Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆత్రేయా బూత్రేయా… సెన్సారోళ్ల కత్తెర్లకు పరీక్షలు పెట్టేవారు ఫాఫం…

June 3, 2024 by M S R

Bharadwaja Rangavajhala….. ఆత్రేయా బూత్రేయా… ఆ మధ్య బూతు పాట‌లు … సెన్సార్ ఇబ్బందుల మీద జ‌రిగిన చ‌ర్చ‌లో ఓ ముఖపుస్తక మిత్రుడు గారు ఎక్కు ఎక్కు తెల్లగుర్రం అనే యుగ‌పురుషుడి గీతం ప్ర‌స్తావించారు.

ఆత్రేయ‌ను ఎవ‌రూ బూత్రేయ అన్లేదు … ఆయ‌న్ని ఆయ‌నే బూత్రేయ అనేసుకున్నారు. వ‌చ్చేది బూతుమ‌హ‌ర్ధ‌శ అని ముందే తెలుసుకున్న న‌ర‌సింహాచార్యులుగారు ఆత్రేయావ‌తారం చాలించి … బూత్రేయ‌గా అవ‌త‌రిస్తున్న విష‌యం చెప్పార‌న్న‌మాట‌.

ఆయ‌న దాగుడు మూత‌లు సినిమా కోసం రాసిన అడ‌గ‌క ఇచ్చిన మ‌న‌సే ముద్దు పాట చిట్ట‌చివ‌ర్లో … నువ్వు నేను ముద్దుకు ముద్దు అని రాశారు. దాన్ని సెన్సార్ వారు అభ్యంత‌ర పెట్టారు. మార్చాల‌న్నారు.

Ads

ఆత్రేయ కోసం వెతికితే ఆయ‌న దొర‌క‌లేదు. దీంతో ఆదుర్తి గారి సలహా మేరకు నువ్వు నేను ఊఊఊఊ అని హ‌మ్ చేయించి సెన్సార్ వారికి చూపిస్తే ఓకే చేశారు. ఆ త‌ర్వాత ఆత్రేయకు ఈ విష‌యం చెప్పి పాట చూపించార‌ట‌. పాట చూసినాయన నవ్వి నాకంటే సెన్సారోళ్లే పెద్ద బూత‌య్యా అన్నార‌ట‌.

ఆ త‌ర్వాతా …. ఎన్టీఆర్ స్టెప్పుల‌కు అంకిత‌మై పోయిన రోజుల్లో వ‌చ్చిన యుగ‌పురుషుడు సినిమాలో కొమిల్లా విర్క్ అనే న‌ర్త‌కీమ‌ణితో రామారావుగారు ఓ ఐట‌మ్ సాంగ్ చేస్తారు. ఆ పాట చూసి కొందరు మర్యాదస్తులు హేవిఠీ దుర్మార్గం అనడం నేను విన్నాను … సాక్షాత్తు మా స్కూలు హెడ్మాస్టర్ గారే అన్నారు.

అయితే … ఆ పాట ప‌ల్ల‌వి ఎక్కు ఎక్కు తెల్ల‌గుర్రం అంటూ మొద‌ల‌వుతుంది. రికార్టులు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. కాపీ హోట‌ళ్ల కాడ టీ కొట్ల కాడా జ‌నం ఇప‌రీతంగా వినేసేవాళ్లా పాట … శానా దారుణమైన హిట్టా పాట .. అయితేనేం … సెన్సారోళ్లు అభ్యంత‌రం పెట్టారు.

దీంతో సినిమా వాళ్లు ఒరే తొంద‌ర‌ప‌డ‌కండి, రిపేరు చేపిత్తామని స‌ద‌రు క‌వి గారిని సంప్ర‌దిస్తే … ఒరే .. దాన్ని ఎంత వింత లేత సొగ‌సు అని మార్చుకుని పని కానిచ్చేయండ్రా అన్నారు. సెన్సారోళ్లు ఈ వింత సొగసు బానే ఉందన్నారు. అలా ఆ సమస్య గట్టెక్కినప్పటికిన్నీ … రికార్డుల్లో మాత్రం తెల్లగుర్రమే మిగిలిపోయింది. సినిమాలో వింత సొగసుంటుంది.

అలాగే డ్రైవ‌రు రాముడు సినిమాలో కూడా మహానుభావుడు ఆత్రేయ‌గారే గుగుగు గుడిసుంది మ‌మ‌మ‌మ మంచ‌ముంద‌ని రాస్తే సెన్సారోళ్లు ఠాఠ్ అన్నారు. వెంట‌నే మాస్టారు మంచాన్ని మ‌న‌సుగా మార్చారు. సినిమాలో మ‌న‌సు … రికార్టుల్లో మంచం స‌ర్దుబాటు చేసుకున్నాయి.

ఛాలెంజ్ రాముడు సినిమాలో కూడా ఆత్రేయగారే చ‌ల్ల‌గాలేస్తోంది అన్రాశారు గురువుగారు … కాస్త క్లారిటీ కావాల‌న్నారు సెన్సారోల్లు… దీంతో చ‌ల్ల‌గాలి వీస్తోంది అని మార్చారు. రికార్టుల్లో క్లారిటీ లేకుండానే కొన‌సాగింది. అయితే …

ఆ మ‌ధ్య జూ. ఎన్టీఆర్ బాద్షా సినిమాలో గుగుగు గుడిసుంది పాట వాడారు. వారు రికార్టు నుంచే తీసుకోవ‌డంతో మ‌న‌సు కాకుండా మంచ‌మే వ‌చ్చేసింది. అయితే ఈ కొత్త సెన్సారోళ్ల‌కు మంచం పెద్ద‌గా అభ్యంత‌ర‌మ‌నిపించ‌లేదు… వ‌దిలేశారు. మరిలా చెప్పుకుంటూ పోతే … ఎన్నో బూతు ముచ్చట్లున్నాయి నాయనా … ప్రస్తుతానికి స్వస్తి….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!
  • ఫాఫం కేటీయార్… తన విలువను తనే దెబ్బతీసుకుంటున్నాడు..!!
  • ‘ఈ చీపురుపల్లి నుంచి ఆ డల్లాస్‌పల్లి దాకా’ బహుళ గాత్రవైవిధ్యం..!!
  • మిస్టర్ విజయ్, సినీ ఫ్యాన్స్ వేరు, ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలు వేరు…
  • పూకి… కాకపోతే బూకి… ఏదో ఓ పిచ్చిపదం… తెలుగోడంటే అలుసే కదా…
  • నీ నల్లకోటు పుస్తకంలో కథలు చాలా బాగున్నయ్ మిలార్డ్…
  • ఎంత తేడా..? కేసీయార్ జనంలోకే రాడు… రేవంత్ మాత్రం పూర్తి భిన్నం..!!
  • అవ్‌ గణేశా… ఇంకొన్నొద్దులు ఇక్కడే ఉండిపోరాదు ప్లీజ్..!!
  • అది ఫాస్ట్ బ్రేక్..! ఉప్మాను ఏమైనా అంటే మర్యాద దక్కదు సుమీ…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions