Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అది పాత తాకట్టు బంగారం కాదు… అక్కడ భద్రపరిచిన మన బంగారమే…

June 1, 2024 by M S R

RBI Gold is Back: భారత్‌కు చేరిన లక్ష కిలోల బంగారం.. ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్.. పసిడి పరుగులు తీస్తూ భారత్‌కు చేరుకుంది. ఒకటి కాదు రెండు కాదు. అక్షరాలా లక్ష కిలోల బంగారం.. భారత గడ్డపై దిగింది.. ఒకేసారి వంద టన్నుల బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారత్‌లో మళ్లీ స్వర్ణ యుగం మొదలైంది. ఇప్పుడు స్వర్ణ భారత్‌.. 24 కేరట్స్‌ బంగారంలా మెరిసి పోతోంది. కొత్త బంగారు లోకంగా మారిన భారత్‌.. సరికొత్త స్వర్ణ చరిత్రకు శ్రీకారం చుట్టింది…

… ఇదీ ఒక వార్త… కొత్తగా, హఠాత్తుగా స్వర్ణ యుగమేమీ కాదు, ఈ బంగారం రాకడకు కారణాలు వేరు… కొందరైతే అప్పట్లో చంద్రశేఖర్ అనబడే ఓ అసమర్థ ప్రధాని మన బంగారాన్ని తాకట్టు పెట్టి (1991లో..?) ఐఎంఎఫ్ నుంచి రుణం తెచ్చాడు… కొంత స్విట్జర్లాండ్, మరికొంత బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా అప్పటి మన సంక్షోభంలో ఆదుకున్నట్టు గుర్తు… తరువాత రుణం తీర్చేసినా సరే, ఆ బంగారం అక్కడే ఉంది…

సో, ఆ బంగారమే ఇప్పుడు తీసుకువచ్చారనేది కరెక్టు కాదు… ప్రపంచ మార్కెట్‌లో మన ఆర్థిక స్థితి, అనగా విదేశీమారకద్రవ్య నిల్వలు, కొత్త కరెన్సీ ముద్రణ, మన కరెన్సీ విలువ, మన ఆర్థిక స్థోమత వంటి అనేక అంశాలు మన బంగారం నిల్వల మీద ఆధారపడి ఉంటాయి… మన రుణసమీకరణ స్థితినీ అదే నిర్దేశిస్తుంది… మనం చాన్నాళ్లుగా విదేశీమారక ద్రవ్యనిల్వలు పెంచుకోవడం మీద ఎలాగైదే దృష్టి పెట్టామో, మనకు కంఫర్టబుల్‌గా సరిపడా బంగారం నిల్వల్ని కూడా మెయింటెయిన్ చేస్తున్నాం…

Ads

మనం ప్రపంచ మార్కెట్‌లో కొనే బంగారాన్ని కొంతమేరకు బ్రిటన్‌లో నిల్వ చేస్తున్నాం… కొంత స్వదేశానికి తెచ్చుకుంటున్నాం… ఇప్పుడు తెచ్చేది కూడా తాజాగా కొన్న బంగారం ఏమీ కాదు… ఆల్రెడీ మనం కొని లండన్ సెక్యూరిటీ సిస్టమ్స్‌లో భద్రపరుచుకున్నదే…

అయితే రష్యాపై యూరప్ కంట్రీస్ విధించిన ఆంక్షలు… ఇజ్రాయిల్, పాలస్తీనా సమరం ముదురుతూ ఉండటం, ప్రపంచవ్యాప్తంగా క్రమేపీ ఉద్రిక్తతలు పెరుగుతున్న దశలో… మన బంగారం వేరే దేశంలో ఉంచడం క్షేమకరం కాదనే భావన మన రిజర్వ్ బ్యాంక్‌ది… (Subject To Correction) అందుకే కొంత మేరకు మన దేశానికి తెచ్చుకుని నాగపూర్, ముంబై ఏరియాల్లో మన సెక్యూరిటీ చెస్టుల్లో పెట్టుకోవాలని భావన…

2024 మార్చి నాటికి మన బంగారం నిల్వలు 822 టన్నులు… అందులో దాదాపు సగం, అంటే 414 టన్నుల బంగారం బయటి దేశాల్లోనే ఉంది… అదంతా బయట ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే ప్రత్యేక విమానాల్లో, ప్రత్యేక భద్రత ఏర్పాట్లతో దేశానికి తెచ్చుకుంటున్నాం… అదీ అసలు సంగతి…! ఒకటిమాత్రం నిజం… పాకిస్థాన్ వంటి రోగ్ దేశాలు దివాలా తీసి, బిచ్చమెత్తుకునే స్థితిలో ఉంటే, మనం విదేశీమారక నిల్వలు, బంగారం నిల్వలకు సంబంధించి మంచి పొజిషన్‌లో ఉన్నాం… అదీ విశేషం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions