శంకర్ జీ …. చిన్నప్పుడు ఏస్కో కోకాకోలా, తీస్కో రమ్ము సారా… అని రేడియోలో వచ్చే పాట వినే వుంటారు కదా.. అప్పట్లో ఒక ఊపు ఊపిన జ్యోతిలక్ష్మి క్లబ్ సాంగ్ ఇది. ఇంట్లో ఘట్టిగా పాడి తిట్లు తిన్నట్టు గుర్తు. ఇదేకాదు జ్యోతిలక్ష్మి పాట ఏది పాడినా తిట్టేవాళ్ళు. ఎందుకో జో లక్ష్మి అంటే అంత కోపం. తర్వాత కొద్ది ఏళ్ళు ఇండియాలో కోకాకోలా అమ్మలేదు… 90 ల తర్వాత మళ్ళీ ఇండియాలో ప్రత్యక్షం అయ్యింది.
లీకైన చిట్టా చెప్పిన ప్రకారం, అందులో “వనిలా, కేరమెల్, కెఫీన్, కోకా ఆకుల రసం, నిమ్మ రసం, దీనికి జతగా ఏడు సుగంధ తైలాలు/ద్రవ్యాలు (7 X)- ఆల్కహాల్, ఆరంజ్, లెమన్, జాపత్రి, కొత్తిమీర, నేరోలి, దాల్చిన చెక్క” ఉన్నాయట. పనిలో పని, మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.
మొదట్లో దీన్ని కుళాయిల్లో (హోటల్/షాపు లోనే లెండి , వీధుల్లో అనుకునేరు) అమ్మేవారట . అలాగే దీని సీసా ఆకారం కోకో బీన్స్ ఆకారాన్ని పోలి ఉంటుందట. మొదటిసారి సులభంగా ఇంటికి తీసుకుని వెళ్ళేలా అర డజన్ పేక్ లాగా అమ్మింది , 1928 ఒలింపిక్స్‌కి స్పాన్సర్ చేసింది కూడా వీరే. ప్రపంచం అంతా టక్కున గుర్తు పట్టే పదాలలో కోకాకోలా రెండోదట. మొదటిది “ఓకే “ అనే పదం అట. కోకాకోలా అనే అక్షరాలు కూడా చిత్రంగా ఉంటాయి కదా. వాటిని “స్పెన్సేరియన్ ఖతి- spencerian font” అంటారు.ఈ ఖతిలో ఇంకేవి ఉండకూడదని 1893లో ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేసుకున్నారు వీళ్ళు.
Ads
కోకా కోలా బాగా ఆమ్లత్వం ఉండే పానీయం. దీని ఆమ్లత్వ (ph) విలువ 2.5. ఎనామెల్ని నెమ్మదిగా అరిగేట్టు చేయగల సత్తా దీనికి ఉంది. దీని మీద విమర్శలు కూడా బోలెడు.
మే 8 1886 లో డాక్టర్ “జాన్ పెంబర్టన్” అనే పార్మసిస్ట్ , “జాకోబ్స్ ఫార్మసీ” అట్లాంటా లో తయారు చేసాడు. 1891 లో ఇంకో పార్మసిస్ట్ “ఆసా గ్రెగ్స్ కాండ్లర్”, హక్కులు కొనుక్కుని కంపనీ మొదలెట్టాడు. ఒక రకంగా దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లడం ఈయన ఘనతే. మళ్ళీ 1919 లో ఈ కంపనీ “ఎర్నెస్ట్ వుడ్రాఫ్” చేతికి మారింది.
ఇంకా రాసుకుంటూ పొతే సీసా ఎలా మారింది, లోగో , దాని మార్కెటింగ్ ప్రణాళికలు, ఇతర కంపనీల పానీయాల కైవసం, అబ్బో చాలా పెద్ద చరిత్ర ఉంది…
Share this Article