Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మదర్ ఇండియా జమున… ఎందరు వద్దన్నా వినక చేసేసింది…

April 20, 2024 by M S R

Subramanyam Dogiparthi…   జమున నట విశ్వరూపం 1971 లో వచ్చిన ఈ బంగారు తల్లి సినిమా . గ్లామర్ పాత్రల్లో రాణించిన ఈ సత్యభామ పూర్తి డీగ్లామర్ పాత్రలో జీవించింది . చాలామంది ఈ పాత్రను చేయవద్దని చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి ముందుకొచ్చింది . జమున తర్వాత ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది కృష్ణంరాజునే . విలన్ పాత్రలకు , దారి తప్పిన కొడుకు పాత్రలకు పరిమితమయిన కృష్ణంరాజు అసలు సిసలయిన రెబల్ పాత్రను వేసి రెబల్ స్టార్ అయ్యాడు .

వారిద్దరి తర్వాత నిర్మలమ్మ . మనుషులు మారాలి సినిమాలో పాత్రలాగే ఉంటుంది ఈ సినిమాలో పాత్ర కూడా . చాలా బాగా నటించింది . ఈ ముగ్గురి తర్వాత నాగభూషణం పాత్ర , అతని నటన . అరవై డెబ్బై సంవత్సరాల కింద గ్రామాల్లో ఉండే టిపికల్ వడ్డీ వ్యాపారం చేసే షైలాక్ పాత్ర . బాగా నటించారు . శోభన్ బాబు , జగ్గయ్య , సురభి బాలసరస్వతి , అల్లు రామలింగయ్య , రమాప్రభ , వెన్నిరాడై నిర్మల ప్రభృతులు నటించారు . పూర్తి గ్రామీణ వాతావరణంలో వందలాది మంది గ్రామస్తులు కూడా నటించారు .

యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగున్నా బయట హిట్ కాలేదు . ఇన్నాళ్ళు లేని సిగ్గు , ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి , పల్లె సీమ మన పంట సీమ , బంగరు తల్లి పండిందోయ్ పంటల పండగ , శ్రమించే రైతుల జీవాలే పాటలు ఉన్నాయి .

Ads

చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకున్నా , ఈ సినిమాకు మాతృక అయిన 1957 లో వచ్చిన మదర్ ఇండియా అంత పేరు , డబ్బు తెచ్చుకోలేదని నాకు గుర్తు . హిందీలో నర్గీస్ , రాజ్ కుమార్ , సునీల్ దత్ , రాజేంద్రకుమార్ ప్రధాన పాత్రలలో నటించారు . ఆ రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు రికార్డు సృష్టించాయి .

ఈ సినిమా ఎంత పేరు తెచ్చుకుందంటే ఆనాటి ప్రధాని నెహ్రూ , రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా ఈ సినిమాను వేయించుకుని చూసారు . జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా , ఫిలిం ఫేర్ అవార్డులను పొందింది . నర్గీస్ , దర్శకుడు ఖాన్ లకు ఉత్తమ నటి , ఉత్తమ దర్శకుడు అవార్డులు కూడా వచ్చాయి . అయితే , ఈ మదర్ ఇండియా సినిమా కూడా 1940 లో వచ్చిన ఔరత్ అనే హిందీ సినిమా ఆధారంగానే తీయబడింది .

తమ కుటుంబానికి ఘోరమైన అన్యాయం చేసిన వడ్డీ వ్యాపారస్తుని కుమార్తెను కిడ్నాప్ చేసే కొడుకుని తుపాకీతో చంపేసే తల్లి పాత్రలో జమున , నర్గీస్ గొప్పగా నటించారు . షైలాక్ పాత్రలు మన గ్రామాల్లో కనిపిస్తూనే ఉంటాయి . అలాంటి షైలాక్ లను నక్సలైట్లు చంపటం మనకూ తెలుసు . మా గుంటూరు జిల్లాలో , ప్రకాశం జిల్లాల్లో ఇలాంటి చంపటాలు చాలామందికి తెలుసు .

వెరశి నేను చెప్పేది ఏమిటంటే : ఈతరం వారికి ఈ రెండు సినిమాల గురించి తెలుసో లేదో నాకు తెలియదు . రెండు సినిమాలు యూట్యూబులో ఉన్నాయి . కాస్త కషాయంలాగా ఉన్నా ఓపిగ్గా రెండూ చూడండి . అలాగే మదర్ ఇండియా సినిమా ఘన చరిత్ర గురించి వికీపీడియాలో చదవండి . ఈ రెండు సినిమాలు ఒకనాటి భారతీయ గ్రామీణ నేపధ్యాన్ని , భారతీయ తల్లి ఔన్నత్యం , ఓపిక , సంసారాన్ని తీర్చిదిద్దుకునే నేర్పులను అద్భుతంగా ఆవిష్కరించాయి .

నేటి తరం యువతీయువకులు ఈ రెండు సినిమాలు కషాయంలాగా ఉన్నా చూడమని నా మనవి . యువతీయువకులే కాదు ; వీటిని చూడని వారు ఎవరయినా ఉంటే ముసలాళ్ళయినా వాచ్ లిస్టులో పెట్టేసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions