సాధారణంగా తెలుగు సినిమాలు అంటేనే… ఆడ పాత్రలకు పెద్ద ప్రాధాన్యం ఉండదు, విలువ ఉండదు… ఏదో తెర నిండుగా కనిపించడానికి అక్కరకొచ్చే పాత్రలు… అంటే మెజారిటీ సినిమాల్లో… ఇక హీరోయిన్లయితే మరీ ఘోరం… హీరో పక్కన పిచ్చిగెంతులు వేయడానికి, అందాలన్నీ తెర మీద ప్రదర్శించడానికి తప్ప ఇంకెందుకు పనికిరారు… అంటే చాలా సినిమాల్లో…
ఏదో ఒకటీ అరా సినిమాల్లో, మంచి అభిరుచి ఉన్న దర్శకుల సినిమాల్లో మాత్రమే మహిళా పాత్రలకు సరైన చిత్రణ ఉంటుంది, కేరక్టరైజేషన్ ఉంటుంది… కానీ చాలా అరుదు… అదుగో ఆ కోవలోకి వచ్చేదే ఈరోజు విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్… మనకు ఫిదా సినిమాలో సాయిపల్లవి అక్క పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుంది కదా… ఎస్, ఆమే శరణ్య… ఒద్దికగా, మరిదితో చెల్లె పెళ్లి జరగాలని బలంగా కోరుకునే పాత్రలో పద్ధతిగా నటించి మెప్పించింది కదా…
మొదట్లో టీవీ న్యూస్ రీడర్ నుంచి తరువాత పలు సినిమాలు చేసింది… తెలంగాణకు చెందిన ఈమెకు మెరిట్ ఉంది… (నిజామాబాద్ నేటివ్ అనుకుంటా…) కానీ ఇన్నాళ్లూ ఏవో సహాయక పాత్రలు లభిస్తున్నయ్… ఏదో చేసేస్తోంది… సరైన రోల్ పడాలే గానీ ఇలాంటోళ్లకు ఏం తక్కువ..? దుమ్ము రేపరా..? ఎస్, ఈ సినిమాకు ఒకరకంగా హీరో ఆమే… సంపూర్ణంగా న్యాయం చేసింది… సినిమాలో హీరో సుహాస్ ఉన్నాడు, హీరోయిన్ శివాని ఉంది… కానీ సినిమా మొత్తం శరణ్య పాత్రే కీలకం… బాగా హైలైటె అయిపోయింది తన నటనతో…
Ads
విలన్ ఆమెను బట్టలు విప్పేసి ఓ స్కూళ్లో బంధించి వెళ్లినప్పుడు గానీ… పోలీస్ స్టేషన్‌లో విలన్‌ను కాలితో తన్నిన సీన్‌లో గానీ శరణ్య విజృంభించేసింది… సరే, సినిమాకు వద్దాం… ఓ సాదాసీదా ప్రేమకథే… ఒక ఊరు, విలనీ చేసే ఊరి పెద్ద… హీరో అక్కగా చేసిన శరణ్యకూ ఆ ఊరి పెద్ద విలన్‌కూ నడుమ ఏదో అక్రమ సంబంధం ఉందని ఊరంతా పుకారు… ఆమె ఏమీ పట్టించుకోకుండా టీచర్‌గా పనిచేస్తుంటుంది… వీకెండ్‌లో విలన్ మిల్లులోనూ పనిచేస్తుంటుంది…
సదరు విలన్ చెల్లెను హీరో ప్రేమిస్తాడు… అక్కడ స్టోరీ ఆరంభం… హీరోది బేసిక్‌గా సెలూన్ షాప్, పనిలోపనిగా తన టీంతో మ్యారేజీ బ్యాండ్ నడిపిస్తూ ఉంటాడు… విలన్ తమ్ముడికీ హీరోకూ నడుమ ఏదో గొడవ… అలాగే ఈ హీరో అక్కతోనూ అనుకోకుండా ఓ గొడవ… విలన్‌కు కోపమొచ్చి శరణ్యను రాత్రిపూట స్కూల్‌కు రప్పించి, బట్టలు లాగేసి, కాల్చేసి, ఆ రూమ్‌లో బంధించి వెళ్లిపోతాడు… పాపం, ఈ పద్మ (శరణ్య)ను ప్రేమించే మరో ప్రేమికుడు కాపాడతాడు… ఆవేశంతో విలన్ దగ్గరకు హీరో వెళ్తే తను గుండు చేయిస్తాడు,..
ఇలా కథ ఆ ఊరికే పరిమితమై… మరీ హీరోయిక్ వేషాలు ఏమీ లేకుండా… తెలుగు కమర్షియల్ హీరో వాసనలేవీ లేకుండా వీలున్నంతవరకూ రియలిస్టిక్ ధోరణితోనే సాగుతుంది… హీరో సుహాస్ సహా అందరూ పర్లేదు… అతి లేదు, తక్కువా చేయలేదు… పాటలు సోసో… కులాలు, డబ్బు అంతరాల ప్రేమకథలు బోలెడు చూశాం… దీనికి ఓ ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని కూడా జతచేసి కథ రాసుకున్నారు… అది పండింది… సో, సినిమా మరీ తీసిపారేసేది కాదు, అలాగని తప్పకుండా థియేటర్ వెళ్లి చూడాల్సిందే అన్నంత సీనూ లేదు…
Share this Article