Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సూపర్‌మాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్, ఐరన్‌మాన్… సూపర్ హను‌మాన్…

January 12, 2024 by M S R

ఈమధ్యకాలంలో అనేక కారణాలతో ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించిన సినిమా… హనుమాన్..! నిజానికి ఓ చిన్న సినిమా, చాలా చిన్న రేంజ్ హీరో… కానీ ఓ స్టార్ హీరో సినిమాకన్నా అధికంగా బజ్ ఏర్పడింది… దూకుడుగా బిజినెస్ జరిగింది… థియేటర్లలోకి వచ్చింది… బోలెడన్ని ప్రీమియర్ షోలు పడ్డాయి… సరే, ఇంతకీ పాసైందా..? అయ్యింది..!!

హాలీవుడ్‌లో సూపర్‌మాన్, స్పైడర్‌మాన్, బ్యాట్‌మాన్, ఐరన్‌మాన్ వంటి బోలెడంత మంది సూపర్ నేచురల్ కేరక్టర్లు ‘మాన్లే’ గాకుండా… మానవాతీత, మాంత్రిక శక్తుల ఫిక్షన్లు బోలెడు… హారీపోటర్ వంటి నవలల సేల్స్ అబ్బురం కదా… అలాంటి కాల్పనిక సాహిత్యం, చలనచిత్రాలు, సీరియళ్లు, వెబ్ సీరీస్, యానిమేషన్స్ పిల్లల్నే కాదు, పెద్దల్ని కూడా ఆకట్టుకుంటాయి, సరైన రీతిలో ప్రజెంట్ చేస్తే…! మన హనుమాన్ సినిమా సంకల్పం కూడా ఆ రేంజే… కాకపోతే మరీ మన బడ్జెట్ తక్కువ కదా, అందుకని ‘ఎకానమీ బడ్జెట్ హనుమాన్’గా కనిపిస్తాడు…

hanuman

Ads

మన తెలుగు సగటు హీరోలు కూడా దాదాపు హనుమాన్ స్థాయిలోనే ఫైట్లూ గట్రా చేస్తుంటారు కదా… అనేకానేక శక్తుల్ని ప్రదర్శిస్తుంటారు కదా… ఇదీ దాదాపు అంతే.., కాకపోతే హనుమంతుడి శక్తిని, పురాణాల ఫ్లేవర్‌ను ఈ కథకు జత చేసి సూపర్ నేచురల్ హీరోయిజానికి ఓ జస్టిఫికేషన్ ఇస్తూ పోతాడు దర్శకుడు… గుడ్, సగటు తెలుగు సినిమాల్లో కనిపించే వెగటుతనం జోలికి పోకుండా నీట్‌గా తీశాడు… పిల్లలకు కూడా బాగా నచ్చేలా గ్రాఫిక్స్, కథ… సో, ఎంచక్కా ఫ్యామిలీతో వెళ్లి చూడదగిన సినిమా…

hanuman

పాన్ ఇండియా సినిమా కదా… దర్శకుడు కూడా నార్త్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టున్నాడు… ప్రధానంగా ప్రస్తుతం అయోధ్య జపంలో మునిగి ఉంది కదా నార్త్… సో, హనుమాన్ సినిమా రిలీజుకు కరెక్ట్ టైమింగ్… సౌత్‌లోకన్నా నార్త్‌లో హిందీ వెర్షన్ ఇంకాస్త ఎక్కువ క్లిక్ కావచ్చు కూడా..! ముఖ్యంగా క్లైమాక్స్‌లో భక్త జనాలకు పూనకాలు వస్తాయి…

hanuman

సంక్షిప్తంగా చెప్పాలంటే… చిన్నాచితకా దొంగతనాలు చేసుకుంటూ బతికే ఓ కుర్రాడు… ఓ అక్క (వరలక్ష్మి)… డాక్టరీ చదివే ఓ ప్రియురాలు (అమృతా అయ్యర్)… మరోవైపు అనేకానేక మానవాతీత శక్తుల్ని సంపాదించి సూపర్‌మాన్ కావాలనుకునే ఓ పాన్ ఇండియా విలన్… హీరో ఉండే అంజనాద్రి అనే ఓ పాతకాలం ఊళ్లో లోకల్ విలన్ ఇంకోవైపు… ఈ లోకల్ విలన్ కొట్టిన దెబ్బలకు నదిలో పడిపోయిన హీరోకు ఓ రుధిరమణి లభిస్తుంది… దాంతో హీరోకు సూపర్ పవర్స్ వస్తాయి, ఇది తెలిసి పాన్ ఇండియా సూపర్ విలన్ ఆ ఊళ్లో దిగిపోతాడు, తనకు ఆ రుధిరమణి కావాలి… ఏం జరిగిందనేది తరువాత కథ…

hanuman

గ్రాఫిక్స్ పర్లేదు, మరీ గొప్పగా అనిపించవు కానీ, మరీ తీసిపారేసినట్టుగా, నాసిరకంగా ఏమీ లేవు… మన బడ్జెట్‌కు మంచి ఔట్‌పుటే… సీన్లకు తగినట్టుగా ఉన్నయ్, ఆడ్‌గా లేదు… 60 కోట్ల సినిమాతో ఈ మేరకు ఔట్‌పుట్ అంటే విశేషమే… (ఆదిపురుష్ నిర్మాతలు, హీరో, దర్శకుడు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది… వందల కోట్లతో సబ్ స్టాండర్డ్ ఔట్ పుట్ సాధించారు) హనుమాన్ సినిమాలో బీజీఎం కూడా బాగా కుదిరింది… ప్రత్యేకించి క్లైమాక్స్‌లో మరీ ‘హనుమంతుడు’ ఆవరించినట్టుగా ఉంది…! తేజ మరీ హీరో లుక్కు లేదు, ఇంకా పిల్లాడిలాగే ఉన్నాడు… అక్కడక్కడా నటనలో కూడా..! పర్లేదు, త్వరలోనే ముదురుతాడు…

hanuman

హీరోయిన్ సోసో… వరలక్ష్మి గురించీ చెప్పుకోవాలి, పాత్ర తనకు నచ్చాలే గానీ అక్క, అమ్మ, లవర్, విలన్ ఏ పాత్రకైనా సరే… అలాగని లైట్ తీసుకోదు, మనసుపెట్టి చేస్తుంది… వినయ్‌రాయ్, సముద్రఖని వోకే… గెటప్ సీను, రోహిణి, సత్య తమ పాత్రల్లోకి ఎంచక్కా అలవోకగా దూరిపోయారు… అవకాశాలు ఇవ్వాలే గానీ మెరిటోరియస్ సరుకు బోలెడంత ఉంది మన బుల్లితెర మీద… వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు సినిమాలో…

hanuman

రవితేజ గురించీ ఓ మాట చెప్పుకోవాలి… అప్పట్లో ఏదో సినిమాలో సైకిల్ పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పినట్టున్నాడు కదా… ఏ ఈగో లేకుండా ఈ నిర్మాత దర్శకుడు అడగ్గానే కోతి పాత్రకు డబ్బింగ్ చెప్పాడు, సినిమాలో అదొక వెరయిటీ… కాస్త ఎడిటింగ్ మెళకువలు కూడా పనిచేసి ఉంటే, సినిమా కథ పరుగు తీసినట్టుగా ఉండి ఉంటే… ఇంకాస్త గ్రిప్పింగ్ ప్రజెంటేషన్ గనుక ఉండి ఉంటే… సినిమా మరో రేంజులో హిట్టయ్యేదేమో… అఫ్‌కోర్స్, ఇప్పటికీ ఇది పాసైనట్టే…!!

వెరైటీ జానర్ల మీద ఆసక్తి, ఆ శక్తి ఉన్న ఈ దర్శకుడికి సరైన బడ్జెట్, స్టార్ హీరో, పెద్ద బ్యానర్ గనుక దొరికితే… ఇంకా దున్నేస్తాడు..!! ఈ సినిమా పాసైతే త్రీడీ వెర్షన్ రిలీజ్ చేస్తామనీ, టీజర్ కూడా రెడీగా ఉందనీ, సీక్వెల్ కూడా చేస్తామనీ దర్శకుడు ఎక్కడో చెప్పినట్టున్నాడు… ఇంకెందుకు ఆలస్యం…? కానివ్వండి, జై భజరంగభళీ…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కితకితలు గీతాసింగ్… జోవియల్ సెల్ఫ్ పంచుల నడుమ కళ్లల్లో చెమ్మ..!!
  • సినిమా అంటేనే పత్తాలాట… ఏడిస్తే లాభం లేదోయీ ‘బార్బరికా..’
  • అత్తా అనసూయమ్మా… నీతో వరసోయమ్మా… హేమిటో, అప్పట్లో ఆ కథలు..!
  • గెలిచినవాడే తోపు..! ఇదే బాబు మార్క్ ‘పడిలేచే కెరటం’ ఫిలాసఫీ…!
  • మిస్టర్ అమిష్… పురాణాల్ని కూడా వక్రీకరించింది నువ్వు కాదా..?!
  • కొరియన్ హీరోయిన్… మంగోలియా విలన్… హీరో లోకలేనా సార్..?!
  • కాళేశ్వరం కత్తి ఇక మోడీ చేతిలో..! రేవంత్‌రెడ్డి వదిలేశాడు దేనికి..?!
  • పిచ్చి కూతలు, తిక్క చేష్టలు… మ్యూజిక్ అంటూనే ఇవేం పైత్యాలురా సామీ…
  • మూయించిన ఒక వీరుని కంఠం…. చక్రవర్తి టాప్ నంబర్ వన్ సాంగ్…
  • గోదాట్లో పడిపోయిన భానుప్రియ… ఆ నీళ్ల కింద ఊబి… హాహాకారాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions