గ్రహాల సంచారం మీద ఆధారపడినవే గ్రహచార దోషాలు, జాతకాలు, జ్యోతిష్యాలు తదితరం… పుట్టిన ప్రాంతమే కాదు, పుట్టిన ఘడియకూ ప్రాధాన్యం ఉంటుంది… ఘడియ మారితే జాతకం మారుతుంది… ఆస్ట్రాలజీ… నమ్మేవాళ్లకు..! సేమ్, ఖగోళ శాస్త్రమూ అంతే… ఆస్ట్రానమీ… ఒక్కో సెకనూ చాలా విలువైనది…
ఇది హఠాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… మన ఇస్రో వెల్లడించిన ఓ విషయం చదివిన తరువాత… చంద్రయాన్-3 సంగతి ఇది… ఆల్రెడీ ఓసారి ఫెయిలయ్యాం కాబట్టి చంద్రయాన్-3 మీద బోలెడన్ని అంచనాలు, ఆశలు… ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన వైజ్ఞానిక స్థాయిలో నిలుచునే అవకాశం… వేల కోట్ల వ్యయం…
పైగా కార్యభారమంతా పైన వేసుకున్న చీఫ్ తనకు కేన్సరని తెలిసీ, గుట్టుగా గుంభనంగా తన టీం డిమోరల్ కావొద్దని ఎప్పటిలాగే పనులు పర్యవేక్షిస్తున్న సందర్భం… ప్రపంచ దేశాల అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నవేళ… జూలై 14, 2023…
Ads
ఓ సందేహం పెను విపత్తులా ఎదుట నిలిచింది… ముందే నిర్ణయించిన ముహూర్తానికి, అనగా టేకాఫ్ వేళకు అలాగే ప్రారంభిస్తే… మధ్యలోనే ఏవో ఉపగ్రహ శిథిలాలు, వ్యర్థాలు తగిలి మొత్తం చంద్రయాన్-3 రాకెట్లు, ల్యాండర్, రోవర్ గట్రా చంద్రుడిని చేరకుండానే, ఎక్కడో ఆర్బిట్‌లో ధ్వంసం అయిపోయే ప్రమాదం…
ఏం చేద్దాం..? ఆ ముప్పు నివారించడం ఎలా..? చటుక్కున ఓ ఐడియా తోచింది… మన రాకెెట్ మార్గం నుంచి ఆ వ్యర్థాలు, శిథిలాలు దాటిపోయాక ఆ పాయింట్ దాటేలా టైమ్ అడ్జస్ట్ చేయాలి, అంతే… మరోసారి సరిచూసుకుని, అదే సరైన మార్గమని డిసైడ్ చేసుకుని, నాలుగు… నాలుగంటే నాలుగే సెకన్లు ఆలస్యంగా పని ప్రారంభించేశారు…
అంతే… దూసుకుపోయింది చంద్రయాన్-3 మిషన్… స్టాండర్డ్ లాంచ్ క్లియరెన్స్ ప్రోటోకాల్ ప్రకారమే… Collision Avoidance Analysis (COLA) ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది… దీన్నే precision and proactive space management అంటారు… ఈ ప్రాజెక్టే కాదు, రేప్పొద్దున మనం ప్రతిష్ఠాత్మకంగా ఖగోళంలోకి పంపించే ప్రతి మిషన్‌కూ ఇది అవసరం… ప్రమాదాల్ని సరిగ్గా గుర్తించడం, ఆ శిథిలాల నుంచి నేర్పుగా తప్పించి మన రాకెట్లను, రోవర్లను అనుకున్న బాటలో క్షేమంగా పంపించడం…
Space Situational Assessment Report (ISSAR) ప్రకారం గత ఏడాది కనీసం 23 సందర్భాల్లో మన ఉపగ్రహాలను రక్షించారట… గుడ్… కానీ ఈ వివరాలు అంతరిక్షంలో పెరిగిపోయిన వ్యర్థాలు, శిథిలాల బెడదను మరోసారి చర్చల తెర మీదకు తెచ్చింది… వేల ఉపగ్రహాలు, కొత్తవి, పాతవి, చెడిపోయినవి అక్కడే భ్రమిస్తూ ఉంటాయి… వాటిని నిర్మూలించలేం… ఇంకా ఈ బెడద పెరిగిపోతే ఏం చేయాలో అంతరిక్ష పరిశోధన సమాజం ఇంకా ఇదమిత్థంగా నిర్ణయించలేదు… వీటన్నింటికతోడు గ్రహసంచారం- అంతరిక్షం అనే అంశాల్లో ప్రతి ఘడియా ఎంత విలువైందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ..!!
చెప్పనే లేదు కదూ… రాబోయే యుద్దాలు నేలపై కాదు… అంతరిక్షంలో జరుగుతాయి… ఇప్పుడు శాటిలైట్స్ లేకుండా ప్రపంచం లేదు కదా… ఒకరి ఉపగ్రహాల్ని మరొకరు పేల్చేస్తారు… ఆల్రెడీ ఆ టెక్నాలజీ ఉంది… మనకు కూడా… అదే జరిగితే ఇంకా ఖగోళం నిండా ఎన్ని వ్యర్థాలు, ఎన్ని శిథిలాలు, ఎంత ప్రమాదం…!!
Share this Article