Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘మృత్యుంజయా… ఇంతకీ ఈ సినిమా కథేమిటి మహాశయా…’

March 6, 2026 by M S R

.

హేమిటో … కొంత మంది ఉంటారు ఇండస్ట్రీలో… హిట్టో ఫ్లాపో జానేదేవ్… వరుసగా సినిమాలు వస్తూనే ఉంటాయి… రకరకాల పాత్రలు చేస్తూనే ఉంటారు… శ్రీ విష్ణు కూడా అంతే…

థియేటర్లలో విష్ణు విన్యాసం నడుస్తూనే ఉంది, తాజాగా మృత్యుంజయ్ వచ్చేసింది… ఇది థియేటర్ల నుంచి వెళ్లేలోపు మరొకటి వదులుతాడు… ఇలా సాగుతూనే ఉంటుంది… మరి సినిమా ఎలా ఉంది..? సినిమా మొత్తం పూర్తయ్యాక కూడా అసలు ఈ సినిమా కథేమిటి..? ఇంత మంది ఆర్టిస్టులు ఏం చేశారు సినిమాలో అనేది అస్సలు బోధపడదు…

Ads

వోకే, శ్రీవిష్ణు వరకు పర్లేదు, అదీ ఆ పాత్రకు తగినట్టు..! మరి ఆ పాత్రే సరిగ్గా వండబడకపోతే..? పాపం, తనైనా ఏం చేయగలడు..? పత్రికల్లో శ్రద్ధాంజలి ప్రకటనలు సేకరించే ఓ మార్కెటింగ్ ఎంప్లాయీ హీరో… పర్లేదు, మానవాతీత పాత్ర గాకుండా మనలో ఒక పాత్ర…

మనోడికే క్రైమ్ రిపోర్టింగ్, క్రైమ్ ఇన్వెస్టింగేటింగ్ ఇంట్రస్టు… ఫీల్డులో అలాంటి పరిశోధనలు ఏమీ ఉండవు అని ఫీల్డ్ రిపోర్టర్లకు తెలుసు, కానీ ఈ సినిమా కథ రచయితకు తెలియదు కదా… ఏవో రెండు శవాల మీద ఏకరూప గుర్తులు గమనించి ఇక మనోడు రంగంలోకి దిగిపోతాడు.,.

క్రైం థ్రిల్లర్లు ప్రేక్షకుడికి ఎప్పటికప్పుడు కథ అర్థమైపోతుంటే మజా ఏముంటుంది..? అలా ఉండొద్దంటే పకడ్బందీ స్క్రీన్ ప్లే, కథాగమనం ముఖ్యం… అవి లేవు ఈ సినిమాలో… రెబ్బ మోనికా జాన్ ఏసీపీ అట… ఆమె అస్సలు సూట్ కాలేదు… ఆ పాత్రకు పెద్ద సీన్ కూడా ఏమీలేదు సినిమాలో పెద్దగా…

హంతకుడెవరో మనకు ముందే చెప్పేస్తాడు దర్శకుడు… హీరోకు ఎలా తెలుస్తుందనేదే కథ… ఇంట్రస్టింగ్… దాన్నే కాస్త రక్తికట్టేలా మలిస్తే బాగుండేది… రచ్చ రవి, సుదర్శన్, అయ్యప్ప శర్మ, ఐశ్వర్య, బాలాదిత్య, అనీష్ కురువిల్లా, విలన్ నందగోపాల్… చాలామంది ఉన్నారు… అంతమంది ఎందుకున్నారో దర్శకుడికైనా అర్థమైందో లేదో తెలియదు…

సంగీతం సోసో… ఓహో, మృత్యుంజయ్ అంటే… మృత్యు ఎన్ జయ్ అని ముగ్గురు వ్యక్తులా..? టైటిల్ జస్టిఫికేషనా ఇది… సినిమాలాాగే ఉంది అర్థమయ్యీకానట్టు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దుష్టశక్తి కాష్మోరాలు !! అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? (రెండో భాగం)
  • హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)
  • ఇక నా జీవితానికి క్యాలెండర్ అవసరం లేదు… గడియారం చాలు…
  • ప్రధాని వీడియో పీకిపారేస్తేనే నొప్పి తెలిసింది- చురుకు పుట్టింది !!
  • కల్తీకి ‘పాలు’పడ్డవాడెవడినీ వదల్లేదు – ఎవరికీ మింగుడుపడడు !!
  • కర్ణుడి చావుకు లక్ష కారణాలు… బీజేపీ ఓటమికి లక్షాఒకటి !
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • చరిత్ర మళ్లీ మొదటికే… 200 ఏళ్లు… ప్రపంచ ఆర్థిక శక్తి మళ్లీ ఆసియాదే !
  • ‘‘నేనేంటి? అన్నమయ్యనేంటి? నన్ను వదిలేసేయండి సార్ ప్లీజ్’’
  • ఊరంతా ఓ దారి – ఈ ప్రేమలతది మరో దారి – రోతనిధికి జైకొట్టే దారి !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions