ఎవరాయన..? రామసహాయం సురేందర్‌రెడ్డి ఆయన పేరు… పాత వరంగల్ జిల్లాలోని మరిపెడ వాళ్లది… అది మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దు… ఎక్కువగా బంజారా ప్రజల తండాలు… పెద్ద గడీ… పెద్ద జమీ… అనగా సంస్థానం… తను పెద్ద దొర… ఇప్పుడు కొందరు ఎంపీ అభ్యర్థుల ఆస్తులు 5 వేలు, 6 వేల కోట్లు అని అబ్బురంగా చెప్పుకుంటున్నాం కదా…
ఒక్క ముక్కలో చెబుతాను సురేందర్‌రెడ్డి ఆస్తి గురించి… తన భూమిలోకి ఒక రైలు ఎంటరైతే పావు గంట తరువాత గానీ తన భూముల్లో నుంచి బయటికి రాదు… అదీ తన జమీ జాయదాద్… పెద్దగా మాట్లాడడు, మీడియా తెర మీదకు రాడు, చాన్నాళ్లు వరంగల్ ఎంపీ… కాంగ్రెస్ పార్టీ… జిల్లా రిపోర్టర్లు, స్టేట్ కాంగ్రెస్ బీట్ రిపోర్టర్లకూ ఆయన టచ్‌లో ఉండేవాడు కాదు, ఇక లోకల్ రిపోర్టర్ల సంగతి చెప్పాలా..? కాకపోతే ఎప్పుడూ పిచ్చి వ్యాఖ్యలు, మరీ డిగ్రేడెడ్ పాలిటిక్స్ చేయలేదు… తన రేంజ్‌కు తగినట్టు ఓ స్టేటస్, హుందాతనం మెయింటెయిన్ చేసేవాడు…
డోర్నకల్ ఎమ్మెల్యేగా మూడుసార్లు, వరంగల్ ఎంపీగా రెండుసార్లు… మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు… మొదట్లో రెడ్యానాయక్‌ను తనే ఎంకరేజ్ చేసినా… తరువాత రెడ్యానాయక్ ఏకు మేకుగా తయారయ్యాక సురేందర్‌రెడ్డి ఒకసారి 1996లో ఓడిపోయి ఇక రాజకీయాలకే దూరం జరిగాడు…
Ads
(నేను మూడున్నరేళ్లు ఈనాడు వరంగల్ జిల్లా రిపోర్టర్‌గా పనిచేస్తున్నప్పుడు హన్మకొండలో ఒకే ఒక్కసారి కాకతాళీయంగా ఎక్కడో కనిపించారు, అప్పటికి ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు… పరిచయం చేసుకుంటే.., ఓహ్ గుడ్.., హవ్ ఆర్ యూ అని పలకరించాడు… అంతే… మళ్లీ ఆయన్ని ప్రత్యక్షంగా చూడలేదు…)
కానీ ఇప్పుడు ఆయన కొడుకు రామసహాయం రఘురామ్ రెడ్డి ఖమ్మం పార్లమెంట్ బరిలో దిగడానికి రంగం సిద్ధం అయినట్లే కనపడుతోంది… ఆయన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశాడు… పార్టీ ఆయన్ని అధికారికంగా ప్రకటించలేదు, కానీ ప్రకటిస్తారని అనుకుంటున్నారు… వేచి చూద్దాం…
అవునూ, ఇంతకీ ఈ రఘురాంరెడ్డికీ హీరో వెంకటేశ్‌కూ… మంత్రి పొంగులేటికీ చుట్టరికం ఏమిటంటారా..? ఉంది… ఈ రామసహాయం రఘురామ్ రెడ్డి సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా ఉన్నాడు… రఘురామ్ పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి… ఈయన ప్రముఖ నటుడు వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రితను పెళ్లి చేసుకున్నాడు…
రఘురామ్ రెడ్డి చిన్న కొడుకు అర్జున్ రెడ్డి... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు… ఢిల్లీ లెవెల్‌లో చక్రం తిప్పిన పొంగులేటి… తమ్ముడికి కాకపోయినా సొంత వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో దాదాపు సఫలం అయినట్టే కనిపిస్తోంది… రఘురామ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది… ఇన్‌పుట్స్ :: John Kora
Share this Article