ఒక దేశవాసి ఆనందంగా ఎప్పుడుంటాడు..? పెద్ద పెద్ద సంక్లిష్ట ప్రాతిపదికలు, బోలెడన్ని శాస్త్రీయ సమీకరణాలు గట్రా లేకుండా… స్థూలంగా, కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం… 1) దేశం బయట నుంచి, అంతర్గతంగా భద్రంగా ఉండాలి… 2) న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ బాగుండాలి… 3) అవినీతి రహిత అధికారగణం ఉండాలి… 4) ఉద్యోగాలు, సరిపడా జీతాలు ఉండాలి… 5) మౌలిక సదుపాయాలు బాగుండాలి… 6) ఆయుఃప్రమాణం బాగా ఉండాలి… 7) వైద్యం, విద్య ప్రభుత్వ పరిధిలో ప్రజలపై భారం పడని రీతిలో ఉండాలి… 8) లైఫ్ అండ్ వర్క్ బ్యాలెన్స్ ఉండాలి… 9) పొల్యూషన్ లేని వాతావరణం ఉండాలి… 10) సంస్కృతి, వినోదంతో పాటు వృద్దాప్యంలో సొసైటీ సపోర్ట్ ఉండాలి…
ఇలా పరిశీలిస్తూ పోతే బోలెడు ప్రాతిపదికలు… ఇక ఓ విషయాన్ని పైపైన చూద్దాం… ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేసే ఓ దిక్కుమాలిన సంస్థ… (అవును, దిక్కుమాలిన సంస్థే)… ఎవరిని అడిగిందో, ఏ రిపోర్టులను ఆధారంగా తీసుకుందో, ఎక్కడ కూర్చుని లెక్కలేసిందో, మోటివ్స్ ఏమిటో తెలియవు గానీ… ఆరు పారామీటర్స్‌లో ఏ దేశం ఎంత హేపీ అని ర్యాంకులిచ్చింది… దాదాపు 143 దేశాలకు ర్యాంకులిస్తే… మనకు 126వ ర్యాంకు అట…
ఈ సంస్థ తలసరి ఆదాయం, ఆత్మతృప్తి, సామాజిక మద్దతు, ఆయుష్షు, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి ఎట్సెట్రా ప్రాతిపదికల్ని తీసుకుంది… ఆత్మతృప్తిని, దాతృత్వాన్ని ఎలా కొలిచారు..? ఏ దేశంలో ఎవరిని అభిప్రాయాలు అడిగి క్రోడీకరించారు… అంతా ఓ మాయ… ఇదేనా..? పత్రికా స్వేచ్ఛ దగ్గర నుంచి మానవ జీవన నాణ్యత సూచీల దాకా ఇలాంటి సోకాల్డ్ అంతర్జాతీయ సంస్థలు ఇండియాను నీచంగా చిత్రీకరించడానికే ప్రయత్నిస్తున్నాయి… స్తుంటాయి కూడా…! గత పదేళ్లలో ఓసారి మరీ 144వ ర్యాంకు ఇచ్చాయి ఈ సంస్థలు…!!
Ads
టాప్ టెన్‌లో ఇజ్రాయిల్ ఉంది… పాలస్తీనా నుంచి హమాస్ తీవ్రవాదులు ఒకవైపు వేల రాకెట్లు పేలుస్తూ, ఆకాశం నుంచి పారాచూట్లలో దిగి, కనిపించినవాడినల్లా కాల్చేసి, మహిళలను ఎత్తుకుపోయి, పిల్లల్ని కూడా పిట్టల్లా రాల్చేసిన రోజులు గుర్తున్నాయి కదా… అది టాప్ టెన్ హేపీయెస్ట్ దేశాల్లో ఒకటి అట… అంతెందుకు, తెల్లారిలేస్తే ఇజ్రాయిల్ యుద్ధవిమానాల బాంబింగ్ భయంతో బతికే పాలస్తీనా కూడా ఇండియాకన్నా టాప్ ర్యాంకు అట… అఫ్ఘనిస్థాన్ సంగతి సరే, కానీ బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో ఇంకా మిగిలిపోయిన మైనారిటీల శాతం ఎంత..? ఏం స్వేచ్ఛ ఉంది అక్కడ..? ఏం భద్రత ఉంది..? ఏం ఆనందం ఉంది..?
ఉగ్రవాదులకు అడ్డా పాకిస్థాన్ కూడా మనకన్నా బెటర్ అట… లక్షలాది మంది రోహింగ్యాలు అక్కడి ఆర్మీ ఊచకోతల్ని తట్టుకోలేక దేశం విడిచి బతుకుజీవుడా అని పారిపోయిన మయన్మార్ మనకన్నా బెటర్ అట… జస్ట్, కొన్ని ఉదాహరణలు… డొల్ల అధ్యయనాలు, డొల్ల నివేదికలు… టాప్ టెన్ దేశాల్లో ఎనిమిది దేశాల జనాభా జస్ట్ కోటిన్నరలోపు… ఫస్ట్ ప్లేసులో ఉన్న ఫిన్‌లాండ్ జనాభా 50 లక్షలు… ఐస్‌లాండ్ జనాభా 4 లక్షలు… మల్కాజిగిరి నియోజకవర్గం కూడా వాటితో పోలిస్తే పెద్దది…
తక్కువ జనాభా, ఎక్కువ వనరులు ఉంటే ఆనందం, అవకాశాలు, ఆ జీవననాణ్యత వేరు… అధిక జనాభా, పేదరికం, తక్కువ వనరులు, నిరక్షరాస్యత వంటి అనేక సవాళ్లను అధిగమించి పురోగమించే ఇండియా వంటి దేశాల సిట్యుయేషన్లు వేరు… ఒక ఇండియాను ఒక ఐస్‌లాండ్‌తో పోల్చడం కరెక్టేనా..? ఆ దేశంలో అగ్నిపర్వతాలు, అవలాంచీలు, భూకంపాలు మంచు తుపాన్లు… ఫ్రిజ్జులో పెట్టినట్టున్న వాతావరణమే నిత్యనరకం కదా… ప్రపంచంలో సంభవించే భూకంపాల్లో మూడోవంతు ఇక్కడే… అసలు సొంత సైన్యం లేదు దానికి… చెబుతూ పోతే ఎన్నో… పేరుకు యూఎన్ సర్వే… దాంతో మన మీడియా కళ్లకద్దుకుని అదో విశేషవార్తగా ప్రచురించి సంబరపడిపోవడం..!! ఓ తెలుగు పత్రికవాడైతే అట్టడుగున భారత్, మోడీ పాలన నిర్వాకం అని రాసేసింది… 143లో 126 అట్టడుగు అట..! ఇదీ మన దరిద్రం..!!
Share this Article