Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయోధ్య ఉద్యమసేనాని విజ్ఞత… గుడి రంధ్రాన్వేషకుల్లో లేకపాయె…

January 13, 2024 by M S R

విదేశీయులు సాగించిన ఆధిపత్య, సామ్రాజ్య, సాంస్కృతిక దండయాత్రలో కూలిపోయి… ఇన్నేళ్లూ పరధర్మాన్ని తను పునాదుల మీద నిస్సహాయంగా, నిశ్శబ్దంగా మోసింది అయోధ్యలోని ఆ కట్టడం..! విముక్తి పొందింది… ఓ భవ్యమందిరాన్ని ఆశిస్తోంది… భారత జాతి యావత్తూ అదే సంకల్పించింది… ఇంటింటికీ చేరుతున్న అయోధ్య అక్షితల పరమార్థం కూడా ఆ సంకల్పధారణే…

పూజ అయ్యాక కదా అక్షితలు… అసలు ప్రాణప్రతిష్ఠ జరగనిదే అక్షితల పంపిణీ దేనికి..? ఇదంతా రాజకీయం, ఎన్నికల్లో ఫాయిదా కోసం నాటకం అని అప్పుడే విమర్శలు… ఆ అక్షితల్ని మీ పూజామందిరాల్లోనే పెట్టుకుని, శుభకార్యాల్లో వాడుకొండని చెబుతోంది రామజన్మభూమి ట్రస్టు… గుడి నిర్మాణ పూర్వాపరాల్ని ఓసారి తలుచుకొమ్మంటోంది… అయోధ్య మన ఆత్మాభిమాన పునరుద్ధరణ ప్రతీక అంటోంది…

మరో నలుగురు శంకరాచార్యులట… ఠాట్, మేం వెళ్లబోం, గుడి పూర్తి గాకుండానే ప్రాణప్రతిష్ఠ ఏమిటి..? శాస్త్రవిరుద్ధం అని విమర్శలు స్టార్ట్ చేశారు… వాళ్లకన్నా హిందూ వ్యతిరేక కమ్యూనిస్టులు నయం అన్నట్టుగా..! భార్యను వదిలేసిన చేతులు రాముడిని తాకడం ఏమిటి అని మరోరకం విమర్శలు… ఇక్కడ రెండుమూడు అంశాలు… అయోధ్య వివాదం దగ్గర నుంచీ సదరు ఏ శంకరాచార్యుడు తెర మీదకు రాలేదు… వాళ్ల భాగస్వామ్యం నిండు సున్నా… భూమి పూజ దగ్గర్నుంచీ ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఉద్దేశపూర్వక వివాదాలకు తెరతీస్తున్నారు…

Ads

దేశంలో హిందూ వ్యతిరేక ఘాతుకాలు ఏం జరుగుతున్నా ఈరోజుకూ ఎన్నడూ నోళ్లు విప్పిన పాపాన పోలేదు… హిందూ మత ఆధ్యాత్మిక వ్యాప్తి దిశలో వాళ్లు చేసింది వాళ్లకే ఎరుక… పోనీ, ఇదే మోడీ భూమిపూజ చేశాడు కదా, అప్పుడూ తను సతీరహితుడే కదా… ఈ నోళ్లు అప్పుడెందుకు లేవ లేదు..? తను సన్యాసి, పైగా 140 కోట్ల ప్రజలకు పాలకుడు… ఆధ్యాత్మిక ఆచరణలో నిష్ఠతో ఉండేవాడు… ఎందుకిలా హిందూ సమాజంలో రచ్చ లేవదీస్తున్నారు ఇప్పుడు..? ఈ మఠాలు చెప్పిందే శాస్త్రమా..? దేశంలో అనేక పరంపరలున్నాయి… అయోధ్య అర్చకులు ఏది విహితమో వాళ్లనే నిర్ధారించుకోనివ్వండి… ఏది శాస్త్రబద్ధమో వాళ్లనే నిర్ణయించుకోనివ్వండి… ఐనా తుచ్ఛమైన రాగద్వేషాలను వదిలేయకుండా పీఠాధిపత్యాలు ఏమిటి స్వాములూ…

శ్రీరామనవమి మంచిది అంటారు… ఈ వాదనలకు అంతేముంది..? రాముడు పుట్టినరోజుతోపాటు సీతతో పెళ్లిరోజు, దశకంఠున్ని హతమార్చినరోజు, అయోధ్యకు తిరిగివచ్చిన రోజు… ఇలా అన్నీ విశేష దినాలే కదా… దేన్ని ఎంచుకోవాలి..? పోనీ, ఏది పుణ్యతిథియో వైష్ణవ సమాజాన్నే ఎంచుకోనివ్వండి… ఎలాగూ ప్రాణప్రతిష్టకు ఏ విశేషమూ లేని అభిజిత్ లగ్నాన్నే కదా ఎంచుకున్నది, ఇక నడుమ మీకొచ్చిన నొప్పి ఏమిటి..? ఇన్నేళ్లూ లేని నొప్పి…!! శృంగేరీ, ద్వారక పీఠాలకు శాస్త్రాలు తెలియవా..? వీరిలో ఒకాయన మోడీకి పరమద్వేషి… వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా పనిచేశాడు… తన అభ్యర్థిత్వాన్ని నిరాకరిస్తే ధర్నాకు దిగాడు… ఇక వీరి మాటలకున్న ఆధ్యాత్మిక పవిత్రత ఎంత..?

గుడి పూర్తి కానిదే ప్రాణప్రతిష్ఠ ఏమిటంటారు… గుడి ఇప్పుడప్పుడే పూర్తి కాదు, చాలా పెద్ద ప్రాజెక్టు… పూర్తి అనే దశ రాదు, ఏదో ఒకటి నిర్మాణం అవుతూనే ఉంటుంది… గర్భగుడి, ప్రాణప్రతిష్ఠ, దర్శన అనుమతి… ఇదే మొదటి దశ… అబ్బే, ఇదంతా రాజకీయం అంటారు, ఈవెన్ కాంగ్రెస్ కూడా అదే మాట… మరి రాజీవ్ గాంధీ కాదా గుడి తలుపులు తెరిపించింది..? దాన్నేమనాలి..? రాజకీయం కానిదేమిటి..? పైగా గత రెండు టరమ్స్ బీజేపీని గెలిపించింది కేవలం రాముడే కాదు కదా..!

ఈ నేపథ్యంలో సరైన ఎక్స్‌ప్రెషన్ అద్వానీ వైపు నుంచి కనిపించింది… అయోధ్య ఇష్యూలో జాతిని కదిలించినవాడు అద్వానీ… అదే అద్వానీ వెంట సహాయకుడిగా ఉన్నవాడు మోడీ… అదే మోడీ అదే అద్వానీని పక్కన పెట్టాడు… అవి పార్టీ ఆంతరంగిక అంశాలు, వాటిని కాసేపు పక్కన పెడితే ఇదే అద్వానీ 96 ఏళ్ల వయస్సులో అవేమీ మనసులో పెట్టుకోలేదు… తనను కావాలనే అయోధ్యకు రాకుండా చేస్తున్నారనే భావననూ వదిలేసి… హుందాగా ఒక్క పొల్లు మాట లేకుండా స్పందించాడు… 76 ఏళ్ల చరిత్ర ఉన్న రాష్ట్రధర్మ పత్రిక ప్రత్యేక సంచికలో ఇలా రాసుకొచ్చాడు…

‘‘నా అయోధ్య యాత్రలో కూడా మోడీ పూర్తిగా నావెంటే ఉన్నాడు… అప్పుడు తను పాపులర్ కాకపోవచ్చు, కానీ తననే రాముడు తన గుడి పునర్నిర్మాణం కోసం ఎంచుకున్నాడు… యాత్ర వేళ నేను నమ్మింది ఒకటే, ఏదో ఒకరోజు గుడి పునర్నిర్మాణం జరగక తప్పదని… ఆ టైమ్ వచ్చింది… అయోధ్య ఆలయనిర్మాణం నాకొక దివ్యస్వప్నం… 33 ఏళ్ల క్రితం నాటి నా యాత్ర నన్ను నేను ఇండియాను మరింత అర్థం చేసుకోవడానికి, నన్ను నేను మరింత విశ్లేంచుకోవడానికి ఉపయోగపడింది… బాధాకరం ఏమిటంటే, ఈ సమయానికి వాజపేయి నా పక్కన లేకపోవడం… ’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions