అరుంధతి… ఈ సినిమా అనుష్క నటజీవితానికి పెద్ద బ్రేక్… ఆ సినిమా తరువాతే ఆమె పాపులారిటీ, ఇమేజీ బాగా పెరిగిపోయి, తెలుగు అగ్ర హీరోయిన్‌గా నడిచిపోయింది చాన్నాళ్లు… అదేదో పిచ్చి సినిమాకు బరువు పెరిగేదాకా..!
ఆ తరువాత ఇక ఆమె కెరీర్ అస్సలు గాడినపడలేదు… పడుతుందనే సూచనలూ లేవు… కొత్త హీరోయిన్లు వచ్చి దున్నేస్తున్నారు… సెకండ్ ఇన్నింగ్స్ జోష్‌లో లేదు… అదుగో ఇదుగో ప్రభాస్ అనే వార్తలు రావడమే తప్ప తను సై అనడు, ఈమె చెంతచేరదు…
అరుంధతి సినిమాలో జేజమ్మగా తను బాగా ఫిట్టయింది… మొహంలో గ్రేస్, సటిల్డ్ నటన ఆ పాత్రను ఎలివేట్ చేశాయి… సినిమా కథాకథనాలకు తోడు గ్రాఫిక్స్ సినిమా విజయానికి బాగా దోహదపడ్డాయి… ప్రత్యేకించి సినిమా చివరలో ప్యాలెస్ విరిగిపడుతున్న సీన్లు బాగా వచ్చాయి… విలన్‌గా సోనూసూద్ నటన, దానికి సాయికుమార్ తమ్ముడి డబ్బింగ్ భలే కుదిరాయి…
Ads
మరి ఇదే సినిమాను బాలీవుడ్‌లో తీస్తే… అదే, ఇంత లేటుగా రీమేక్ చేస్తే… అనుష్క పాత్రకు, అదే జేజమ్మగా ఎవరు బెటర్..? ఎక్కడో వార్త కనిపించింది… నిజంగానే ఈ సినిమాను తీయబోతున్నారట… ఆల్రెడీ ప్రిప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నదట… ఈ పాత్రకు దీపిక పడుకోన్ పేరును పరిశీలిస్తున్నారని ఆ వార్త చెబుతోంది…
అంతేకాదు, హిందీ సినిమాకు కూడా డైరెక్ట్ చేయడానికి ఓ తెలుగు దర్శకుడిని సంప్రదిస్తున్నారట… గుడ్, అప్పట్లో రాణి పద్మావతిగా అనితర సాధ్యంగా నటించి మెప్పించిన దీపిక హిందీ జేజమ్మ పాత్రకు సూటబుల్… బాగుంటుంది… అలవోకగా చేయగలదు… కాకపోతే రౌద్రం చూపే చివరి నాట్యాన్ని ఏమేరకు చేయగలదో ఏమో… ఐనా అనుష్క కూడా పెద్దగా చేసిందేమీ లేదు అక్కడ గొప్పగా…
ఇవన్నీ వోకే, కానీ విలన్ ఎవరు..? మళ్లీ సోనూ సూద్..? అడిగితే చేస్తాడు, స్వయంగానే డబ్బింగ్ చెప్పుకోగలడు… ఇక గ్రాఫిక్స్ టెక్నాలజీ ఇంకా పదునెక్కింది ఈమధ్య… సో, అరుంధతికన్నా మంచి ఔట్ పుట్ గ్యారంటీ… హీరోగా ఏ తుప్పాస్ మొహమైనా సరే కదా, అదొక అతిథి పాత్ర… పైగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర బాగా ఎలివేట్ కావాలంటే హీరో డమ్మీగా ఉండి, విలనీ ఓ రేంజులో ఉండాలి…
సో, దీపిక డిమాండ్ మేరకు రెమ్యునరేషన్ గనుక ఫిక్సయితే… మనం బాలీవుడ్ జేజమ్మను త్వరలోనే చూడబోతున్నామన్నమాట..! మరీ నెత్తి మీద కొబ్బరికాయలు పగులగొట్టే సీన్లను హిందీ ప్రేక్షకులకు జీర్ణం అవుతాయా..? ఏం… ఎందుకు కావు… స్టార్ హీరోల భీకరమైన కామెడీ ఫైట్లను, నెత్తుటి ధారలు, దేహఖండనలను చూడటం లేదా ఏం..? చల్తా…!
Share this Article