Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాలయ్య తోపుడు భాగ్యంపై అంజలి రియాక్షన్ అక్షరాలా కరెక్టు..!!

June 2, 2024 by M S R

Murali Buddha….   బాలయ్య వ్యవహారంలో అంజలి చేసింది కరెక్ట్… ఎందుకంటే, ఒకసారి వేరే స్టోరీలోకి వెళ్దాం…

అరిజీత్ సింగ్ బాలీవుడ్ లో టాప్ గాయకుడు … ఒక్కో పాటకు 18 లక్షలు తీసుకుంటాడు … బోలెడు సంపాదించాడు … సింపుల్ గా బతుకుతాడు . రబ్బర్ చెప్పులు … పంజాబ్ లోని తమ సొంత గ్రామంలో ఉంటాడు … పిల్లలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు … ఊరిలో స్కూటర్ మీద తిరుగుతాడు … సింపుల్ గా బతకడం తనకు ఇష్టం అంటాడు …


ఓ అవార్డు పంక్షన్ లో అరిజీత్ కు అవార్డును సల్మాన్ ఖాన్ ఇచ్చే సందర్బంలో … రబ్బర్ చెప్పులు, సింపుల్ డ్రెస్ లో ఉన్న అరిజీత్ ను చూసి ‘‘ఇప్పుడే నిద్ర లేచి వచ్చినట్టు ఉన్నావు’’ అని సల్మాన్ జోకేశాడు … ఔను, మీరు నిద్ర పుచ్చారు (మీ యాంకరింగ్ నిద్ర పోయేట్టు ఉందని అర్థం ) అని అరిజీత్ ఘాటుగా బదులు ఇచ్చాడు …

Ads

అసలే సినిమా ఇండస్ట్రీ… కొన్ని పెదవి దాటకూడదు… పైగా తను సల్మాన్… ఇంకేముంది..? ఆ తరువాత ఖాన్ సినిమాలో అరిజీత్ కు పాటలు లేకుండా పోయాయి .. అంతే కాదు, అంతకు ముందు రికార్డు చేసిన పాటలను కూడా తొలగించి వేరే వారితో పాడించారు …


బాస్ జోక్ వేస్తే నవ్వాలి కానీ తిరిగి రిటార్ట్ ఇవ్వకూడదు, ఇస్తే ఉద్యోగం ఊడుతుంది … తెలిసిందే కదా… సల్మాన్ ఖాన్ జోక్ వేసినప్పుడు అరిజీత్ నవ్వి ఉరుకోవాలి … ఖాన్ కూడా అరిజీత్ వేసిన కౌంటర్ జోక్ కు నవ్వి ఊరుకోవాలి కానీ బాస్ కు ఇగో ఉంటుంది … అదీ సమస్య…


సరే, మళ్ళీ ఎలాగోలా రాజీ కుదిరి, అరిజీత్ కు మళ్ళీ అదే ఖాన్ సినిమాల్లో పాటలు పాడే అవకాశం వచ్చింది … అది వేరే కథ… అయితే బాలకృష్ణ అంజలిని తోసేయడం మీద విమర్శలకు … మా మధ్య గొప్ప అనుబంధం ఉంది అని అంజలి చెప్పింది … సినిమా రంగంలో బతికి బట్ట కట్టాలి అంటే అలా చెప్పాల్సిందే … అంజలి బతకనేర్చింది, గుడ్…

ఇంట్లో తుపాకీతో పేలిస్తేనే వ్యవస్థలు నిద్ర పోయాయి … కనీసం తల్లిదండ్రుల మద్దతు కూడా లేని హీరోయిన్ ఇండస్ట్రీలో బతికి బట్టకట్టాలి అంటే హీరో చర్య ఎలా ఉన్నా మెచ్చుకోవలసిందే … బాలకృష్ణ కు అసలు మందు అంటే ఏమిటో తెలియదు అని డైరెక్టర్లు చెప్పాల్సిందే …


ఎవరు ఎవరిపై కక్ష కట్టారో తెరపై కనిపించదు .. తెర వెనుక రాజకీయంతో యువ హీరోలు సైతం ఛాన్సులు లేక గిలగిలలాడి ఆత్మహత్య చేసుకోవాలి ( చేసుకున్నారు .. ) వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో అలాంటి ఈగోలకు తల వంచక తలెత్తుకొని నిలిచింది జమున ఒక్కరే … (రాధికా ఆప్టే…?) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions