వినియోగదార్లను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనలకు గాను ఆయా కమర్షియల్స్‌లో డబ్బు తీసుకుని నటించిన నటీనటులను, సెలబ్రిటీలను కూడా బాధ్యులను చేస్తుంది వినియోగదారుల రక్షణ చట్టం… ఎందుకంటే, సొసైటీ పట్ల వాళ్లకూ జవాబుదారీతనం ఉంటుంది కాబట్టి… గుట్కా సరోగేట్ యాడ్స్ విషయంలో అమితాబ్ దగ్గర నుంచి అక్షయకుమార్ దాకా స్పందించారు… యాడ్స్ నుంచి వెనక్కి తగ్గారు… కానీ మన మహేశ్ బాబు మాత్రం తగ్గలేదు, దానిపై అస్సలు స్పందించలేదు… ఈ కథంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… మహేశ్ బాబుకు తను, తనకొచ్చే డబ్బు… ఇవే ప్రధానం…
విషయం ఏమిటంటే..? మహేశ్ బాబు అప్పట్లో నటించిన చిత్రం శ్రీమంతుడు గుర్తుంది కదా… అది నా కథే అంటూ శరత్ చంద్ర (విల్సన్..?) కోర్టుకెక్కడం, కోర్టు సదరు దర్శక రచయితపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయవచ్చునని చెప్పడం, సదరు దర్శక ఘనుడు కొరటాల శివ ఏకంగా సుప్రీం దాకా వెళ్లి భంగపడటం దాకా కథ అందరికీ తెలిసిందే…
ఈ కేసు నిజంగానే దర్శకుడు కొరటాల శివను బజారులో నిలబెట్టింది… దొరకనంతవరకూ అందరూ త్రివిక్రములు, రాజమౌళిలే… కానీ దొరికితే కొరటాల శివలు అవుతారు కదా… పరువు పోయింది… ఈ కేసులో రచయితల సంఘం కూడా సదరు రచయితకు అండగా నిలబడింది… అది అభినందనీయం… ఇండస్ట్రీలో బడా ప్లేయర్లతో వ్యవహారం, మనకెందుకు అనుకోలేదు… గుడ్…
Ads
ఐతే ఏదో ఒక చోట సమస్యకు ఫుల్ స్టాప్ పడాలి… నాకు అప్పట్లోనే 15 లక్షలు ఇవ్వజూపారనీ, ఇప్పుడు మహేశ్‌బాబు అండ్ నిర్మాతలపై కూడా కేసు వేస్తానంటున్నాడట రచయిత… (తను రాసిన చచ్చేంత ప్రేమ అనే కథనే కాపీ కొట్టారనేది రచయిత వాదన…) అదేమంటే దర్శకుడు కొరటాల శివ తాను చేసిన తప్పు అందరి ముందూ ఒప్పుకోవాలని, తనకు కావల్సింది తన క్రెడిట్ కోసమేనని శరత్ చంద్ర డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి…
ఎవరో ఒకరు పెద్దలు కలగజేసుకుని, ఎక్కడో ఓ చోట ఈ పంచాయితీని తెంపేయాలి… మరీ అందరి ముందు తప్పు ఒప్పుకోవాలి వంటి డిమాండ్లు ఆచరణయోగ్యం కావు… ఆల్రెడీ కొరటాల శివ తప్పు చేసినట్టు కోర్టే చెప్పింది కాబట్టి ఇక అందరి ముందూ తప్పు ఒప్పుకోవడం దేనికి..? దీనిమీద ఇంకా సాగదీస్తే క్రిమినల్ చర్యల మీద కూడా లీగల్ ఫైట్‌కు సిద్దపడతాడు కొరటాల శివ… అవసరమైతే కోర్టు చెప్పిన జరిమానా చెల్లిస్తాడు… ఉరిశిక్షో, జీవితఖైదో వేయరు కదా…
పైగా సదరు రచయిత ఏకంగా మహేశ్‌బాబు మీద, నిర్మాతల మీద కూడా కేసు వేస్తానంటున్నాడు… నిర్మాతల వరకూ వోకే, సినిమాకు సంబంధించిన ప్రతి అంశం మీద వాళ్లు బాధ్యులే కాబట్టి వోకే అనుకుందాం… (మహేష్ బాబు కూడా నిర్మాతల్లో ఒకరు)… కానీ తనే మొదట కేసు వేసింది దర్శక రచయిత మీద కదా… నిర్మాత కూడా బాధ్యుడే అనుకున్నప్పుడు అప్పుడే వాళ్లను కూడా ఇన్వాల్స్ చేసి ఉండాల్సింది… ఇప్పుడు వాళ్లపై కేసు వేసినా సరే, సదరు రచయిత దర్శకుడిని నమ్మామనీ, మాకే మోసం జరిగింది అని చెప్పగలరు… అప్పుడు కేసులో పంచ్ కూడా ఉండదు…
ఇక హీరోగా మహేశ్ బాబు…? తను పాత్రధారి, డబ్బు తీసుకుని, తన పోర్షన్ తను నటించేస్తాడు… అక్కడి వరకే తను పరిమితం… ఆ కథ కాపీయా, కాదా అనేది తనకు ఎలా తెలుస్తుంది..? పోనీ, ఈ రచయిత మహేశ్‌బాబును ముందుగానే ఏమైనా కేసులో ఇన్వాల్వ్ చేశాడా..? అదీ లేదు కదా… సినిమాలకు సంబంధించి పైన చెప్పుకున్న వినియోగదారుల రక్షణ చట్టం, వాణిజ్య ప్రకటనల నియమావళి ఏమీ వర్తించకపోవచ్చు… ఏదో తన కేసులో పంచ్ కోసం, కోర్టు తీర్పు చెప్పి సదరు రచయిత సినిమా టీంను ఇంకా వంచడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు… మరీ తెగేదాకా లాగితే ఒరిగేది ఏమీ ఉండదు బ్రదర్… ఈ కేసు సరే, ఇండస్ట్రీ గనుక కన్నెర్ర చేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నదీ పోతుంది… మధ్యేమార్గాలు మేలు…
Share this Article