ఒకప్పడు సూపర్ సింగర్ షో అంటే ఓ థ్రిల్… పాటల పోటీ పోటాపోటీగా ఉండేది… కంటెస్టెంట్ల గానసామర్థ్యం మీద సునిశిత విశ్లేషణ ఉండేది, హుందాగా ఉండేది షో… కానీ ఇప్పుడు..? వెగటుతనం, వెకిలితనం… వెరసి ఓ వెధవతనం…
అప్పట్లో కూడా శ్రీముఖి ఈ షోను హోస్ట్ చేసింది… ఇప్పుడు కూడా చేస్తోంది తాజా సీజన్‌కు… కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే..? అప్పట్లో శ్రీముఖి పద్దతైన డ్రెస్సులతో కనిపించేది… కానీ ఇప్పుడు అంటారా… ఒకసారి ఈ ఫోటో చూడండి…
Ads
అది మ్యూజిక్ షో అనుకుందా..? ర్యాంప్ మీదకు నడిచి వచ్చే క్యాట్ వాక్ షో అనుకుందా..? పైగా ప్యాంటు వేసుకోవడం మరిచిపోయినట్టు, అంత పైకి ఆ స్కర్ట్ ఏమిటి..? అసలే హైపిచ్ కూతలు, పైగా ఈ వెగటు లుక్కులు… ఏమిటమ్మా, ఏమైంది నీకు..? ఎవడు అడిగాడు నిన్ను ఎక్స్‌పోజింగ్ చేయాలని..! ప్రస్తుతం మాంచి డిమాండ్‌లో ఉన్న యాంకర్‌వి… ఎందుకీ వేషాలు..?
అవకాశాలు తగ్గిన వాళ్లు తమలో ఇంకా సరుకు మిగిలే ఉందని చెప్పడానికి యూట్యూబ్ జిమ్ వీడియోలు, రీల్స్ గట్రా చేసి దర్శకనిర్మాతల కళ్లల్లో పడాలని చూస్తుంటారు… మరి శ్రీముఖికి ఏం కరువొచ్చిందని..! ఇప్పుడే కాదు, ఆమధ్య జీసరిగమప అనే సేమ్ మ్యూజిక్ షోకు కూడా ఇలాగే వచ్చింది… అసలు ఈమే కాదు, ఈమెకు బామ్మ, మామ్మ టైపు అనసూయ… వద్దులెండి, ఆమె డ్రెస్సింగు తీరు, మాల్దీవుల్లో ఆమె బికినీ షోలు గట్రా చూస్తే, ఏమైనా వ్యాఖ్యానిస్తే మళ్లీ బోలెడు నీతులు చెబుతుంది…
ఈసారి సూపర్ సింగర్ ప్రోమో ప్రకారం… శ్రీముఖి కాళ్ల ప్రదర్శన చూసి అనంత శ్రీరామ్ అదిరిపోయాడు… అదీ ఓ వెకిలి ఎపిసోడ్‌కు దారితీసింది… తను పైకి ఎటెటో చూస్తుంటాడు, రాహుల్ తనను ఎందుకు కిందకు చూడటం లేదు..? దవడలు పట్టేశాయా అనడుగుతాడు, ఈలోపు ఆర్ఆర్ పడుతుంది… ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ… శ్రీముఖి అదేదో ఘనకార్యం చేసినట్టు ఫీలవుతూ ‘మీ మనోభావాలు దెబ్బతిన్నాయా’ అనడుగుతుంది… అబ్బే, మనోభావాలు ఉబ్బితబ్బిబ్బయ్యాయి అని ఏడ్వలేక, నవ్వలేక అనంతశ్రీరామ్ దాటేస్తాడు…
అసలు దీనికి సూపర్ సింగర్ అని పేరెందుకు..? బీబీ ఉత్సవంలాగా మరో పేరు పెడితే పోయేది… ఈసారి బిగ్‌బాస్ ఫేమ్ యాక్టర్లను దింపి డాన్సులు చేయించారు, కంటెస్టెంట్లు పాడే పాటలకు… ప్రయోగమో, పైత్యమో… బీబీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అని పేరు పెడితే సరిపోయేది… హమీదా, భాను, అర్జున్, అమర్, తేజస్విని తదితరులు కనిపించారు… హమీదాను ఎత్తుకునే కంటెస్ట్ ఒకటి పెట్టారు సింగింగ్ కంటెస్టెంటుకు… హవ్వ… తనకు చేతకాకపోతే బాహుబలి రాహుల్ వచ్చి ఎత్తుకుంటాడు… మనం దీన్ని సింగింగ్ కంపిటీషన్ షో అని నమ్మాలి… ఎందుకు, ఎందుకొస్తారో తెలియదు కొందరు…! ఇలాగే తగలెట్టండి నిరంజన్ గారూ..!!
Share this Article