వద్దూవద్దనుకుంటున్నా సరే, గుంటూరుకారం గురించి ఏదో ఒకటి రాయకతప్పడం లేదు… కాదు, దిల్ రాజుకు షాక్ గురించి కాదు, త్రివిక్రమ్ ఫెయిల్యూర్ గురించి కాదు, మహేశ్ బాబు గ్రాఫ్ పడిపోవడం గురించి కాదు, థమన్ కాపీ ట్యూన్ల గురించి కాదు, చివరకు కుర్చీ మడతబెట్టి పాటలో దౌర్భాగ్యం గురించి కూడా కాదు… ఇది ఓ డిఫరెంట్ యాంగిల్…
అల్లు అర్జున్ అలియాస్ బన్నీ… మెగా కంపౌండ్ ప్రొడక్ట్… పాన్ ఇండియా స్టార్… తెలుగులో మస్తు డిమాండ్ ఉన్న టాప్ స్టార్లలో తనూ ఒకడు… తను ఓ ట్వీట్ పెట్టాడు… ఇదుగో ఇదీ…
Ads
నాలుగేళ్ల క్రితం అల వైకుంఠపురంలో సక్సెస్ తాలూకు తీపిదనం ఇప్పటికీ యాదికొస్తున్నదట… కారకులైన అందరికీ కృతజ్ఞతలు అంటున్నాడు… పర్లేదు, ఒక విజయాన్ని గుర్తుచేసుకోవడం అవసరమే, తప్పు లేదు… కానీ ఈ టైమింగ్ మాత్రం బాగాలేదు… ప్రస్తుతం గుంటూరుకారం సినిమా ఢమాల్ అనడంతో త్రివిక్రమ్, మహేశ్ బాబు, దిల్ రాజు సహా గుంటూరుకారం టీమ్ మొత్తం నిరాశలో ఉన్నారు… సరిగ్గా ఈ సమయంలోనే తన పాత సినిమా సక్సెస్ గురించి నెమరేసుకుంటూ, ఆనందాన్ని షేర్ చేసుకోవడం కొంచెం శాడిస్టిక్ నవ్వులాగా ఉంది…
నిజానికి బన్నీ ఆచితూచి మాట్లాడతాడు, పొల్లు మాటలుండవ్… మరి ఎందుకిలా..? ఎందుకో ఎవరూ సరిగ్గా చెప్పలేరు గానీ, మహేశ్ బాబుకూ బన్నీకి మధ్య చాలా ఏళ్లుగా గుడ్ టరమ్స్ లేవు… మహేశ్ బాబు కూడా అనవసరంగా ఎవరినీ గెలకడు, తన పనేదో తనది… మరి ఎక్కడ నుంచి వచ్చిందో ఈ అగాథం…!
ఎస్, గుంటూరుకారం ఫెయిల్యూర్ మీద ఇలాంటి వెరయిటీ, డిఫరెంట్ ఎత్తిపొడుపులు కరెక్టు కావు… (అబ్బే, తన మనసులో ఏమీ లేదు, ఆ సినిమా వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే అని సమర్థన కూడా వినిపించినా సరే, ఆ దర్శకుడే ఇప్పుడు ఫెయిలై మడత కుర్చీలో కూర్చున్నవేళ ఇలాంటి ట్వీట్లు అనవసరం, అనుచితం, అసందర్భం…)
వోకే, ఇప్పుడు ఒక సినిమా పోయినంతమాత్రాన మహేశ్ బాబు కిరీటం ఏమీ కిందపడదు… తనకు ఓ మంచి హిట్ పడాలి, అదీ పాన్ ఇండియా స్థాయిలో రావాలి… కానీ సరైన టీం దొరకడం లేదు, కానీ రాబోయేది రాజమౌళి సినిమా… ఇక మూడేళ్లూ దాని మీదే ఉంటాడు మహేశ్ బాబు… అది వదిలేస్తే ఇదే బన్నీకి ఒక అజ్ఙాతవాసి, ఒక బ్రహ్మోత్సవం, ఒక గుంటూరుకారం వంటి డిజాస్టర్ ఎదురైతే అప్పుడు తన మీద కూడా పడతాయి రాళ్లు… వెటకారాలు, ఎత్తిపొడుపులు… ఇండస్ట్రీ అంటే అంతే… తన చేష్టల్లో ఆ సోయి కనిపించాలి, కానీ లేదు…
హనుమాన్ విషయానికివస్తే… సైంధవ్, నాసామిరంగ ఔట్ పుట్ కూడా సరిగ్గా లేదని టాక్… ఎలాగూ గుంటూరుకారం పోయింది… ఇక మిగిలింది కాస్త హిట్ టాక్ వచ్చిన హనుమానే… సో, థియేటర్లన్నీ తనకే… ఫుల్ వసూళ్లు… ఈ సక్సెస్ దర్శకుడు ప్రశాంత్ వర్మకు సూపర్ బూస్టింగ్… నార్త్‌లో కాంతార టైపు హల్‌చల్ క్రియేట్ చేస్తుందట… పైగా ఇది అయోధ్య టైమింగ్, నార్త్‌లో ఆ పండుగ వాతావరణం ఎక్కువ… దాంతో హనుమంతుడికీ పండుగే…!!
Share this Article