మైఖేల్ జాక్సన్… పరిచయం అక్కర్లేని పేరు… డాన్స్‌కు ఐకన్… వరల్డ్ ఫేమస్…
ప్రాణమంటే మహా తీపి, 150 ఏళ్లయినా బతకాలని కోరిక… బలమైన కాంక్ష…
జుట్టు నుంచి కాలి వేళ్ల దాకా రోజూ పరీక్షించడానికి 12 మంది డాక్టర్లను పెట్టుకున్నాడు…
తనకు పెట్టే ఆహారం ముందుగానే ఖచ్చితంగా ప్రయోగశాలలో పరీక్షించబడేది…
తన రోజువారీ వ్యాయామం, వర్కవుట్లను పర్యవేక్షించడానికి 15 మందిని నియమించుకున్నాడు…
ఎప్పటికప్పుడు ఆక్సిజెన్ లెవల్స్ సరిచూసేలా, సరిచేసేలా కొత్త టెక్నాలజీ తన పడకమంచానికి బిగింపజేశాడు…
ఎప్పుడు ఏ అవసరం పడుతుందోనని… కీలకమైన అవయవ దాతలను ముందే మాట్లాడి పెట్టారు… వాళ్ల బాగోగుల్ని తనే చూసుకునేవాడు… నెలనెలా డబ్బు ఇచ్చేవాడు…
150 ఏళ్లు… ఇదే తన ఆకాంక్ష… కానీ ఏం లాభం… పాపం, 25 జూన్, 2009న యాభై ఏళ్లకే కన్నుమూశాడు…
గుండె అకస్మాత్తుగా ఆగిపోయింది… లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలకు చెందిన 12 మంది ఎక్స్పర్టు డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఇక అది కదల్లేదు… శాశ్వతంగా మూగబోయింది…
25 ఏళ్లుగా డాక్టర్లు చెబితే తప్ప అడుగు బయటపెట్టని ఆయన తన 150 ఏళ్ల కలను నెరవేర్చుకోలేకపోయాడు…
25 లక్షల మంది చూశారు తన అంతిమయాత్రను, ఆ సమయంలో ట్విట్టర్, వికీపీడియా, గూగుల్ గట్రా సెర్చింగు భారం మోయలేక చతికిలపడ్డాయి…
మృత్యువును, డెస్టినీని తను సవాల్ చేయాలనుకున్నాడు… డెస్టినీ ఓ నవ్వు నవ్వి తనను అర్దాయుష్షుకే తీసుకుపోయింది…
ఆయుష్షు రాసిపెట్టి ఉండాలే తప్ప నీ ప్రయత్నం వృథా… మన బాడీ కాన్‌స్టిట్యూషన్ అలా పుట్టుకతో నిర్మితమై ఉండాలి… అదీ జీవననియమం…
అందుకని రేపు ఏమిటో తెలియదు… కరోనా ప్రపంచానికి నేర్పించిన పాఠం కూడా ఇదే… ఈ క్షణాన్ని అనుభవించు… జీవితమంతా గొడ్డు చాకిరీ అవసరమా..? రేపు నువ్వే లేనినాడు నువ్వు సంపాదించిన ఆస్తి అంతా ఎవరి కోసం..?
విధి ఓ క్రూరమైన నవ్వుతో నిన్ను తీసుకుపోయినప్పుడు… నీ బీరువాలో మూలుగుతున్న కోట్ల విలువైన ప్లాట్ల కాగితాలు ఏమీ పనికిరావు…
ఐశ్వర్యం కేవలం ధనం వల్లే కలగదు… అది అర్థం చేసుకోవడమే జీవితం..!! రాబోయే దాన్ని నిర్వికారంగా స్వీకరించడమే నీ విధి అని మైఖేల్ జాక్సన్ జీవితం చెప్పిన గ్రేట్ లెసన్…
(చాలామంది ఈ పోస్టును ఇంగ్లిషులో చదివే ఉంటారు… దానికి నా తెలిసీతెలియని తెలుగు అనువాదం ఇది… ఎక్కువ మంది చదవడానికి మైఖేల్ జాక్సన్ పేరు వాడుకుని ఉంటారు, ఐనాసరే, జీవితసత్యం మాత్రం ఇదే…)
Share this Article