మొన్న స్టార్ మా టీవీలో బిగ్‌బాస్ ఉత్సవం షోలోకి ఫుడ్ డబ్బాలతో సహా కుమారి ఆంటీని తీసుకొచ్చారు కదా… జోకులతో సరదాలు చేసుకున్నారు కదా… మరి ఇలాంటి హఠాత్ పాపులర్ స్టార్లను టీవీ తెర మీదకు తీసుకొచ్చు అలవాటున్న ఈటీవీ ఊరుకుంటుందా… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి తీసుకొచ్చేశారు…
హాయ్ నాన్నా, అందరూ బావున్నారా అని తన అలవాటైన పలకరింపుతో ఈ షోలో ఆంటీ ఏకంగా ఓ ఫుడ్ స్టాలే తెరిచింది… ఈటీవీ ఆస్థాన కమెడియన్లందరూ ఆమె చుట్టూ చేరి, ప్లేట్లు పట్టుకున్నారు… ఎవరొచ్చినా, ఏ ఎపిసోడ్ అయినా సరే పొట్టి నరేష్ మీద వెగటు కుళ్లు జోకులు పడుతుంటాయి కదా… ఇందులోనూ అంతే…
దొండకాయ పచ్చడి అన్నారు గానీ నాకు పడలేదు అని భాస్కర్ అంటుంటే… ‘ఇదుగో వీడికి పడినట్టుంది’ అని హైపర్ ఆది పొట్టి నరేష్ వైపు చూపిస్తాడు… (ఇందులో బూతు అర్థం ఏమిటో తెలియాలంటే, ఆది భాషలో మినిమం డిగ్రీ చదివి ఉండాలి…) ఈ జోక్ కుమారి ఆంటీకి ఏం అర్థమైందో గానీ ఆమె కూడా నవ్వేసింది… (ఈ గుంపులో యాంకర్ రష్మి కనిపించలేదు, మైకు పట్టుకుని వర్ష కనిపిస్తోంది, అదేమిటో…)
Ads
2022 బ్రాంజ్ మెడల్ విన్నర్ నందిని అగసరను కూడా వేదిక మీదకు తీసుకొచ్చారు… అథ్లెటిక్స్‌లో ఎన్నో మెడల్స్ సంపాదించినా సరే, కడుపు నింపుకోవడమే కష్టంగా ఉన్న తన దురవస్థను చెప్పుకుంది ఆమె… నిజంగా శోచనీయం… మన దేశంలో క్రికెట్ అంటే వేల కోట్ల దందా… బెట్టింగులు, ఫిక్సింగులు గట్రా… ఇక క్రికెటర్లకు పాపులారిటీ, డబ్బుల కథ చెప్పనక్కర్లేదు…
కానీ మిగతా ఆటలు..? ఇదుగో నందిని కథలాగే…! ఇలాంటి విషయాల్లో హైపర్ ఆది తన ఔదార్యాన్ని చాటుతుంటాడు… వెంటనే ఈ షోకు తన పేమెంట్ ఎంత ఇస్తారో ఆ మొత్తాన్ని నందినికి ఇస్తున్నట్టు అక్కడే చెప్పాడు… సేమ్, మిగతా కొందరు అలాగే స్పందించారు… సరే, ఇవేమీ ఆమె బతుకును గాడిన పడేయకపోవచ్చు… కానీ మన అథ్లెట్లకు దక్కుతున్నదేమిటో ఈ ఎపిసోడ్ బాగానే చెప్పింది… ఇది బాగుంది… ఎస్, ఇలాంటివి జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగే అవకాశాలున్న ఈ వేదిక మీద… ఆ ఢీషోలోని ఏదో పిచ్చి డాన్స్ బిట్ ప్రదర్శించారు… ఏమీ బాగోలేదు…
అవునూ… టీవీ షోలకు టీఆర్పీలు కూడా పెంచడానికి కుమారీ ఆంటీ ఇలాంటి షోలకు వస్తోంది కదా… ఈసారి బిగ్‌బాస్ హౌజులోకి కూడా తీసుకెళ్తారా..? ఏమో, అదీ జరగొచ్చు… గంగవ్వను ప్రవేశపెట్టలేదా ఆమధ్య..? కానీ ఆమె ఫుడ్ స్టాల్ వ్యాపారానికి దెబ్బ కాబట్టి ఆమె రోజులతరబడీ ఒక టీవీషోకు టైమ్ కేటాయించడం కష్టమే…
Share this Article