Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే ఎన్టీయార్ ట్రిపుల్ యాక్షన్… ఆపై జయంతి నాటకీయత…

June 1, 2024 by M S R

Subramanyam Dogiparthi…. NTR త్రిపాత్రాభినయం చేసిన ఏకైక సాంఘిక చిత్రం 1972 లో వచ్చిన ఈ కులగౌరవం సినిమా . తమ స్వంత బేనరయినా పేకేటి శివరాంకి దర్శకత్వం వహించే అవకాశాన్ని కలగచేసారు . మన తెలుగు సినిమాకు మాతృక 1971 లో వచ్చిన కులగౌరవ అనే కన్నడ సినిమా . దానికి కూడా పేకేటియే దర్శకుడు . కన్నడంలో రాజకుమార్ , జయంతి , భారతి నటించారు . తమిళంలో 1976 లో రీమేక్ చేసారు . దానికీ పేకేటియే దర్శకుడు . మూడు భాషల్లోనూ పేకేటియే దర్శకుడు . తమిళ సినిమాలో ముత్తురామన్ , జయంతి , జయసుధ నటించారు . జయంతి మూడు భాషల్లోనూ నటించింది .

తాత , కొడుకు , మనమడు పాత్రల్లో నటించారు NTR . తాత జమీందారు . కొడుకు సాధారణ స్త్రీని ప్రేమిస్తాడు . తండ్రి ఒప్పుకోడు . ఇంట్లోనుంచి బయటకు వెళ్ళ పెళ్లి చేసుకుంటారు . దివాన్ కొడుకు బుర్రలో అనుమానాలు రేకెత్తించి , వాళ్ళ కాపురాన్ని నాశనం చేస్తాడు . తమకు పుట్టిన బిడ్డను ఒక్కడే పెంచుతాడు . మనమడు తాతకు బుధ్ధి చెప్పి , తల్లీదండ్రులను కలుపుతాడు . ఇదీ టూకీగా కధ .

NTR , జయంతి ఉంటే నాటకీయత ఉంటుంది కదా ! ఉంది . మన తెలుగులో ప్రధాన పాత్రల్లో NTR , జయంతి , ఆరతి నటించారు . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . టి విలో ఎప్పుడూ రాలేదు . ఎందుకనో ! సినిమా యూట్యూబులో కూడా లేదు . కన్నడ సినిమా ఉంది .

Ads

కన్నడ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన టి జి లింగప్పే మన తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించారు . హల్లో హల్లో డాక్టర్ , ఎన్ని కలలు కన్నానురా , కలగంటినని పలికావు , కులం కులం అంటావు గోత్రమేమిటంటావు , దేశమంటే నువ్వే కాదు , మాతృత్వం లోనె ఉంది ఆడజన్మ సార్ధకం , ఒహోహో బుల్లెమ్మా పొగరుబోతు బుల్లెమ్మా వంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి . NTR లెవెల్లో హిట్ కాలేదు పాటలు .

సినిమా కూడా NTR లెవెల్లో హిట్ కాలేదని గుర్తు . ఈ సినిమా వాసన కాస్త దాసరి వారి మనుషులంతా ఒకటేలో కనిపిస్తుంది . యూట్యూబులో లేదు కాబట్టి , NTR అభిమానులు ఎప్పుడయినా టి విలో వస్తే వీక్షించటమే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒప్పినోళ్లు మెచ్చనీ, ఒప్పనోళ్లు సచ్చనీ… కృష్ణ పేరిణి తాండవమంటే మజాకా..?!
  • తెలంగాణ చదరంగంలో ఇరువైపులా రేవంతే ఆడుతున్నాడు..!!
  • బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…
  • బొడ్డు అంటేనే డంపింగ్ యార్డ్… పూలు, పళ్ళు కాదు… సీసాలు కూడా..
  • జస్ట్ రిలాక్స్… మీకొక చిన్న సరదా పరీక్ష… ఔట్ ఆఫ్ ది బాక్స్ థింకాలి…
  • వేకువజామున వెన్నెల మరకలుగా… ఆహా… మేఘమా- దేహమా పాట నేటికీ క్లాసిక్…
  • నిమ్మకాయ గూఢచర్యం… ఓ ప్రపంచ యుద్ధం…
  • గుండె తడిని తాకే పాట..! మంగళంపల్లి నోట ఓ మాయల దెయ్యం..!
  • రాజేంద్రప్రసాద్ హౌజ్ హజ్జెండ్…! బోలెడు పాత్రలున్నా ఆ కారే హీరో..!
  • కాళ్లు బొబ్బలెక్కినా… ఆగకుండా 9 రోజులపాటు నర్తిస్తూనే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions