Subramanyam Dogiparthi…. నటీనటులందరూ తమ తమ స్వంత పేర్లతోనే నటించిన ఏకైక చిత్రం 1969 లో వచ్చిన ఈ మామకు తగ్గ కోడలు సినిమా . ఈ సినిమాలో SVR నటించిన పాత్ర పేరు రంగారావు , విజయనిర్మల పేరు నిర్మల , రాజసులోచన పేరు రాజసులోచన , శోభన్ బాబు పేరు శోభన్ బాబు , చలం పేరు చలం . ఇలాంటి ప్రయోగం చేయబడిన సినిమా బహుశా ఏ భాషా చిత్రాలలో , ఏ దర్శకుడూ చేసి ఉండడేమో ! ఏమయినా ఉన్నాయా ? ఎవరికయినా అలాంటి సమాచారం ఉందా ! (నేను ప్రేమిస్తున్నాను అనే తెలుగు సినిమాలో కూడా ఈ ప్రయోగం చేసినట్టున్నారు…)
తన తండ్రి మరణానికి రంగారావే కారణమని , ఆయన చెల్లెలు రాజసులోచన ప్రేమను అడ్డం పెట్టుకుని ఇంట్లోకి చేరుతాడు శోభన్ బాబు . అక్కడ జరిగిన ఒక ఘర్షణలో పొరపాటున చేతిలో ఉన్న రివాల్వర్ పేలి శోభన్ బాబు చనిపోతాడు . తన అన్నని చంపాడనే కోపంతో ప్రతీకారం తీర్చుకోవటానికి శోభన్ బాబు చెల్లెలు విజయనిర్మల రంగారావు కుమారుడు చలాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో కోడలిగా పాగా వేస్తుంది . చివర్లో జరిగిన సంఘటనలన్నీ తెలుసుకుని , హీరోయిన్ పశ్చాత్తాప పడుతుంది .
Ads
ప్రధాన పాత్రలు SVR , విజయనిర్మల . వీరందరితో పాటు ముక్కామల , బాలకృష్ణ ( అంజి గాడు ) ప్రభృతులు నటించారు . శోభన్ బాబు లవర్ గా రాజసులోచన జోడీ కన్విన్సింగుగా ఉండదు . వయసూ , ఒళ్ళూ రెండూ శోభన్ బాబు కన్నా ఎక్కువ కదా ! సినిమా బాగానే ఉంటుంది . ఎలా ఆడిందో గుర్తు లేదు .
ఈ సినిమా హిందీ ఇంతెకామ్ సినిమా రీమేక్, దాంట్లో రెహమాన్, సాధన, సంజయ్ ఖాన్, చేసారు, అప్పట్లో హిందీ సినిమా హిట్, తెలుగులో అంత పెద్దగా హిట్ కాలేదు, హిందీ సినిమాలో పాటలు బాగుంటాయి, మ్యూజిక్ పరంగా తెలుగులో అంత మంచి పాటలు హిట్ కాలేదు, ఏవరేజ్ గా ఆడింది.
మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసినట్లు గుర్తు . యూట్యూబులో ఉంది . సినిమా చూడబులే . ఆసక్తి కలవారు చూడవచ్చు .
Share this Article