కరణ్ థాపర్ మంచి జర్నలిస్టు అవునో కాదో తెలియదు, చెప్పలేం… కానీ ఎఫీషియెంట్ జర్నలిస్ట్, ఇండియాలో చాలా పాపులర్ జర్నలిస్ట్… సో వాట్..? సమర్థ జర్నలిస్ట్ సమర్థ పుస్తక సమీక్షకుడు కావాలని ఏముంది..? సాక్షి ఎడిట్ పేజీలో ఓ పుస్తకాన్ని సమీక్షించాడు… అత్యంత కంగాళీ సమీక్ష అనిపించింది చదువుతుంటే… అసలు సాక్షి వంటి పత్రికలో ఎడిట్ పేజీలో గెస్ట్ కాలమ్‌గా ఈ రివ్యూ ప్రచురించడమే ఓ కంగాళీ నిర్ణయం…
సరే, పుస్తక సమీక్షలు ఫలానాచోట పబ్లిష్ చేయాలని ఏమీ లేదు… ఆంధ్రజ్యోతి ఆమధ్య ఏదో పుస్తకంలోని కంటెంట్‌ను యథాతథంగా నాలుగు రోజులపాటు సీరియల్‌గా పబ్లిష్ చేసినట్టు గుర్తు… దాన్ని ప్రమోషన్ అనాలో, అందులోని కంటెంటును వాడుకోవడం అనాలో, నిజంగా సమీక్ష అనాలో తెలియదు గానీ… ఒక డిటెక్టివ్ నవలను సాక్షి పత్రిక ఎడిట్ పేజీలో సమీక్షించడం మాత్రం, అదీ కరణ్ థాపర్ వంటి జర్నలిస్టు సమీక్షించడం మాత్రం కంగాళీ అనే అనిపించింది…
సరే… సదరు థాపరుడి బాధ ఏమిటయ్యా అంటే… విదేశాల్లో మనకు హైకమిషనర్‌గా, విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసినవాడు డిటెక్టివ్ నవల రాయకూడదట… రాయడం ఆశ్చర్యం అనిపించిందట… రచయిత రాసే పుస్తకం రచయిత అసలు తత్వాన్ని ఆవిష్కరిస్తుందట… ఇదెక్కడి సూత్రీకరణో తెలియదు… రచయిత అన్నాక బోలెడు జానర్లు ట్రై చేస్తాడు… ట్రెండ్‌ను బట్టి కథావస్తువును ఎంచుకుంటాడు… ఇక్కడ చిన్న ఉదాహరణ… యండమూరి, మల్లాది ఒకప్పుడు తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన రచయితలు…
Ads
ఏదీ ఒక్కసారి మల్లాది ఫలానా, యండమూరి ఫలానా అని ముద్రవేయండి చూద్దాం… వాళ్ల పుస్తకాలను బట్టి వాళ్ల తత్వాలు ఇవీ అని చెప్పండి చూద్దాం… ఇంతకీ కరణ్ థాపర్ సమీక్షించిన పుస్తకం పేరు ఏమిటీ అంటారా..? రైట్ యాంగిల్ టు లైఫ్… రాసింది కృష్ణన్ శ్రీనివాసన్… ఈయన మన విదేశాంగ కార్యదర్శిగా పనిచేసినట్టు కరణ్ థాపరే వెల్లడించాడు తన సమీక్ష వ్యాసంలో… అంతేనా..? ఇలాంటి పుస్తకాలు రాస్తే తమ వృత్తి అనుభవాలను రాయాలి గానీ అపరాధ పరిశోధనను కథావస్తువుగా ఎంచుకోవడం అంటాడు ఈ పాపులర్ జర్నలిస్టు… అదేమిటో మరి…
https://www.sakshi.com/telugu-news/guest-columns/sakshi-guest-column-krishnan-srinivasan-1982909
అదేమిటి..? ఓ దేశానికి రాయబారిగా పనిచేసినవాడు అపరాధ పరిశోధన రాయకూడదా..? పోనీ, రాస్తే రాశాడు, జేమ్స్ బాండ్ తరహాలో గాకుండా భిన్నమైన అపరాధ పరిశోధకుడిని, అదీ సోమాలియాలో రాయబారిగా పనిచేసినట్టుగా పరిచయం చేస్తాడేమిటి అంటాడు రివ్యూయర్… అదేమిటో మరి… డిటెక్టివ్ నవలలు జేమ్స్ బాండ్ తరహాలోనే ఉండాలా..? ఈయనకు మన డిటెక్టివ్ యుగంధర్ గురించి తెలియనట్టుంది… రచయిత కొమ్మూరి సాంబశివరావు గురించీ తెలియదు…
మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శుల నుంచి ఇలాంటి పుస్తకాలు, పాత్రలను అస్సలు ఊహించలేం అంటూ ఈ రివ్యూయర్ బోలెడంత హాశ్చర్యపోతాడు… ఇంకా చాలా చాలా అంశాలపైనా అంతే… అసలు విషయానికి వస్తే… ఇది స్థూలంగా కంగాళీ సమీక్ష అని మనకు తోచినా సరే, నిజానికి ఓ నిందాస్తుతి వంటి పుస్తక సమీక్ష… పైకి ఓ నెగెటివ్ లైన్ తీసుకుని, పుస్తకం భిన్నత్వాన్ని పరిచయం చేయడం… సరిగ్గా చెప్పాలంటే ఆ పుస్తకానికి ఇది ఓ ప్రమోషన్… ఓ మార్కెటింగ్ టాక్టిస్… ఎటొచ్చీ సాక్షి ఎడిట్ పేజీలో ఇది పబ్లిష్ కావడమే అసలు ఆశ్చర్యం.. అఫ్ కోర్స్, మళ్లీ చెబుతున్నా… ఆ స్పేస్‌లో పుస్తక సమీక్ష అచ్చేయివద్దని ఏమీ లేదు… డిటెక్టివ్ ఇలా ఉండాలని చెప్పలేనట్టుగానే..!!
Share this Article