Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జస్ట్, టీన్స్ దాటిన ప్రేమికులు తప్పకుండా చదవాల్సిన ‘చిత్రం’ కేసు…

February 23, 2024 by M S R

అమన్… ఉజ్జయిని… 2020లో ఆమె పరిచయమైంది… ఇప్పటి కాలం వేరు కదా… మన సినిమాలు, మన టీవీలు పిల్లల్ని వేగంగా ప్రేమలు అనే ట్రాప్‌లోకి నెట్టేస్తూ ఉంటాయి కదా.,. వీళ్లూ అంతే… చిన్న వయస్సే… మెచ్యూర్డ్ లవ్ కాదు, అంటే పరిణత ప్రేమ కాదు, అప్పట్లో తేజ తీసిన చిత్రం బాపతు ప్రేమ… కాదు, ఓ ఆకర్షణ… ఓ మాయ…

మనం పెళ్లి చేసుకుందాం అని అడిగింది ఆమె… అచ్చు సినిమాల్లోలాగే… అమ్మో, మనం పెద్దగయ్యాక చేసుకుందాం, ఇప్పుడే వద్దు, కనీసం 12 కూడా పాస్ కాలేదు నేను… ఏం పని చేసి పోషిస్తాను అన్నాడు… నథింగ్ డూయింగ్ నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోనూ అంటే ఆత్మహత్య చేసుకుంటాను అన్నదామె… సేమ్, సినిమాల్లోలాగే…

తప్పేదేముంది..? సరేనన్నాడు హీరో… 2021 జూలైలో పెళ్లయింది ఆర్యసమాజ్‌లో… ఆర్యసమాజ్‌కు వేరే పనేముంది గనుక..? అడగ్గానే పెళ్లి చేసేసింది… తరువాత ఇండోర్‌లో ఓ రూమ్ రెంటుకు తీసుకుని సంసారం స్టార్ట్ చేశారు ఇద్దరూ… కానీ కొన్నాళ్లకే ఆ ప్రేమలు ఎగిరిపోయాయి… సహజమే కదా… కొట్లాటలు మొదలయ్యాయి…

Ads

పెళ్లయి నెల కూడా కాలేదు, నన్ను మానసికంగా హింసించడం స్టార్ట్ చేసింది, అప్పుడప్పుడూ చేయి చేసుకునేది అని బోరుమన్నాడు అమన్… అంటే గృహహింస… గృహహింస అంటే భార్యల్ని భర్తలు హింసించడం మాత్రమే కాదు కదా… చూసీ చూసీ ఇక తను భరించలేక ఆమెను వదిలేసి ఓరోజు ‘పుట్టింటికి’ పారిపోయాడు… పెళ్లయిన రెండు నెలలకే…

ఆమెకూ తత్వం బోధపడింది… నీ పని చెబుతానుండు అనుకుని మిస్సింగ్ కేసు నమోదు చేసింది, అంతేకాదు, ఫ్యామిలీ కోర్టులో ఓ కట్నం వేధింపుల కేసు కూడా పెట్టింది… నాకు భరణం ఇప్పించండి అని దావా వేసింది… అమన్‌కు చిరాకెత్తింది… అసలే మంట మీదున్నాడు… తను కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గృహహింస కేసు పెట్టాడు, పనిలోపనిగా ఫ్యామిలీ కోర్టుకు వెళ్లి నాకే భరణం ఇప్పించండి, నేను నిరుద్యోగిని, నా బతుకు ఎలా గడవాలి అని వేడుకున్నాడు…

నువ్వు నిరుద్యోగివి  సరే, మరి ఆమె మాత్రం నీకు భరణం ఎలా చెల్లించగలదు అనడిగితే ఆమె బ్యూటీ పార్లర్ నడుపుతోందనీ, సంపాదిస్తోందనీ, నాకే ఏ పనీ లేదని వివరించాడు… మనీష్ జరోలా అనే లాయర్ అమన్ తరఫున వాదించాడు… కోర్టు ఆమెను ‘ఏమమ్మా, నువ్వు సంపాదిస్తున్నావు కదా, భర్తకు భరణం ఇచ్చి వదిలించుకోవచ్చు కదా’ అన్నది…

ఆమె ఒకసారి బ్యూటీపార్లర్ నడుపుతున్న మాట నిజమే అని చెప్పింది, మళ్లీ మాటమార్చి నాకు కూడా ఏ పనీ లేదు అని లిఖితపూర్వకంగా రాసిచ్చింది…భర్తే పనిచేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు అని పేర్కొంది… కానీ తన వాదనకు మద్దతుగా ఆధారాలేవీ చూపించలేకపోయింది… రెండు వైపులా వాదనలు విన్న ఇండోర్ ఫ్యామిలీ కోర్టు ‘బాధితుడి’ పక్షాన నిలబడింది…

భార్యకు భర్తే భరణం ఇవ్వాలనేముంది..? సంపాదించే వ్యక్తి ఏ ఆధారం, పని లేని భాగస్వామికి సపోర్ట్ ఇవ్వాలని అభిప్రాయపడింది… అందుకని ఆమే అమన్‌కు నెలనెలా 5000 చెల్లించాలని తీర్పు చెప్పింది… మధ్యప్రదేశ్‌లో ఇలాంటి తీర్పు ఇదే తొలిసారి అంటున్నాడు మనీష్ జరోలా… కానీ ఇదిక్కడ ఆగేలా లేదు… ఆమె జిల్లా కోర్టుకు వెళ్లనుందట… కాదంటే హైకోర్టు, మరీ అవసరమైతే సుప్రీంకోర్టు…

ఇది కథ కాదు… వార్త… తాజా వార్త… సాధారణంగా ఫ్యామిలీ కోర్టులు గానీ, ఇతర కోర్టులు గానీ మహిళల వాదనకు మద్దతుగా ఉంటాయి… అనేకసార్లు ఫేక్ కేసులైనా సరే మహిళల పక్షాన నిలుస్తుంటాయి… ఈ కేసులో వాళ్లకు పిల్లల్లేరు, పెళ్లయిన నెలకే గొడవలు స్టార్ట్… ఎటొచ్చీ ఇక్కడ ఆమే భరణం చెల్లించాలనే తీర్పు అందుకే కాస్త అసాధారణంగా అనిపించింది… అంతే… ఇక్కడ చెప్పుకోదగిన అంశం ఏమిటంటే..? ప్రేమకు వోకే గానీ, పెళ్లికి తొందరపడకండీ అని కొత్తగా టీన్స్ దాటిన ప్రేమికులు తెలుసుకోవాలి…! కాస్త లైఫులో స్థిరపడేవరకు ఆగండ్రా బాబూ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions