అయోధ్యలో టీ ధర 55/- ! శబరి రసోయి!
ఈ వార్తని హై లైట్ చేస్తూ అదేదో ఘోరమైన నేరంగా పరిగణిస్తూ ప్రచారం చేస్తున్నారు!
అయితే 55/- రూపాయలు ధర నిజమేనా?
అవును నిజం!
కానీ అయోధ్య రామ మందిరంకి దగ్గరలోనే ఉన్న ఒక బిల్డింగ్ నాలుగో అంతస్థులో ఉన్న రెస్టారంట్ లో 55 రూపాయలు వసూలు చేసింది GST తో కలుపుకొని.
Well..! ఆ రెస్టారంట్ లో ధర అది!
ఇష్టమైతే తాగచ్చు లేదా రోడ్ పక్కన 10 రూపాయలకే టీ, 20 రూపాయలకే కాఫీ దొరుకున్నది కదా?
అక్కడ నిలబడి తాగాలి!
రెస్టారంట్ లో కూర్చొని తాగవచ్చు! సహజంగానే సిట్టింగ్ చార్జెస్ ఉంటాయి.
అయోధ్య దాకా ఎందుకు?
మన తెలుగు రాష్ట్రాలలో బండి మీద దోశ 30 రూపాయలు ఉంటే రెస్టారంట్ లో 70 రూపాయలు ఉంటున్నది. ఎవరూ అడగట్లేదు ఎందుకు?
ఎవడో కావాలని నాలుగో అంతస్థులో ఉన్న రెస్టారంట్ లో కూర్చొని టీ తాగి, బిల్లును ఫోటో తీసి వైరల్ చేయడం దురుద్దేశ్యంతో చేసిందే!
నీకు బిల్ ఇచ్చారు దానిలో GST ఉంది అంటే అది చట్ట విరుద్ధం అవుతుందా?
ప్రభుత్వానికి టాక్స్ కడుతున్నారు. రెస్టారంట్ అద్దె, పనివాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, ధర నచ్చకపోతే తాగకుండా ఉండాల్సింది.
బిల్లు ఇవ్వకుండా 55 రూపాయలు వసూలు చేసి ఉంటే అది అడగవచ్చు!
*******”**
55 రూపాయలు విషయం తెలియగానే అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ADA) స్పందించింది. ఆ రెస్టారంట్ కి నోటీసు ఇవ్వడం జరిగింది. ADA ఆధ్వర్యంలో అక్కడి వాణిజ్య పరంగా ధరలు నిర్ణయించింది. నిజానికి అన్ని వాణిజ్య సముదాయాలు ADA అనుమతి తీసుకొని ADA నిర్ణయించిన ధరలకే అమ్మకాలు చేయాలి.
అక్కడి వాణిజ్య సముదాయాలను ADA లీజుకు ఇచ్చింది.
ADA నిర్ణయించిన ధర 30 రూపాయలు మాత్రమే, అదీ ఆ రెస్టారంట్ కల్పిస్తున్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయించారు.
నాలుగో అంతస్థులో ఉన్నది కాబట్టి వ్యాపారం తక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ ధర నిర్ణయించారు.
అంత కష్టపడి నాలుగో అంతస్థులో ఉన్న రెస్టారంట్ కి వెళ్లి రెండు టోస్ట్ లు (వెన్నతో కాల్చిన బ్రెడ్) రెండు టీలు తాగి, 110 రూపాయలు కట్టి, బిల్లు మాత్రమే ఫోటో తీసి వైరల్ చేయడం వెనుక వెళ్ళింది హిందూ ద్వేషి అని తెలిసిపోతున్నది!
Ads
********
సదరు శాల్తీ కి అయోధ్యలో ఉచిత అన్న ప్రసాద వితరణ చేసేవి ఎందుకు కనపడలేదు?
రామ్ రశోయి (రశోయి అంటే వంటశాల). అయోధ్యలో ఉన్న ఈ రామ్ రశోయి అయోధ్యకి వచ్చే ప్రతీ భక్తులకి ఉచిత భోజనం అందిస్తుంది.
రామ్ రశోయిని కనక్ భవన్ (రాముడి గుడి) నిర్వహిస్తున్నది.
కనక్ రశోయి. ఇది భక్త సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్న హోటల్. ఇక్కడ అపరిమిత భోజనం 80/- రూపాయలకే అందిస్తున్నారు. రోటీ లేదా చపాతీ, అన్నం, రెండు రకాల కూరలు, సమోసా లేదా కచోరీ, పప్పు, పచ్చడి, సాంబార్, పెరుగు, మజ్జిగ, అప్పడం, నెయ్యి, ఏదన్నా ఒక తీపి పదార్ధం, ఇవి అన్ లిమిటెడ్.
కనక్ రశోయి కూడా కనక్ బిహారీ భవన్ (రాముని గుడి) నిర్వహిస్తున్నది.
పైన పేర్కొన్న వి అన్నీ శుచి, శుభ్రతతో చేసి రామ్ దర్బార్ లో నివేదన చేసిన తరువాతే వడ్డిస్తారు.
*********
చాల సెలెక్టివ్ గా నాలుగో అంతస్థులో ఉన్న రెస్టారంట్ కి వెళ్లి, మెనూ చూసి మరీ తిని, టీ తాగి, బిల్లు కట్టి వైరల్ చేసినవాడు ఎవరై ఉంటారు?
మనకి తెలిసిన అన్ని పుణ్యక్షేత్రాలలో అన్నసంతర్పణ జరుగుతున్నది.
కానీ నేను నాకు ఊహ తెలిసినప్పటి నుండి మొదట చూసింది అన్నపూర్ణాలయం, జిల్లెళ్ళమూడి. గత 60 ఏళ్ళుగా జిల్లెళ్ళమూడిలో వచ్చిన వారందరికీ భోజనాలు పెడుతూనే ఉన్నారు ఇప్పటికీ!
చైనా బ్యాచ్ ను కట్టకట్టి హిమాలయాలలో వదిలేసి రావాలి!
Share this Article