Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రష్మిక మంధన్నా..! తన మూలాల్ని గౌరవించింది… గర్వంగా చెప్పుకుంది…!

March 2, 2026 by M S R

.

వేల కోట్ల వసూళ్ల హీరోయిన్‌గా, నేషనల్ క్రష్‌గా వెలిగిపోతున్న రష్మిక మంధన్నా విజయ ప్రస్థానం అంత ఆషామాషీ కాదు… ప్రత్యేకించి తన సొంత ఇండస్ట్రీలో శెట్టి గ్యాంగ్ విద్వేషానికి గురవుతూ… తెలుగు, తమిళం, తరువాత హిందీలోకి ప్రవేశించి, తను గట్టిగా నిలబడిన తీరు అదృష్టం ప్లస్ ప్రతిభ ప్లస్ అవకాశాలు…

పదే పదే శెట్టి గ్యాంగ్ ఆమె మీద చేసే విమర్శ ఏమిటి..? ఆమె తన మూలాల్ని మరిచిపోయింది అని..! ఎందుకయ్యా అంటే, ఆమె శాండల్‌వుడ్ సినిమాల్లో నటించడం లేదట… ఈ గ్యాంగులే ఆమెను బెంగుళూరులో ఉండనివ్వరు, బ్యాన్ అంటారు, ఏదేదో విషం చిమ్ముతారు, మళ్లీ మూలాల్ని మరిచింది అంటారు…

Ads

అంటే..? వీళ్ల చెప్పుచేతల్లోనే బతకాలా..? ఆమె తృణీకరించింది… ధిక్కరించింది… పోరా అనేసింది… గీతగోవిందం తరువాత తనకు విజయ్ దేవరకొండ మద్దతు, టాలీవుడ్ మద్దతు దొరికింది… ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు… ఇంతకీ ఆమె తన మూలాల్ని మరిచిపోయిందా..? లేదు… అస్సలు లేదు…

విజయ్

తమ కొడవ సామాజికవర్గం విశేషాల్ని ఘనంగా చెప్పుకుంటుంది… చివరకు మిలిటరీ సంస్కృతి (యోధుల జాతి) ప్రధానంగా ఉండే తమ ఫుడ్‌లో పంది మాంసం ఉంటుందనీ చెప్పుకుంది… పంది కూర మీద సోషల్ మీడియాలో ఆమె మీద ట్రోలింగ్ సాగినా ‘హూ కేర్స్’ అని కొట్టిపారేసింది… అంతేకాదు, చాన్నాళ్లుగా కలిసే ఉంటున్న విజయ్ దేవరకొండతో తొలుత తెలంగాణ ప్రాంత వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకుని, తరువాత తమ కొడవ పద్ధతుల్లోనూ పెళ్లికి ఒప్పించింది…

ఆ పెళ్లి ఫోటోలు మొత్తం చూడండి… ఆ ఆభరణాలు, పెళ్లి తంతు ఎట్సెట్రా అన్నీ కొడవ సంస్కృతిని ఆమె గౌరవిస్తున్న, ప్రేమిస్తున్న… అంటే తన రూట్స్‌ను అభిమానిస్తున్న తీరుకు నిదర్శనం… అంతేనా..? తమ కొడవ మాండలికంలో అందరికీ ధన్యవాదాలు చెబుతూ ఓ స్పెషల్ వీడియో కూడా చేసింది…

rashmika

ఆ భాష అంతరించిపోతున్న ఓ దక్షిణ ద్రావిడ భాష… ఇది ప్రధానంగా మౌఖిక భాష… తమిళం, మలయాళం, కన్నడం, తుళు ప్రభావం ఎక్కువ… దానికదే ప్రత్యేక భాష… కన్నడానికి మాండలికం కాదు… కాకపోతే కన్నడ లిపిని ప్రధానంగా వాడుతుంటారు…

కొడగు జిల్లాలోనే వీరి ఉనికి ప్రధానం… 2011 జనాభా లెక్కలను బట్టి చూస్తే ఈ విశిష్ట జాతిలో ఇంకా ఈ భాష మాట్లాడేవారు లక్ష మంది వరకూ ఉన్నారు… అంతే… అంతకుముందు పదేళ్లతో పోలిస్తే ఆ భాషను వదిలేసిన వాళ్లు 31 శాతం… కొడవ (Kodava) సామాజికవర్గం చాలా ప్రత్యేకమైంది… వారి ఆచారాలు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మిగిలిన భారతీయ సంస్కృతులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి…

rashmika

కొడవలు సాంప్రదాయకంగా యోధుల జాతి... భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ కె.ఎమ్. కరియప్ప, జనరల్ తిమ్మయ్య ఈ సామాజికవర్గానికి చెందినవారే… ఇప్పటికీ దాదాపు ప్రతి కొడవ కుటుంబం నుండి ఒకరు సైన్యంలో దేశానికి సేవ చేస్తుంటారు…

వీరు ఆయుధాలను అమితంగా గౌరవిస్తారు… ‘కైల్ ముహుర్త’ అనే పండుగ సందర్భంగా వారు తమ ఆయుధాలకు (తుపాకులు, కత్తులు) పూజలు చేస్తారు… గాలిలోకి కాల్పులు జరిపి పండుగను జరుపుకోవడం వీరి ఆచారం…

rashmika

కొడవల పెళ్లిళ్లలో మరియు పండుగలలో కనిపించే దుస్తులు చాలా ప్రత్యేకం… పురుషులు ‘కుప్య’ (నల్లటి కోటు), నడుముకు ‘చేలే’ (నడుము పట్టీ) కట్టుకుంటారు… అందులో ‘పిచే కత్తి’ అనే చిన్న కత్తిని ధరిస్తారు… స్త్రీలు చీరను వెనుక వైపు నెరియలు (pleats) వచ్చేలా కట్టుకుంటారు… దీనిని ‘కొడవ స్టైల్’ అంటారు…

పూజారి లేని పెళ్లిళ్లు…: సాధారణంగా కొడవ పెళ్లిళ్లలో బ్రాహ్మణ పూజారులు ఉండరు… పెద్దల సమక్షంలోనే సంప్రదాయ పద్ధతిలో వివాహాలు జరుగుతాయి… పెళ్లిళ్లలో ‘పంది కర్రీ’ (Pandi Curry) సరేసరి… క్రీడల పట్ల, ముఖ్యంగా హాకీ పట్ల అమితమైన మక్కువ… ప్రతి ఏటా కొడగులో జరిగే “కొడవ ఫ్యామిలీ హాకీ టోర్నమెంట్” ప్రపంచంలోనే అతి పెద్ద ఫీల్డ్ హాకీ టోర్నమెంట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది…

కొడవ

  • కావేరి మాతను, వారి పూర్వీకులను (Ancestors) ఎక్కువగా ఆరాధిస్తారు… ఆర్మీ కరియప్ప, తిమ్మయ్యలతోపాటు, ఈ రష్మికతోపాటు టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప, మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, ఎంపీ గణేష్, బీపీ గోవింద వంటి హాకీ ఒలింపియన్స్, నటుడు గుల్షన్ దేవయ్య, ఈ దేశ మొదటి మహిళా ఫారిన్ సర్వీస్ అధికారిణి సీబీ ముత్తమ్మ… ఇలా ఎందరో… ఆమె తన సామాజికవర్గాన్ని, తన సంస్కృతిని కూడా ఓ గర్వకారణంగా చెప్పుకోవడంలో తప్పేముంది..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…
  • కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…
  • 77 వయస్సులో… 55 ఏళ్ల నాటి… ఓ ప్రేమ- పెళ్లి మురిపెం కథ…
  • సీఎం రేవంత్ రెడ్డి ఇది తప్పకుండా చదవాలని కోరుకుంటూ..!!
  • సమకాలీనులు వేరు- సమస్కంధులు వేరు… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!
  • మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…
  • కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!!
  • ఆమె కథలో ఎన్ని ట్విస్టులో… ప్రతి ఫేకుగాడికీ ఆ పేరిప్పుడు లోకువ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions