Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంకా తెలవారదేమీ ఈ చీకటి విడిపోదేమి… ఎన్నాళ్లో వేచిన ఉదయం…

March 4, 2024 by M S R

Subramanyam Dogiparthi …… ఈ సినిమా అనగానే గుర్తుకొచ్చే పాట సినారె వ్రాసిన ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం, ఎగిసి ఎగిసి పడుతుంటే, ఇంకా తెలవారదేమి పాట . ఘంటసాల , బాల సుబ్రమణ్యం పాడిన పాట . బాగానే ఆడింది . 1967 లో AVM వారు పందియము అనే టైటిల్ తో నిర్మించిన సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . తమిళంలో జెమినీ , A.M.రాజన్ , వెన్నిరాడై నిర్మల నటించారు .

తర్వాత హిందీలో కూడా సచ్చాయి అనే టైటిల్ తో , షమ్మీకపూర్ , సంజీవ్ కుమార్ , సాధన నటించారు . మళయాళంలో ఇన్యం కానాం అనే టైటిల్ తో ప్రేం నజీర్ , విన్సెంటులతో నిర్మించారు . ఇద్దరు మిత్రులు సైధ్ధాంతిక అభిప్రాయ బేధాలతో విడిపోయి , అయిదేళ్ళ తర్వాత తమ జీవన గతులను సమీక్షించుకుందామని సవాళ్లు విసురుకుంటారు .
ఒక మిత్రుడు గజదొంగ , మరొక మిత్రుడు పోలీసు ఆఫీసర్ అవుతారు . కధాంతంలో గజదొంగ గంగారాం మరణిస్తాడు . తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాగుంటుంది .

గజదొంగ గంగారాంగా కృష్ణ , మంచి బాలుడు పోలీసుగా శోభన్ బాబు నటించారు . విశేషం ఏమిటంటే విజయనిర్మల కృష్ణ చెల్లెలుగా నటించటం . ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరు అన్నాచెల్లెళ్ళుగా ఏ సినిమాలోనూ నటించలేదు . ఈ 1969 లోనే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు . వీరితోపాటు గీతాంజలి , చలం , జగ్గారావు , త్యాగరాజు , ప్రభృతులు నటించారు .

యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో మిగిలిన పాటలు కూడా శ్రావ్యంగానే ఉంటాయి . అయితే బయట పాపులర్ కాలేదు . ఓరచూపులు చూడకముందే ఒళ్ళు ఎందుకే ఝల్లుమనే , అరె నిషా నిషా మజా మజా నీకు కావాలా క్లబ్బు పాట , ఎంతో ఉన్నది అంతు తెలియనిది పాటలు బాగుంటాయి . వాలీ బాల్ ఆడుతూ విజయనిర్మల తన స్నేహితురాళ్ళతో పాడే పాట నాలుగు వైపులు గిరి గీసి ఆపై సన్నని తెర వేసి ఎదురు ఎదురుగా అనే పాట వెరైటీగా ఉంటుంది .

ఈ సినిమాకు మా నరసరావుపేటకూ ఓ లింక్ ఉంది . మా ఊరి సత్యనారాయణ టాకీసులో ఫస్ట్ రిలీజ్ . అలా 1960s చివర నుండి కాస్త కాస్త ఫస్ట్ రిలీజులు మొదలయ్యాయి . మేము సైకిళ్ళు వేసుకుని చిలకలూరిపేట , రైళ్ళల్లో బస్సుల్లో గుంటూరుకు పోవటం , రావటం తప్పింది . ఈ సినిమా చాలాసార్లు టివిలో కూడా వచ్చింది . యూట్యూబులో ఉంది . చూడబులే . ముఖ్యంగా కృష్ణ అభిమానులు చూసి ఉండకపోతే , తప్పక చూడండి .

#తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema #Narasaraopet Mana Narasaraopeta Mana Narasaraopet

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • తమ్ముడు పెళ్లి – మామ భరతం..! ఈ కథాకమామిషు ఏమిటనగా..!
  • జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…
  • విశ్వనాథుడు కదా… జావళి పాటకీ జయమాలినితో డాన్స్ చేయించగలడు…
  • 132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
  • నాలుగు దశాబ్దాల కెరీర్… సాఫీగా ఈరోజుకీ కుదుపుల్లేని జర్నీ…
  • ప్రేక్షకులకు తగిలే చెప్పు దెబ్బల మాటేమిటో కూడా చెప్పు..!!
  • ఎట్టకేలకు GST మోత కాస్త తగ్గిస్తున్నారు ప్రభువులవారు..!!
  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions