ఒక వార్త ఇంట్రస్టింగ్ అనిపించింది… ముందుగా వార్త చదవండి… ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి రైల్వే హాల్ట్ / స్టేషన్ కోసం భూమిపూజ జరిగింది… ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు… ఆ భక్తులకు ఇక రైల్వే ప్రయాణం, దర్శనం సులభతరం అవుతుంది… ఈ భూమిపూజలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గుడి చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, స్థానిక నాయకుడు మహదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…
… ఇదీ వార్త… గుడ్… బాగుంది, మల్లన్న ప్రోగ్రాం కాబట్టి పార్టీలకు అతీతంగానే అక్కడి ముఖ్యులు హాజరయ్యారు… అదీ బాగుంది… అయితే లింక్ దొరకనిది ఏమిటంటే..? మధ్యప్రదేశ్ సీఎంకూ కొమురవెల్లికీ ఎక్కడా లంకె కుదరడం లేదు స్థూలంగా చూస్తే…! ఎస్, కొమురవెల్లి మల్లన్న అంటేనే యాదవ కులస్తులకు కులదైవం… సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతరకు హైదరాబాద్ యాత్రికులు లక్షల్లో వస్తారు… యాదవులు అయితే ఏటా ఒకసారి దర్శనం తప్పనిసరిగా భావిస్తారు…
Ads
వీరశైవ లింగాయతులకు కూడా ఇది ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం… సో, అందుకని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యాదవుడు కాబట్టి తనను ముఖ్య అతిథిగా పిలిచారా..? కావచ్చు… కానీ తను ఎప్పుడూ కొమురవెళ్లికి వచ్చినట్టు తెలియదు… పైగా యాదవులు అనగానే దేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్ యాదవ రాజకీయ నాయకులే గుర్తొస్తుంటారు అధికంగా… మధ్యప్రదేశ్ సీఎంను కూడా యాదవ ముఖ్యుడిగా ఐడెంటిఫై చేసి బీజేపీ ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా పిలిచారు…
బాగుంది, కానీ ఈ ఆహ్వానం వెనుక ఏదో రాజకీయ మెలిక ఉంటుంది… లేకపోతే తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలే భూమిపూజ చేసేవాళ్లు… వినిపించిన సమాచారం ఏమిటంటే..? సికింద్రాబాద్ నుంచి ఈసారి బీఆర్ఎస్ నుంచి తలసాని సాయికుమార్ యాదవ్, కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ నిలబడే సూచనలున్నాయి… సిటీ యాదవుల్లో కొమురవెళ్లి మల్లన్నను కొలవనివారు ఎవరుంటారు..? ఈసారి కూడా సికింద్రబాద్ నుంచే కిషన్ రెడ్డి మళ్లీ పోటీచేస్తాడు… (ఈ అనిల్ కుమార్ యాదవ్‌ను ఇప్పుడు కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీని చేస్తోంది… కొమురవెళ్లి టూర్ ఈ ప్రకటనకు కాస్త ముందే ప్లాన్ చేశారు…)
యాదవులను ప్రసన్నం చేసుకోవడానికి వీలుగా మధ్యప్రదేశ్ యాదవ ముఖ్యమంత్రిని పిలిచి, భూమిపూజ చేయించి, సంప్రదాయబద్ధంగా పూజలు చేయించి… (కొమురవెళ్లి పూజల విశిష్టత, విధానం వేరు) యాదవుల అటెన్షన్ పొందే ప్రయత్నం అన్నమాట… తప్పుపట్టే పనిలేదు, రాజకీయం అంటే రకరకాల సమీకరణాలు కదా… ఇలా భలే ప్లాన్ చేశారన్నమాట… పర్లేదు, బీజేపీ ఆలోచన బాగానే ఉంది… రఘునందన్‌రావు, లక్ష్మణ్ తదితరులు కూడా పాల్గొన్నారు…
ఐతే ఈ ఒక్క సికింద్రాబాద్ స్థానం గురించే కాదు, కిషన్ రెడ్డి ప్లాన్ చేయాల్సింది తెలంగాణవ్యాప్త ప్రణాళికలు… సరే, బీజేపీ అంటేనే గుళ్లు, దేవుళ్లతో లింకయ్యే రాజకీయాలు సహజమే కదా… ఇక్కడా చేశారు వోకే… కానీ మిగతా ఎంపీ స్థానాలకు..? (మోడీ వెళ్లమని ఆదేశించాడు, అందుకే ఇక్కడికి వచ్చాను అని మధ్యప్రదేశ్ సీఎం తన ప్రసంగంలో చెప్పడం భలే ముక్తాయింపు)… చివరగా చిన్న డౌట్… ఒకవేళ బీజేపీతో బీఆర్ఎస్‌కు అవగాహన గనుక కుదిరితే… ప్రచారంలో ఉన్నట్టుగా… కిషన్ రెడ్డి కోసం బీఆర్ఎస్ ఎదుగుతున్న నేత తలసాని సాయికుమార్ యాదవ్ ఆశలను పాతరేయడమేనా..?!
Share this Article