నిన్న ఎక్కడో చదివినట్టు గుర్తు… అప్పుడప్పుడూ అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చిపడే ఓ కేరక్టర్ ఉంది కదా… గరుడ పురాణ ప్రవచనకర్త అలియాస్ గరుడాచలం అలియాస్ శివాజీ… ఎప్పుడూ మనకు వింతే… తనేం మాట్లాడతాడో, ఆ మాటలు వార్తాంశాలు ఎలా అవుతున్నాయో… అప్పట్లో రవిప్రకాష్ చేతుల్లో టీవీ9 ఉన్నప్పుడు గంటల కొద్దీ ఆ ప్లాట్ఫామ్ వాడుకుని, జనం బుర్రల్ని ఫ్రై చేయకుండానే తినేసేవాడు… ఎన్టీవీ, టీవీ5, ఏబీఎన్ చానెళ్లలో అంత చాన్స్ దొరకనట్టుంది ఫాఫం… చాలారోజులైంది కదా హీరో గారు కనిపించక… మొన్న ఎక్కడో మాట్లాడినట్టున్నాడు… సేమ్, అవే మాటలు, అవే బేజా ఫ్రై ధోరణి… ఆయన వాదనల్లోని బ్రహ్మపదార్థం వంటి అర్థం ఏమిటో మనకు బోధపడటం కష్టం కానీ, ఆ సుదీర్ఘ వాదనలో కొన్ని ముఖ్యాంశాలు తీసుకుందాం, సరిపోతుంది… మరీ ఎక్కువ రాసేసి, మన పాఠకుల బుర్రల్ని ఫ్రై చేయడం అమానుషం అవుతుంది కాబట్టి…
- ఏపీ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా సెలబ్రిటీలు ముందుకు రారు
- అసలు జనరేషనే అలా ఉంది… అందాలు ఆరబోసిన అనసూయ అంటే చాలు 8, 9 మిలియన్ వ్యూస్ వస్తున్నయ్, కుక్కతో సుమక్క అంటే 4 మిలియన్ వ్యూస్… వాళ్ల క్రేజు అది, కానడం లేదు, కానీ అమరావతి ఉద్యమం అంటే 900 వ్యూస్ రావు…
- మనవాళ్లకు ఎంతసేపూ కులం ధ్యాసే తప్ప సమాజం మీద సోయి లేదు
- సోనూ సూద్ ముందు మన హీరోలు ఏపాటి..? ఐనా మా హీరో మా హీరో అని గుడ్డలు చించేసుకుంటారు…
- ఇప్పుడు స్ట్రీల్ ప్లాంట్ తీసేస్తే వాళ్లంతా ఎక్కడకు పోవాలి? ఆంధ్రావాళ్లు అడుక్కుంటూ ఉద్యోగాల కోసం హైదరాబాద్, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలా?
- తమిళనాడులో జల్లికట్టు పోరాటంలా మన వాళ్లు చేయలేరా..?
Ads
ఇదీ ఒకప్పటి సినిమా నటుడు శివాజీ అవగాహన స్థాయి… నాయనా, శివాజీ… విశాఖ ప్రైవేటీకరణ గురించి మాట్లాడితే దానికి కమిటైపో, మధ్యలో అనసూయ ఏం చేసింది..? సుమ ఏం చేసింది..? వాళ్ల పొట్ట తిప్పలేవో వాళ్లవి… వాళ్ల బొమ్మలకు ఎన్ని వ్యూస్ వస్తే నీకెందుకు..? అది చూసేవాళ్ల ఇష్టం, వాళ్లను ప్రేమించేవాళ్ల ఇష్టం… ఎట్టెట్టా… నువ్వు చెప్పావని సినిమా, స్పోర్ట్స్ ఎట్సెట్రా సెలబ్రిటీలంతా ఎగేసుకుని వచ్చేయాలా..? అబ్బఛా, వాళ్లకు సొంత తెలివితేటల్లేవా..? శివాజీ అనే తోపు ఉద్యమకారుడు చెప్పాడని బరిలోకి దిగాలా..? పైగా… ప్రైవేటీకరణ అంటే ఫ్యాక్టరీ తీసేయడమా..? వాళ్లంతా కొలువులు అడుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లాలా..? ఇదీ తమరి జ్ఞానసంపద… అచ్చు అనసూయ హాట్ బొమ్మలకూ, విశాఖ ఫర్నేసుకూ ముడిపెట్టినట్టే ఉంది… స్టిల్, ఈరోజుకూ అదే ధోరణి… ఆంధ్రావాళ్లను తన్నితరిమేశారట, రాజధాని లేదట… ఏదేదో చెప్పే శివాజీ… పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలేసి అర్థంతరంగా ఎందుకు పారిపోయి వచ్చాడో మీ చంద్రబాబును కదా అడగాల్సింది… అయిదేళ్లలో రాజజదానిని ఎందుకు కట్టలేదో అడగాలి కదా… ప్రశ్నించే హీరో పవన్ కల్యాణ్ విశాఖపై ఎందుకు మాట్లాడటం లేదో అడుగు… అంతేతప్ప అన్నింటికీ ఇలా అనసూయ కాళ్లకూ, డ్రెస్సులకూ ముడిపెట్టకు…!!
Share this Article