కేరళ ప్రభుత్వం ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది… విషయం ఏమిటంటే..? ఆమె నాలుగు బిల్లులను పాస్ చేయకుండా తన వద్ద పెండింగ్‌లో ఉంచుకున్నారని..! సరే, ఆ బిల్లులు ఏ అంశాలకు సంబంధించినవీ అనేది పక్కన పెడితే… రాష్ట్రం పంపించిన ప్రతి బిల్లును రాష్ట్రపతి పాస్ చేయాలనేమీ లేదు… రాష్ట్రపతి పరిశీలన, విచక్షణతోపాటు, కేంద్రప్రభుత్వ అభిప్రాయం, రాజ్యాంగబద్ధత, సమాజంపై ప్రభావం వంటి చాలా కారణాలుంటయ్…
సరే, సుప్రీంకోర్టులో ఆమెతోపాటు ఆమె సెక్రెటరీ, రాష్ట్ర గవర్నర్, ఆయన కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చేర్చారు… గవర్నర్ ఏడు బిల్లులను పాస్ చేయకుండా, నాలుగింటిని రాష్ట్రపతికి పంపించాడని పిటిషన్‌లో ఆరోపణ… కేరళ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు ఇవేవీ చట్టవిరుద్ధం కావు… అయితే సుప్రీంకోర్టు ఏం చేయగలదు..? ఇది ఓ కీలక ప్రశ్న…
రాజ్యాంగంలోని 361 ఆర్టికల్ ప్రకారం… గవర్నర్లు, రాష్ట్రపతి తమ విధులకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా కోర్టులు వాళ్లను, ఆ నిర్ణయాల్ని ప్రశ్నించలేవు… ఆ రక్షణ ఉంది… అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది… ఒకవేళ ఆ నిర్ణయాలు గనుక అసంబద్ధంగా, ఏకపక్షంగా, దురుద్దేశపూరితంగా ఉంటే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని గతంలో కోర్టులు స్పష్టీకరించాయి… రాజ్యాంగమూ అదే చెబుతోంది…
Ads
గతంలో ఎస్ఆర్ బొమ్మై కేసులో గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది… ఇది 1989లో…! ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి రాష్ట్రపతికి కూడా తిరుగులేని అధికారాలు ఏమీ లేవని కూడా చెప్పింది… ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దు చేయడానికి ఈ తీర్పే అడ్డంకిగా మారింది…
ఈ నాలుగు బిల్లులు ఇంకా పరిశీలనలో ఉన్నాయనే రాష్ట్రపతి కార్యాలయం చెబుతుంది తప్ప ఏ నిర్ణయమూ ప్రకటించలేదు… బిల్లుల ఆమోదంపై కాలవ్యవధిని సుప్రీంకోర్టు రాష్ట్రపతికి నిర్దేశించగలదా..? ఇదీ ఆసక్తికరం… ప్రస్తుత సుప్రీంకోర్టు గనుక రాష్ట్రపతి చేసే జాప్యాన్ని విచారించాలని అనుకుంటే రాష్ట్రపతి స్పందన ఎలా ఉంటుంది..? మన వ్యవస్థలో ప్రతి విభాగానికి చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నయ్… రాష్ట్రపతి అధికారాలు, విచక్షణ పరిధిలోకి సుప్రీంకోర్టు రావడాన్ని రాష్ట్రపతి అంగీకరించకపోవచ్చు… అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది..?
ద్రౌపది ముర్ము ఏకపక్షంగా, దురుద్దేశపూరితంగా, అసంబద్ధంగా ఆ బిల్లుల పట్ల వ్యవహరిస్తున్నట్టు నిరూపించడమూ కష్టమే… గవర్నర్ బిల్లులు తిప్పి పంపిస్తే మళ్లీ అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్‌కు మళ్లీ పంపించి అనివార్యంగా ఆమోదించే పరిస్థితిని క్రియేట్ చేయవచ్చు… కానీ రాష్ట్రపతిని అలా నిర్దేశించలేరు… ఆర్టికల్ 52 నుంచి 62 వరకు రాష్ట్రపతి అభిశంసనకు అవకాశమిస్తుంది… కానీ పార్లమెంటు సూచిస్తేనే… సో, ఆ సిట్యుయేషన్ కూడా ఏమాత్రం లేదిప్పుడు… సో, సుప్రీంకోర్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందనేది ఇంట్రస్టింగుగా మారింది…!!
Share this Article