హైదరాబాద్ వ్యాపారి వాసు నిర్వహించిన రేవ్ పార్టీ… వోకే… పర్లేదు… బోలెడు మంది టీవీ, సినిమా నటీనటులు, రాజకీయ పార్టీల నాయకులు గట్రా హాజరయ్యారు… వోకే, అంతగా పరిచయాలు, సర్కిల్ ఉన్న బడా వ్యాపారి అన్నమాట… పర్లేదు…
బెంగుళూరు శివారులోని బీఆర్ ఫామ్ హౌజు (ఓనర్ గోపాలరెడ్డి అట)లో జరిగిన ఆ రేవ్ పార్టీని బెంగుళూరు నార్కొటిక్ పోలీసులు భగ్నం చేశారు, వోకే… అబ్బే, మేమక్కడ లేనేలేం అని మాజీ హీరో శ్రీకాంత్, ఒకప్పటి నటి హేమ ఖండించారు… సరే, అంతమందిలో మీరిద్దరు, అంత ఫీల్ కావల్సిన పని లేదు, పెద్ద ఫరక్ పడదు… వోకే…
ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ స్టిక్కర్ ఉన్న వాహనం అట… ఎమ్మెల్యే, మంత్రుల స్టిక్కర్లు చాలామంది వాడేసుకుంటున్నారు, అది పెద్ద ఇష్యూయే కాదు… అక్కడ దొరికినవాళ్లను అదుపులోకి తీసుకున్నారు… కొంతమేరకు డ్రగ్స్ స్వాధీనం… అక్కడున్న కార్లను సీజ్ చేశారు… ఇక్కడ కొన్ని ప్రశ్నలు…
Ads
అకున్ సభర్వాల్ ఎక్సయిజులో ఉన్నప్పుడు హైదరాబాదులో కొందరు సినిమా ప్రముఖులను పట్టుకుని, రోజుకొకరిని పిలిచి పెద్ద షో చేశాడు… ఏమైంది..? ఏమీ జరగలేదు… కేసులు ఫట్‌మని తేలిపోయాయి… చివరకు ఆ సభర్వాలే మళ్లీ కనిపించకుండా పోయాడు… డ్రగ్స్ పెడిలింగ్ నేరం, అంతే తప్ప, మరీ స్వల్ప మోతాదుతో దొరికినా, సేవించినా నేరం కాదన్నట్టుగా ప్రభుత్వమే వదిలేసింది…
ఆమధ్య ఏదో పబ్బులో అర్ధరాత్రి దాటాక దాడులు చేసి, అందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారు, నాగబాబు బిడ్డ కూడా దొరికినట్టుంది కదా… పోనీ, ఆ కేసు ఏమైంది..? ఏమీ కాలేదు, ఏమీ కాదు కూడా..! రేవ్ పార్టీలను ఏ చట్టం కింద నిషేధించారు..? ఆ పార్టీలో పాల్గొంటే ఇక డ్రగ్స్ నేరస్థుడేనా..? అదుపులోకి తీసుకోవడం ఏమిటి..? వాహనాలను సీజ్ చేయడం ఏమిటి..? పోనీ, పార్టీకి వెళ్లినంతమాత్రాన డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపణ ఏమిటి..? ఈ సతాయింపులు ఏమిటి..?
పోనీ, వీటితో ఏమైనా సాధించేది ఏమైనా ఉంటుందా..? ఏమీ ఉండదు, నాలుగు రోజులు మీడియా హడావుడి తప్ప..! తరువాత అంతా గప్‌చుప్… నిజానికి పోలీసులకు చేతనైతే ఎవడు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో పట్టుకోవాలి, వాళ్ల నెట్‌వర్క్ బ్రేక్ చేయాలి, రూట్స్ చేధించాలి… అంతేతప్ప సెలబ్రిటీలు పాల్గొన్నారు కదాని అరెస్టు చేస్తే ఎలా..? అసలు రేవ్ పార్టీలు అంటే యాంటీ సోషల్ అని ఎవరు ముద్రవేశారు..?
సరే, తాటిచెట్టు కింద కూర్చొని ఏం తాగినా కల్లు తాగామనే అంటారు… రేవ్ పార్టీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తీసుకున్నట్టేనా..? నిజానికి రియాలిటీ మాట్లాడుకోవాలంటే బెంగుళూరు, హైదరాబాదే కాదు, ఓ మోస్తరు నగరాల్లో డ్రగ్స్ విస్తరించాయి… గంజాయి సహా మత్తుపదార్థాలన్నీ వ్యాపిస్తున్నాయి… అదుగో అదీ టార్గెట్ ఏరియా… ఈ కార్ల స్వాధీనాలు, ఈ అరెస్టులు, మీడియా అటెన్షన్ కాదు… నిజమైన పోలీస్ అసలు వేళ్లను నరికేస్తాడు… అదీ సమర్థత..!!
Share this Article