Jagan Rao ……… పోయిన యేడాది హైదరాబాద్ లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు (బయో ఆసియా) లో జర్మనీ నుంచి వచ్చిన ఒక మహిళా ఛీఫ్ గెస్ట్ “ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్” గురించి ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత ప్రశ్నలు అడగమంటే ఒక తెలుగు అతను లేసి “ఆడవాళ్ళని అర్ధం చేసుకోవటం కష్టం అంటారు, ఈ ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ని ఉపయోగించి ఆడవాళ్ళని అర్ధం చేసుకోవచ్చా” అని అడిగాడు.
ఆమె దానికి సమాధానం చెప్తూ…”ఈ ప్రపంచం లో 700 కోట్ల జనాభా ఉంటే 350 కోట్ల మంది మహిళలు, మిగతా 350 కోట్ల మంది పురుషులు ఉన్నారు. మీరు మహిళలని అర్ధం చేసుకోవాలనుకునే ముందు ప్రపంచం లో ఉన్న 350 కోట్ల మంది పురుషులు మీకు పూర్తిగా అర్ధం అయ్యారా..? అయినా ప్రపంచం లో ఉన్న మహిళలు అందర్నీ అర్ధం చేసుకొని ఏమి చేస్తారు..?
ఒకవేళ మీరు మీ భార్యని అర్ధం చేసుకోవాలంటే, ఆమెతో ప్రతి రోజూ కనీసం ఒక గంట మాట్లాడండి, ఆమె మీకు అర్ధం అవుతుంది. ఒకవేళ మీ తల్లిని అర్ధం చేసుకోవాలంటే కనీసం వారానికి ఒక రెండు గంటలు ఆమెతో మాట్లాడండి. ఒకవేళ మీ కూతుర్ని అర్ధం చేసుకోవాలంటే కనీసం రోజుకి ఒక 30 నిమిషాలు ఆమెతో గడపండి. ఒకవేళ మీ అక్క లేదా చెల్లి ని అర్ధం చేసుకోవాలంటే రోజుకి కనీసం ఒక 20 నిమిషాలు వాళ్లతో మాట్లాడండి. ఒకవేళ మీ స్నేహితురాలిని అర్ధం చేసుకోవాలంటే మధ్యలో మాట్లాడకుండా ఆమే చెప్పేది కనీసం ఒక 45 నిమిషాలు వినండి ; అప్పుడు మీకు అర్ధం అవుతారు” అని చెప్పింది. సదస్సు అంతా కరతాళ ధ్వనులు.
నిజానికి ఆడవాళ్ళు అబల అని కొందరు – అంటే తక్కువ అని , సబల అని మరికొందరు – అంటే ఎక్కువ అని మాట్లాడుతుంటారు. నేను అయితే మగ లేదా ఆడ తక్కువ లేదా ఎక్కువ అనే చీడ భావజాలానికి పూర్తిగా వ్యతిరేకం. ఎవర్ని అయినా ఒక మనిషిగా చూస్తా; అంతే… ఒకరోజు అని పెట్టారు కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ….
Share this Article