంటాయి, రాస్తుంటాయి, నీతులు చెబుతుంటాయి, మనం జేబులు ఖాళీ చేసి ఆ సినిమాలు చూస్తుంటాం… ఆ వెబ్సైట్ వార్త చదివి తీరా వాళ్ల వాల్స్ మీదకు వెళ్లి చూస్తే సునీత మీద కామెంట్ సహా పలు పోస్టులు కనిపించలేదు, బహుశా డిలిట్ చేసి ఉంటారు… ఎవరో ఫోన్లు చేసి తిట్టి ఉంటారు… పాపం, ఆమె మొదటి పెళ్లి ఓ విషాదం… ఇప్పుడేదో సంతోషంగా ఉంది, ఆ సంతోషాన్ని కూడా మిగలనివ్వర్రా మీరు..?!
Share this Article