Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

1968 నాటికే వోటర్ల కొనుగోళ్లు ఆరంభం… ‘నిలువు దోపిడీ’ మూవీయే సాక్ష్యం…

February 3, 2024 by M S R

Subramanyam Dogiparthi……. ఈ సినిమా వంద రోజులు ఎందుకు ఆడిందో ఎప్పటికీ అర్థం కాదు . కేవలం NTR సినిమా కావటమే . సాధారణంగా దేవిక ఒద్దికగా ఉండే పాత్రలనే వేస్తుంది . ఈ సినిమాలో NTR నే మించిపోయి రేగింగ్ చేసేస్తుంది . వీళ్ళిద్దరి శృంగారం కూడా శృతి మించి ఆ రోజుల్లో విమర్శలకు గురయింది . ముఖ్యంగా B , C క్లాస్ సెంటర్లో బాగా ఆడింది . వాళ్ళ శృంగారం బాగా ఎక్కింది .

ntr
NTR వియ్యంకుడు యు విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు సి యస్ రావు దర్శకులు . కె వి మహదేవన్ సంగీత దర్శకుడు . చుక్కమ్మ అత్తయ్యరో బుల్ బుల్ పాట వీర హిట్ పాట ఆరోజుల్లో . అయ్యింది అయ్యింది అనుకున్నది , ఆడపిల్లలంటే హోయ్ హోయ్ టీజింగ్ పాట , ఇతర పాటలు బాగుంటాయి . కె వి మహదేవన్ స్థాయిలో పేరు తెచ్చుకోలేదు .
కృష్ణ , జయలలిత , సూరేకాంతం , నాగభూషణం , పద్మనాభం , రమాప్రభ , రాజబాబు , నాగయ్య ప్రభృతులు నటించారు . రాజనాల , ధూళిపాళ , ప్రభాకరరెడ్డి , ఎ వి సుబ్బారావు పంచాయతీ బోర్డు సభ్యులుగా ఒక సీన్లో కనిపిస్తారు . జనం మాకేమయినా ఊరక ఓట్లు వేసారా ; నోట్లు తీసుకునేగా వేసారు అనే డైలాగ్ 1968 లోనే ఉంది . మన ఓటర్లు అప్పటికే ముదిరిపోయారు . కాంతారావు ఒక చిన్న పాత్రలో మంత్రిగా కనిపిస్తారు .క్లుప్తంగా చెప్పాలంటే NTR ఇష్టమొచ్చినట్లు గోల గోల చేసే సినిమా . కోయ దొర , పహిల్వాన్ వంటి మారు వేషాలు . ఆరోజుల్లో సినిమాలంటే హీరోకి మారు వేషాలు ఉండాల్సిందే . ఇంక NTR అయితే చెప్పేదే లేదు . మా నరసరావుపేటలో ఓ రెండు మూడు సార్లు చూసి ఉంటా . యూట్యూబులో ఉంది కాని . Pirated video ని అప్లోడ్ చేసినట్లుగా ఉంది . బాగాలేదు . పాటల వీడియోలు కూడా లేవు . ఇంత హిట్ సినిమా వీడియోలు యూట్యూబులో లేకపోవడం ఆశ్చర్యమే . టి వి లో వస్తే చూడండి . మంచి గోల గోల సినిమా యమ గోల లాగా .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #TeluguCinemaNews #telugucinema

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions