Bharadwaja Rangavajhala….. త్యాగయ్య బర్త్ డే సందర్భంగా… రెహమాన్ గురించి…
అందులో త్యాగయ్య కావేరీ నదిని దాటుతోంటే పోయిన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపించి కనుగొంటినీ శ్రీరామునీ నేడు అన్న కీర్తన ఆలపించిన సందర్భంలో …
రెహమాన్ గారి కెమేరా అద్భుతం సృష్టించింది.
Ads
తాంత్రిక ఛాయాగ్రహణం చేసి ప్రేక్షకులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్లిపోయారు రెహమాన్ గారు.
తాంత్రిక ఛాయాగ్రాహకుడుగా ఆయనకు చాలా పేరుండేది ఆరోజుల్లో.
మాయాలోకం సినిమా గుర్తుంది కదా మీకందరికీ …
అదేనండీ మన గూడవల్లి రామబ్రహ్మంగారు అక్కినేని నాగేస్పర్రావు హీరోగా తీసిన కాంభోజరాజు కథ.
అలా ఆ యొక్క మాయాలోకంలో రెహమాన్ గారు నిజంగానే ప్రేక్షకుల ముందు మాయాలోకం ఆవిష్కరించారు.
ఆ సినిమా సారథీ బ్యానర్ లో రూపొందింది.
త్రిపురనేని గోపీచంద్ సంభాషణలు రాశారు.
రెహమాన్ గారు అనేక తెలుగు సినిమాలకు పనిచేశారు. ముఖ్యంగా పౌరాణికాలు చేయడం ఆయనకు ఇష్టం.
ఇక్కడే ఎన్టీఆర్ తో కనెక్ట్ అయ్యారు ఆయన.
అలుగుటయే ఎరుంగని పద్యం ఆయన షూట్ చేసిన పద్దతి అనితరసాధ్యం అనేవారు ఎన్టీఆర్.
చాలా ఎమోషనల్ గా ఉండే ఆ పద్యాన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో షూట్ చేస్తే తప్ప ఆడియన్స్ ను ఎమోషనలైజ్ చేయడం కుదరదని రెహమాన్ చెప్పిన పద్దతి ఎన్టీఆర్ కు కనెక్ట్ అయ్యింది.
మరి ఆ రోజుల్లో ఆయన వయోభారంతో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా శ్రీమద్ విరాటపర్వానికి ఆయనతో కెమేరా చేయించుకున్నారు.
అంతే కాదు ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ రెహమాన్ గారి దగ్గర కెమేరా మెలకువలు నేర్చుకున్నారు.
రామకృష్ణ స్టూడియోస్ నిర్మాణం వ్యవహారాల్లోనూ రెహమాన్ గారి సలహాలు తీసుకున్నారు.
ఆయన్ని కొంత కాలం హైద్రాబాద్ లో ఉంచేశారు.
నంబర్ ఆరు థామస్ రోడ్ మద్రాసులో ఉండేవారాయన.
సెట్ లో హడావిడి చేయడం రెహమాన్ గారి పద్దతి కాదు.
రేపు తీయబోయే సన్నివేశాలకు సంబంధించి దర్శకుడితో ముందురోజే చర్చించి తన అభిప్రాయాలు ఆయనకు చెప్పి ఒప్పించి అప్పుడు సెట్ లో కాలు పెట్టేవారట ఆయన.
అందుకని సెట్ లో అనవసరమైన చర్చలను అవైడ్ చేయవచ్చనేది ఆయన భావన.
కెమెరా కన్నప్ప గారు కూడా దీన్నే ఫాలో అయ్యేవారు.
రెహమాన్ గారు సౌత్ సినిమాలకు పనిచేశారు.
అయితే రెహమాన్ గారు పుట్టింది ఔరంగాబాద్ లో.
సరిగ్గా నూటపదేళ్ల క్రితం.
అంటే 1914లో.
అలా యవ్వనం లోకి అడుగుపెట్టాక పని వెతుక్కుంటూ బొంబాయి చేరారు.
బొంబాయిలో … హర్యా ఫిలిం కంపెనీలో చేరి అక్కడే కెమేరా అసిస్టెంట్ అయ్యారు.
అప్పట్లో మూకీ చిత్రాల నిర్మాణం జరిగేదక్కడ.
నెమ్మదిగా అక్కడ పోటీ పెరిగి … మద్రాసులో వేల్ పిక్చర్స్ లాంటి కంపెనీలు వెలసి స్టూడియోలు నిర్మించడం ప్రారంభించాక …
ఇక్కడ మనుషులు అవసరం అయ్యారు.
ఎల్వీ ప్రసాద్ లాంటి ముంబై వాసులు చలో మద్రాసు అన్నప్పుడు ఇక్కడ అవసరాలకు బొంబాయి అనుభవజ్ఞులను తీసుకోవడం ప్రారంభమయ్యింది.
అలా రెహమాన్ గారు మద్రాసు చేరారు.
1950 లో శ్రీ లక్ష్మమ్మ కథ, లక్ష్మమ్మ అనే రెండు సినిమాలు వచ్చాయి.
ఆ రెండు సినిమాల మధ్యా తీవ్రమైన పోటీ నెలకొంది.
ఫైనల్ గా లక్ష్మయ్య గెల్చింది.
గోపీచంద్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా సక్సస్ లో రెహమాన్ గారిది కీలకపాత్ర.
రెహమాన్ గారు తెలుగు చిత్రాలకే కాదు తమిళ హిందీ సినిమాలకూ పనిచేశారు.
Share this Article