ఉగాండా, సోమాలియా, రుమేనియా… అంతెందుకు చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్, మాల్దీవులు, శ్రీలంక రాజకీయాల్ని కూడా కొద్దోగొప్పో అర్థం చేసుకోవచ్చు…. కానీ నెవ్వర్… ఏపీ పాలిటిక్స్‌ను ఎవడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు… అవి అసలు రాజకీయాల నిర్వచనం కిందకు వస్తాయో లేదో కూడా తెలియదు…
వైనాట్ 175 అని గప్పాలు కొట్టిన జగనన్న ఎడాపెడా సిట్టింగుల మార్పిడికి పూనుకున్నాడు… 175 గెలుస్తాం, నేను గెలిపించుకుంటాను అనే ధీమా లేదనే కదా అర్థం… సరే, బీజేపీతో లోపాయికారీ అవగాహన తప్ప నేరుగా పొత్తు ఉండదు, అవగాహన ఉండదు, ఏదీ ఉండదు… చివరకు పోరాడేది కూడా ఉండదు… మరి ప్రత్యర్థి శిబిరం ఏమైనా సక్కగా ఉందా..? అది ఇంకా ఘోరం…
ఉదాహరణకు ఆంధ్రజ్యోతిలో (తెలుగుదేశం వాయిస్) వచ్చిన ఓ వార్తను చూద్దాం… మూడో వంతు సీట్లు కావాలని అడిగేవాడు కదా జనసేనాని.,. ఇప్పుడు చంద్రబాబు అవసరం పవన్ కు లేదు, పవన్ అవసరమే ఫాఫం చంద్రబాబుకు ఉంది… సరే, మూడోవంతు ఎలాగూ ఇవ్వడు కదా బాబు… 32 అడిగాడట పవన్… 20 వరకూ ఏకాభిప్రాయం కుదిరిందట… మరో ఐదు వరకూ పాపం పోనీలే అని ఇచ్చే చాన్స్ ఉన్నట్టు రాధాకృష్ణ రాసుకొచ్చాడు… కనీసం 27 ఇవ్వాలని అడుగుతున్నాడట పవన్… అసలు లోపల ఏం జరిగిందో ఆ ఇద్దరికే తెలుసు…
Ads
ఓ విశ్లేషక మిత్రుడు చెప్పినట్టు… ‘20, 30 ఎన్ని ఇచ్చినా మెజారిటీ స్థానాల్లో టీడీపీ నుంచి జనసేనలోకి పంపించి, ఆ బీఫామ్స్ ఇప్పించి, తరువాత మళ్లీ టీడీపీలోకి తీసుకోవడమే కదా…’ కాదంటే టీడీపీ రెబల్స్, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడు చంద్రబాబు… అంతే… గత ఎన్నికల్లో చాలా చూశాం ఇలా… కేసీయార్ తక్కువేమీ కాదు, తనూ అలాగే చేశాడు… ప్రజెంట్ రాజకీయాల్లో నైతికతలు, విలువలు, ప్రమాణాలు ఏముంటాయి..?
సరే, మళ్లీ అసలు విషయానికొద్దాం… బీజేపీతో అధికారికంగా జనసేనకు పొత్తుంది… కానీ టీడీపీతో సీట్ల షేరింగ్ చర్చల్లో బీజేపీ ప్రస్తావన, ప్రమేయం ఉండవు… 8న మళ్లీ భేటీ అట, 14న పాలకొల్లులో ఉమ్మడి సభ అట… మేనిఫెస్టో ప్రకటన అట… మరి బీజేపీ సంగతి..? అయోధ్య రాముడికే తెలియాలి… ఇంత జరుగుతున్నా సరే ది గ్రేట్ సోకాల్డ్ మోడీ, షా కిక్కుమనడం లేదు… అంటే, నీతో మాకు దోస్తీ, నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నా సరే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టా..? ఇదెక్కడి రాజకీయ దారిద్య్రం..?
జనసేనకు తెలుగుదేశానికి పెళ్లయినా సరే, కానీ నాతో ఉన్నట్టే లెక్క అన్నట్టా..? పోనీ, అంతటి సీనియర్, సుదీర్ఘకాలం చక్రాలు తిప్పిన చంద్రబాబు ఐనా ఆలోచించాలి కదా… జనసేనతో కాపురం సరే, కానీ అఫిషియల్ మొగుడి మాటేమిటి..? ఇంతకీ పవన్ ఎన్డీయేలో ఉన్నట్టా లేనట్టా..? మాకెవరూ వద్దుర భయ్, ఇప్పుడు జగన్‌తో లోపాయికారీ సయోధ్య ఉన్నట్టుగానే, రేప్పొద్దున ఎవరు అధికారంలోకి వచ్చినా సరే మేం ఇలాగే ఉంటాం అనేదేనా బీజేపీ వైఖరి..? అందుకే మొదటే చెప్పుకున్నది… ప్రపంచంలోని ఏ దేశ రాజకీయాలనైనా అర్థం చేసుకోవచ్చు… ఎక్సెప్ట్ ఏపీ పాలిటిక్స్…!!
Share this Article