ఒక్కసారి తెలుగు డెయిలీ పేపర్లకు సంబంధించి తాజా (2023) ఏబీసీ (Audit Bureau of Circulation) ఫిగర్స్ విశ్లేషించుకుంటే…
రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర మెట్రోల్లో సేల్స్ కలిసి… ఈనాడు ఇప్పుడు కూడా నంబర్ వన్… 2022లో 13.50 లక్షల కాపీలు కాగా, 2023లో అది 35 వేలు తగ్గి 13.15 లక్షలకు తగ్గింది… నిజానికి గతంలోని పతనంతో పోలిస్తే ఒకరకంగా రిలీఫే దానికి… పైగా అది ప్రింట్ కాపీల మీద పెద్దగా కాన్సంట్రేట్ చేసే పరిస్థితి లేదు… డిజిటల్, టీవీ మీడియా మీదే కాన్సంట్రేషన్… ఐనా సరే, ఏపీలో సాక్షి నంబర్ వన్ గాకుండా ఉండేందుకో, జగన్ మీద ప్రచారం జనంలోకి ఇంకా ఎక్కువ పోవడానికో గానీ… లక్షల కాపీలు డంప్ చేసినట్టు ఆరోపణలయితే ఉన్నాయి…
ఎందుకంటే..? జగన్ మీద వ్యతిరేక ప్రచారం జోరుగా సాగాలి, ఏబీసీ ఫిగర్స్‌ను బట్టే యాడ్స్ వస్తాయి కాబట్టి నంబర్ వన్ కాపాడుకోవాలి… అసలే అడ్డగోలుగా యాడ్ టారిఫ్ తగ్గింపులు, రాయితీలు ఇస్తూ రెవిన్యూ కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోంది…
Ads
మరి సాక్షి సిట్యుయేషన్..? 2022లో సర్క్యులేషన్ 10 లక్షలు కాగా, అది గత ఏడాది జస్ట్ 30 వేల కాపీలు పెరిగి 10.30 లక్షలకు చేరింది… ఏపీలో ప్రభుత్వం ఉండీ, వాలంటీర్లకు నెలనెలా కొంత డబ్బు ఇచ్చి, దినపత్రిక వేసుకోవాలంటూ జీవో ఇచ్చినా సరే, ఏపీలో కూడా ఈనాడును దాటలేకపోయింది… చివరకు జగన్ సొంత జిల్లా కడపలో కూడా ఈనాడుకన్నా సాక్షి చాలా మైనస్… కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కొద్దిగా ఈనాడుకన్నా బెటర్, కాగా ఒంగోలు, తిరుపతి జిల్లాల్లో ఈనాడుకన్నా కాస్త ఎక్కువే… మిగతా ఏ జిల్లాలోనూ ఈనాడును బీట్ చేయలేకపోయింది…
తెలుగు పత్రికల్లో ఏబీసీ సర్టిఫికేషన్ ఉండేదే మూడు పత్రికలకు… బీఆర్ఎస్ బాకా కరపత్రం నమస్తే తెలంగాణ ఏనాడో ఏబీసీ నుంచి బయటికి వచ్చేసింది… మిగతా పత్రికలేవీ ఏబీసీ వైపు పోలేదు, అసలు ఫిగర్స్ బయటికి వస్తే యాడ్స్‌కు ఇబ్బంది, పైగా ఆ మూడు ప్రధాన పత్రికలు మినహా మిగతావి పెద్దగా ఎవరూ చదవరు, కౌంట్ లెస్… (కొంచెం వెలుగు బెటర్, కాకపోతే అదీ ఈమధ్య టీవీని తప్ప ప్రింట్ ఎడిషన్‌ను పెద్దగా పట్టించుకున్నట్టు లేదు…)
ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే… ఈనాడులో దాదాపు నాలుగో వంతు, సాక్షిలో దాదాపు మూడో వంతు… 2022తో పోలిస్తే 2023లో దాదాపు సేమ్, 300 కాపీలు ఎక్కువ… 2022లో 3.87 లక్షలు, 2023లోనూ దాదాపు అంతే… ఏపీలో కేవలం 2.34 లక్షల కాపీలు… ఆంధ్రజ్యోతి కూడా ప్రింట్ ఎడిషన్ మీద పెద్దగా కాన్సంట్రేషన్ లేదు ఇప్పుడు… టీవీ మీదే ధ్యాస ఎక్కువగా… మూడు పత్రికలూ వాటి డిజిటల్ వెర్షన్ల మీదే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాయి… జనం చదువుతున్నదీ వాటినే… పొలిటికల్ అవసరాల కోసం ఇప్పుడు పత్రికల కాపీల మీద ఈమాత్రం దృష్టి ఉంది, రాబోయే ఎన్నికల తరువాత డంపింగ్ పూర్తిగా తగ్గిపోయి, అప్పుడు నిజమైన పాఠకాదరణ తేటతెల్లం కావచ్చు.,. (మిగతాది సెకండ్ పార్ట్ లో…)
Share this Article