యూపీఎస్సీ 2003 రిజల్ట్స్ వచ్చాయి… ర్యాంకులు కొట్టి, సివిల్ సర్వీసులో చేరబోతున్నవారి మొహాల్లో, ఆ కుటుంబాల్లో ఆనందం… ఇంటర్వ్యూల దశ దాటలేని దురదృష్టవంతుల్లో మళ్లీ నిరాశ…
ఫస్ట్ ర్యాంకర్ నుంచి బోలెడన్ని ర్యాంకుల దాకా… మీడియాలో, సోషల్ మీడియాలో బోలెడన్ని సక్సెస్ స్టోరీలు… అర్హులే అభినందనలకు… మరి ఒకటీ అరా మార్కులతో విఫలమైన వాళ్ల ఫెయిల్యూర్ స్టోరీలు ఎవరు చెప్పాలి… అవి కదా అసలు అందరికీ తెలియాల్సినవి… ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలిస్తే కదా లక్షల మందికి ఉపయోగకరం…
ఎవరు చెబుతారు..? మీడియాకు విజేతలే కావాలి… వాళ్లకు అందరూ బంధువులే, కానీ పరాజితులకు బాసట దొరకదు… పరాజితులే చెప్పుకోవాలి తమ స్టోరీలను, తప్పదు… ఇదీ అలాంటిదే… కునాల్ ఆర్ విరుల్కర్ అనే అభ్యర్థి ఒక ట్వీట్ కొట్టాడు (ఎక్స్)… తన చదువు, తన ప్రయత్నాలు, తన నేపథ్యం, తన కథ ఏమీ చెప్పలేదు… జస్ట్, ఇలా సింపుల్‌గా…
Ads
‘జీవితానికి మరో పేరు సంఘర్షణ’ పేరుతో రాశాడు ఫస్ట్ జనరేషన్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు… ఇలా… ‘‘12 అటెంప్టులు, 7 మెయిన్స్, 5 ఇంటర్వ్యూలు… కానీ నో సెలక్షన్…’’
ఇది ఎంత వైరల్ అయిపోయిందంటే… 18 లక్షల వ్యూస్… 2686 రీపోస్టులు… 24,600 లైకులు… 1335 బుక్ మార్క్స్… (ఈ కథనం రాసే సమయానికి…)
‘‘మీ పోరాట జీవితంలో ఏది దక్కాలని ఉందో అదే జరుగుతోంది… కంగ్రాచ్యులేషన్స్’’ అంటాడు ఓ కామెంటర్… ‘ఈసారి కాకపోతే ఏం, మరోసారి’ అని మరొకరి స్వాంతన… ‘మీ చిరునవ్వు ఇంకెందరికో శక్తినిస్తుంది’ అంటాడు మరొకాయన… ‘వేరే వాళ్లయితే ఎప్పుడో వదిలేసేవాళ్లు, మీరు విక్రమార్కులు, లెజెండ్…’ అని ఇంకొకాయన… ఇలా కామెంట్ల వరద…
‘ఇన్ని ఫెయిల్యూర్ల అనంతరమూ మీ ప్రయత్నాల్ని అలా ఎలా కొనసాగించగలిగారు భయ్యా’ అని ఆశ్చర్యపోయాడు మరొకరు… జర్నలిస్టు అభిజిత్ కరాండే ఏమంటాడంటే… ‘కునాల్, నీవొక స్పూర్తి… ఆగకు, గెలిచేదాకా… ఓడిపోయానని ఆగిపోకు … ఈ మోటివేషనల్ వాక్యానికి నువ్వే ఓ ఉదాహరణ… జర్నలిస్టు స్వాతి చతుర్వేది ‘ఇది కదా పక్కా యోగి తత్వం’ అని వ్యాఖ్యానించింది…
చివరగా…. ప్రధాని మోడీ కూడా గెలుపు దక్కని అభ్యర్థుల గురించి ఓ ట్వీట్ వదిలాడు…
Share this Article