అబ్బో, అబ్బో… ఎంత పాపులారిటీ… టీవీ షోలు, ఇంటర్వ్యూలు, యూబ్యూబ్ వీడియోలు… మస్తు సంపాదన… కుమారీ ఆంటీ కథ అంతా తెలిసిందే కదా… ఎవరెవరికో ఇంటర్వ్యూలు ఇస్తే, అవి కాస్తా వైరల్ అయిపోయి, రష్ పెరిగిపోయి, ట్రాఫిక్ నాన్సెన్స్ పెరిగిపోయి, పోలీసులు తన స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్ మూసేయడం, సీఎం జోక్యం చేసుకుని, పోనీ వదిలేయాలంటూ ఆదేశించడం అందరికీ తెలిసిందే కదా…
ఈ దెబ్బకు ఫుడ్ స్టాల్ పూర్తిగా మూతపడాల్సింది పోయి, రేవంత్ పుణ్యమాని ఇంకా హైప్ పెరిగిపోయింది… ఈలోపు పలు పార్టీల సోషల్ మీడియా విభాగాలు రంగంలోకి దిగి ఇంకాస్త రచ్చ చేశాయి… వెరసి ఏమైంది..? మళ్లీ స్టాల్ వద్దకు వెళ్లి, సెల్ఫీలు దిగి, మళ్లీ సోషల్ మీడియాలో పెడుతూ నెటిజన్లు ఆమె స్టాల్‌ను మరింత పాపులర్ చేశారు,.. రీల్స్, షార్ట్స్, ఆమె జీవితమే ఒక్కసారిగా మారిపోయింది…
అక్కడికి పోయి, ఏదో గతకకపోతే ఇక జన్మ వేస్ట్ అన్నంతగా, జీవితంలో అలాంటి ఫుడ్ ఎరగనట్టుగా… వేషాలు… హైదరాబాద్‌లో ఇదొక పైత్యం,.. ఆమె తెలివైంది కదా, గాలి వీచినప్పుడే తూర్పారపట్టుకోవాలి అన్నట్టుగా రేట్లు పెంచేసిందట… ఐతేనేం, జాతర నడుస్తూనే ఉంది… ష్, కొందరు బ్లాకులో కూడా కొంటున్నారని సోషల్ పోస్టుల గుసగుస…
Ads
అదుగో ఫలానా హీరో భార్యతో సహా వెళ్లాడట తెలుసా..? మొన్న ఈటీవీ, స్టార్ మాటీవీ షోలకు వెళ్లొచ్చాక ఇంకా పాపులర్ అయ్యిందట, భారీ రెమ్యునరేషన్లు కూడా తీసుకుందట తెలుసా.? ఫలానా హీరోయిన్ కూడా వెళ్లి ‘రెండు లివర్ ఎక్సట్రా’ ఆర్డర్ ఇచ్చిందట తెలుసా..? వంటి వార్తలు కోకొల్లలు… చివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా న్యూస్ సైట్లు సైతం ఏదో ఒకటి రాయలేక, రాయకుండా ఉండలేక సతమతం…
అబ్బో, ఆమె ఫుడ్ బాగా లేదని అంటే ఇంకేమైనా ఉందా అన్నంత భయం, అందుకే అందరూ ఆహా ఓహో సూపర్ అని పొగిడేవాళ్లే… ఒక్కతి, ఒకే ఒక్కతి ఛస్, ఆ ఫుడ్ ఏం బాగుందిర భయ్ అని ప్లేటు బద్దలు కొట్టేసింది… ఆమె పేరు కీర్తి భట్… స్ట్రెయిట్ ఫార్వర్డ్… ఆమె కుమారీ ఆంటీ ఫుడ్ చుట్టూ అల్లుకున్న ఓ మాయను, ఓ భ్రమను అలవోకగా బ్రేక్ చేసింది…
కీర్తి భట్ తెలుసు కదా… బిగ్‌బాస్ ఫేమ్… పలు జీవితకష్టాలతో చచ్చి బతికి, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తన కెరీర్ కాపాడుకుంటున్న ఆమె గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం… సింపుల్‌గా ఓ వీడియోలో కుమారీ ఆంటీ ఫుడ్ ఏమంత బాగాలేదని తేల్చి పారేసింది… తన కాబోయే భర్త విజయ్‌తోపాటు ఫుడ్ స్టాల్ దాకా వెళ్లి, తిని మరీ తీర్పు చెప్పింది… వైట్ రైస్, చికెన్ ఫ్రై తీసుకుని 170 పే చేసిందట… ఆ స్పైసీ ఫుడ్ బాగుందీ బాగాలేకపోవడం కాదు, తను అసలు తినలేకపోయిందట…
అవును మరి… క్వాంటిటీ పెరిగింది, అంటే గిరాకీ పెరిగింది, మస్తు వండుతున్నారు… కానీ అదే సమయంలో ఫుడ్ క్వాలిటీ మీద కాన్సంట్రేషన్ తగ్గిపోయింది… సహజమే కదా… మన సిటిజనుల ఆత్రం, పైత్యంతో ఆ ఫుడ్ టేస్ట్ పెరగదు కదా…!! మరో పది మంది సెలబ్రిటీలు ఆ ఫుడ్ తిని తీర్పులు చెబితే తప్ప కుమారీ ఆంటీ ఆకాశం నుంచి కిందకు దిగేట్టు లేదు..!!
Share this Article