నటి హేమ డిఫరెంటుగా ఎందుకు ఉంటుంది..? ఉండదు, ఉండే అవకాశమే లేదు… పోలీసులు అంటే తన చుట్టూరా ఉన్న సినిమా ప్రపంచం సృష్టించి, జనానికి ప్రదర్శించే సినిమా పోలీసుల్లాగే ఉంటారని అనుకుంది… సినిమాల్లో చూపించినట్టే జోకర్ కేరక్టర్లు అనుకుంది…
అందుకే బెంగుళూరు రేవ్ పార్టీలో దొరకగానే, డ్రగ్స్ తీసుకున్నట్టు బయటపడగానే… అబ్బే, నేను ఆ పార్టీకి పోలేదు, హైదరాబాదులోనే ఉన్నాను అని ఓ వీడియో రిలీజ్ చేసింది… పోలీసులు ఆమె పట్టుబడిన వీడియోను, ఫోటోను రిలీజ్ చేశారు… సేమ్ డ్రెస్… తరువాత ఇంకా అతితెలివితో నేను పచ్చడి చేసే పనిలో ఉన్నాను అని మరో వీడియో…
పోలీసులు నవ్వుకుని, ఈమెను మరింత ఫిక్స్ చేయాలని ఫిక్సయిపోయారు… నెవ్వర్, తమను హౌలాగాళ్లలా ట్రీట్ చేసే ఎవరినైనా సరే పోలీసులు అంత తేలికగా వదిలిపెట్టరు… మరి ఖాకీ డ్రెస్సుకు ఖదర్, ఇగో ఉండవా ఏంటి..? పైగా అధికారం అనే లాఠీ కూడా ఉంటుంది కదా… నోటీసులు ఇచ్చారు, మళ్లీ నోటీసులు ఇచ్చారు, ఇక హేమకు తప్పలేదు…
Ads
రియల్ పోలీసులు సినిమా పోలీసుల్లా ఉండనే కఠోరనిజం అర్థమైంది… ఇంకా కూరుకుపోతున్నానని అర్థమైంది… ఎవరు తెలివైన సలహా ఇచ్చారో గానీ వెళ్లి లొంగిపోయింది, మళ్లీ అక్కడా అదే సినిమాటిక్ తెలివితేటలు… వైద్యపరీక్షలు గట్రా జరుగుతుంటే మీడియా చిత్రీకరిస్తుందనే డౌటుతో బుర్ఖా వేసుకుని వెళ్లింది… దీంతో హేమ మీద వార్తలేమైనా ఆగుతాయా..?
ఆగవు… పోలీసులు పెట్టేవన్నీ అసలైన కేసులు కాకపోవచ్చు, కానీ వాటిని కోర్టుల్లో రుజువు చేసుకోవాలి… అంతేతప్ప, సినిమా కథల్లోలాగా వ్యవహరిస్తే మెడకు మరింత పీటముడిలా చిక్కుకుంటాయి కేసులు… గతంలో మీడియా మీద ఇష్టానుసారం ఎగిరింది, ఇప్పుడు టైమ్ దొరికింది కదా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, టీవీ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా గట్రా ఏదీ హేమ మీద జాలి చూపించలేదు… ఇంత జరిగాక కూడా నాపై వార్తలు రాసిన మీడియా సంగతి చూస్తానంటూ ఎగురుతోంది ఆమె…
సరే, ఆమె వృత్తి ఆమె ఇష్టం… పోలీసులు, మీడియా అనుమానిస్తున్నట్టు ఆ రేవ్ పార్టీకి ఆమే కొందరు అమ్మాయిలను తీసుకుపోయిందా అంటే, అది అంత ఈజీగా కోర్టులో నిరూపణ కావడం కష్టం… కానీ ఇలాంటి వ్యవహారాల్లో సినిమాటిక్ అతి తెలివి పనికిరాదు, తెలివిగా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి… నిజానికి హేమ మాత్రమే కాదు…
పార్టీలు పెట్టి, జనాన్ని మాయ చేసే పెద్ద పెద్ద తోపు నటులే రాజకీయాల్ని కూడా సినిమా ప్రాజెక్టుల్లాగే చూస్తుంటారు… వాళ్లకు సినిమాయే ప్రపంచం, బయట జీవితాన్ని కూడా సినిమాల్లోలాగే చూస్తుంటారు… వీళ్లు దేవుళ్లు, అభిమానులే కార్యకర్తలు… పోనీ, ఫలితాలతో రియలైజ్ అవుతుంటారా..? నెవ్వర్…
సో, హేమకు తక్షణం కావల్సింది నిజాన్ని అంగీకరించి, బయట వ్యవహారాలు ఎలా సాగుతాయో తెలుసుకుని యాక్సెప్ట్ చేసే తెలివిడి… మనకు తెలిసి చాలామంది తారలపై వ్యభిచారం కేసులు పెట్టారు పోలీసులు, అప్పట్లో హైదరాబాదులో డ్రగ్స్ కేసులు పెట్టారు… ఏమైంది..? ఒక్కరికైనా శిక్షలు పడ్డాయా..? సో, ఎగిరిపడటం కాదు, అణకువ… తలెగరేయడం కాదు, తలవంచుకోవడం, అవసరమైనచోట… కొన్ని వృత్తుల్లో తప్పవు, కాదూ కూడదూ అంటే జనమే కాదు, ఇండస్ట్రీయే దూరం పెడుతుంది క్రమేపీ..!!
Share this Article