Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Dunki… ఎలాగోలా పాక్ నుంచి బయటపడాలి… కెనడా చేరుకోవాలి…

March 6, 2024 by M S R

Pardha Saradhi Potluri …. పాకిస్థాన్ గత వారం రోజులుగా అంతర్జాతీయంగా వార్తలలో ఉంటూ వస్తున్నది! అయితే ఆ వార్తలు ఏవీ కూడా అంత మంచివి కావు! నిన్న జరిగిన సంఘటన వలన మరో సారి పాకిస్థాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది!

ఒలంపిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ ఒక టీమ్ ను పంపించింది ఇటలీ దేశంకి! ఆ టీమ్ లో పురుషులు మరియు మహిళలు ఉన్నారు! నిన్న వార్మ్ అప్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుండగా జోహైర్ రషీద్ అనే బాక్సర్ తన టీమ్ మేట్ అయిన మహిళా బాక్సర్ లారా ఇక్రమ్ ను అడిగి రూమ్ తాళం చెవి తీసుకొని, రూమ్ కి వెళ్లి లారా ఇక్రం బ్యాగులో ఉన్న విదేశీ కరెన్సీ దొంగతనం చేసి పారిపోయాడు!

**************,***

Ads

తన రూమ్ తెరిచే ఉండడం బ్యాగులో ఉన్న డాలర్లు కనిపించక పోయేసరికి పాకిస్థాన్ నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ అయిన కల్నల్ నజీర్ కి ఫిర్యాదు చేసింది లారా ఇక్రామ్! జొహైర్ రషీద్ కోసం వెతికితే అతను కనపడలేదు! దాంతో ఇటలీ లోని పాక్ రాయబార కార్యాలయం ఇటలీ పోలీసులకి అధికారికంగా ఫిర్యాదు చేసింది! పాక్ బాక్సింగ్ ఫెడరేషన్ సెక్రటరీ కల్నల్ నజీర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా కింద ఇటలీ ప్రభుత్వం జారీ చేసిన వీసా మీద ఇటలీ వచ్చిన తాము ఒక బాక్సర్ దొంగతనం చేసి పారిపోయాడు అని ఫిర్యాదు చేయడం అనేది అవమానంగా భావిస్తున్నామని విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు!

*******************

అయితే కేవలం డబ్బు కోసం జోహైర్ రషీద్ దొంగతనం చేసినట్టుగా లేదు! ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం పారిపోయాడు! పాకిస్థాన్ లో ఉన్నప్పుడే కెనడా వెళ్ళడానికి సంప్రదింపులు జరిపాడు. ఇటలీలోని మాఫియా గ్యాంగ్ కు కెనడాలో ఉన్న మాఫియా గ్యాంగ్ లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒలంపిక్స్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ కోసం ఇటలీ వస్తే అక్కడి నుండి సముద్ర మార్గం ద్వారా కెనడాలోకి అక్రమంగా రవాణా చేసే మాఫియా సహాయంతో కెనడా వెళ్ళడానికి ప్లాన్ చేశాడు. (Dunki)… పాకిస్తాన్ ప్రభుత్వం ఖర్చుల కోసం ఒక్కక్కరికి వెయ్యి డాలర్లు ఇచ్చింది 5 గురు సభ్యుల బాక్సింగ్ టీమ్ కి. తన దగ్గర ఉన్న వెయ్యి డాలర్లు సరిపోవు కాబట్టి తోటి మహిళా బాక్సర్ లారా ఇక్రమ్ బ్యాగ్ లో ఉన్న వెయ్యి డాలర్లు దొంగతనం చేసి పారిపోయాడు! ఇటలీ పోలీసులు జొహైర్ కోసం గాలిస్తున్నారు!

*********************

గత 6 నెలల కాలంలో ముగ్గురు పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎయిర్ హోస్టెస్ లు కెనడాకు వెళ్ళి అదృశ్యం అయ్యారు! ఇప్పటి వరకూ మొత్తం 6 గురు ఎయిర్ హోస్టెస్ లు కెనడాకు వెళ్ళి అదృశ్యం అయ్యారు! పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానంలో ఆన్ డ్యూటీ మీద వెళ్లి, అక్కడ 6 గంటలు ఆగి, తిరిగి అదే విమానంలో తిరిగి రావాల్సిన ఎయిర్ హోస్టెస్ లు విమానాశ్రయం నుండి బయటకి వచ్చి తమకి కేటాయించిన హోటల్ కి వెళ్లకుండా కెనడాలో వేరే ప్రదేశంకి వెళ్లి అదృశ్యం అయ్యారు! నిన్న పాకిస్తాన్ బాక్సర్ అదృశ్యం అయ్యాడు ఇటలీలో!

*********************

దిగజారి పోయిన పాకిస్తాన్ ఆర్థిక స్థితి ఒక వైపు, రాజకీయ స్థిరత్వం లేకపోవడం మరో కారణంగా పాకిస్థాన్ నుండి అక్రమ వలసలు జరుగుతున్నాయి!

మరోసారి పెట్రోల్,డీజిల్, నిత్యావసరాల ధరలు పెంచితేనే 1.2 బిలియన్ డాలర్ల రుణం మంజూరు చేస్తానని IMF షరతులు విధించింది. మరో వైపు తమ $2 బిలియన్ డాలర్ల రుణం తిరిగి చెల్లించమని వత్తిడి తెస్తున్నది చైనా! ఆల్ వెదర్ ఫ్రెండ్ అయిన చైనా పాకిస్తాన్ ప్రభుత్వం మీద వత్తిడి తేవడానికి కారణం పాకిస్థాన్ ప్రధానిగా ఎవరు ఉండాలో అమెరికా, బ్రిటన్ దేశాలు నిర్ణయిస్తున్నాయి!

*********************

దొంగతనం చేసి పారిపోయిన పాక్ బాక్సర్ జొహైర్ గత సంవత్సరం ఆసియా క్రీడలలో బ్రాంజ్ పతకం సాధించాడు! ఇంతకీ కెనడా వెళ్లి అదృశ్యం అవుతున్న ఎయిర్ హోస్టెస్ లు ఏమవుతున్నారు? కెనడా ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఖలిస్ధాన్ సానుభూతి పరులతో నిండి ఉంది! కెనడా విదేశాంగ శాఖ అధికారులలో కూడా ఎక్కువమంది ఖలిస్తాన్ మద్దతు దారులు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రాడూకి ఎలాంటి అధికారము ఉండదు విదేశాంగ శాఖ మీద. పంజాబీలదే హవా అక్కడ! So! అక్రమ వలసదారులు సక్రమ వలసదారులు అయిపోతారు! వాళ్లకి కావాల్సింది కాశ్మీర్ బనేగా పాకిస్తాన్ అంటూ కెనడా వీధులలో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడానికి… ఈ అక్రమ వలసదారులు దానికి పనికి వస్తారు.

*******************

ఇవి బయటకి తెలుస్తున్న సమాచారం! కానీ పాకిస్తాన్ నుండి నేపాల్, బాంగ్లాదేశ్ లకి వచ్చి అక్కడ నుండి వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, కేరళకు ఎంతమంది వస్తున్నారో లెక్కలు లేవు! IMF షరతులకు లోబడి పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలు పెంచితే ఇంకా దుర్భరం అవుతుంది సామాన్య ప్రజలకు పాక్ లో!

రాబోయే రోజులలో పాక్ నుండి మానవ అక్రమ రవాణా భారత్ లోకి జరిగే అవకాశం ఉంది! నేపాల్ నుండి భారత్ లోకి రావడానికి పెద్దగా డాక్యుమెంట్లు అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటే చాలు. అవి డూప్లికేట్ చేయడం పెద్ద పని కాదు! నేపాల్ లో డూప్లికేట్ ఆధార్ కార్డులు సృష్టించే ముఠాలు చాలా ఉన్నాయి. ఆఫ్కొర్స్ అవి ఉత్తర ప్రదేశ్ నుండి నేపాల్ లోకి దిగుమతి అవుతాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions