ఒకప్పుడు ఇళయరాజా అంటే స్వర జ్ఞాని… తమిళంలో ఇసై జ్ఞాని.., నిజంగానే తన ట్యూన్స్ కంపోజింగ్ జ్ఞానాన్ని ఎవరూ వంక పెట్టలేరు… జీనియస్… కానీ ఈమధ్య ప్రతి విషయంలోనూ వివాదాలపాలవుతున్నాడు… అప్పట్లో ఏదో స్టూడియోలో తనదే రూమ్ అంటూ కోర్టుకెక్కాడు, ఎస్పీ బాలుతో కీచులాట… రజినీ సినిమాకు నోటీసులు… మొన్న తాజాగా మరేదో సినిమాకు నోటీసులు… రికార్డింగ్ కంపెనీలతో గొడవలు…
చివరకు బాత్‌రూంలో ఎవడైనా ఇళయరాజా పాటల్ని హమ్ చేస్తే సైతం ఆయన నోటీసులు పంపిస్తాడు జాగ్రత్త అని జోకులు వేసుకునే వరకూ బదనాం అయ్యాడు… రాయల్టీల వివాదం ఇంకా కోర్టులో ఉంది… ఒక సంగీత దర్శకుడిగా ఆయన్ని అభిమానించేవాళ్లు సైతం ఆయన వ్యాజ్యాలు, వివాదాల వార్తలతో విసుక్కుంటారు… అనిరుధ్ వంటి కొత్తతరం దర్శకులు వచ్చేస్తూ క్రమేపీ ఇళయరాజాను పట్టించుకునేవాళ్లు కూడా లేరిప్పుడు…
ఆమధ్య అదేదో కృష్ణ వంశీ సినిమాకు పనిచేశాడు, తీవ్రంగా నిరాశపరిచాడు… సరే, ఈ వార్తలు ఎలా ఉన్న వచ్చే 8వ తేదీన ఇళయరాజా హైదరాబాదులో లైవ్ కాన్సర్ట్ చేస్తున్నాడు… దానికి సమత ఇళయరాగం అని పేరు పెట్టారు…
Ads
అవును, మీరు చదివింది నిజమే… చిన జియ్యర్ వారి రామానుజ ప్రాంగణం ఉంది కదా ముచ్చింతల్‌లో… అక్కడే ఈ కచేరీ… గత ఏడాది ఫిబ్రవరిలో కావచ్చు గచ్చిబౌలిలో కచేరీ పెట్టాడు, కానీ పెద్ద ఇంప్రెసివ్ ఏమీ లేదు… ఇప్పుడు కచేరీ పెట్టేదే సమతా ప్రాంగణంలో… అంటే మాస్ రొమాంటిక్ రసిక కసిగీతాలకు చాన్స్ లేదు…
భక్తి పాటలు, మహా అయితే డబుల్ మీనింగ్ లేని సాఫ్ట్ గీతాలు… కానీ ఇళయరాజా భక్తిగీతాలు తెలుగులో తక్కువే… మరింకేం పాడతాడు..? వేరే సంగీత దర్శకుల పాటలు పాడతాడా..? మరి తన సూత్రం ప్రకారం వాళ్లకు రాయల్టీ ఇవ్వాలి కదా, ఇస్తాడా..? అందుకే ఇళయరాజా మీద మాంచి కోపం మీద ఉన్నవాళ్లు రాబోయే కచేరీపై ఓ కన్నేసి ఉంచుతారు…
సరే, డిమాండ్ తగ్గినా… అది భక్తి కచేరీ అయినా సరే… సూపర్ రేట్లు పెట్టారు… బాటా చెప్పుల ధరలాగా 699, 2999, 4999 … ఇవి గాకుండా 3 లక్షల సూపర్ స్పెషల్ టికెట్లు కూడా… ఇంకా పావువంతు టికెట్లు అమ్ముడుపోనట్టున్నాయి… బుక్‌మైషోలో టికెట్లు దొరుకుతాయి… భక్తి కచేరీ కదా, పుణ్యానికి చేస్తున్నాడని అనుకునేరు… ఇళయరాజా దగ్గర అలాంటివేమీ ఉడకవు… భారీగానే వసూలు చేస్తున్నాడట…
సరే, ఆసక్తి ఉన్నవాళ్లు వెళ్తారు, వాళ్లిష్టం… కానీ ఎటొచ్చీ ఆయన కేవలం తన పాటలకే పరిమితం అవుతాడా..? లేక ఇతర సంగీత దర్శకుల పాటల్ని కూడా ఆలపిస్తాడా..? ఆలపిస్తే రాయల్టీ ఇస్తాడా..? ఇదే అసలు ప్రశ్న… కేవలం తన పాటలకే పరిమితం కావాలనుకుంటే మాత్రం వెళ్లే శ్రోతలకు నిరాశే… ఎందుకంటే, తన భక్తి పాటలు చాలా తక్కువ… సో, ఇదీ ఇంట్రస్టింగు…!! అవునూ, టీవీ9లో, ఆహా ఓటీటీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందా మైహోం మాస్టారూ..!!
Share this Article