Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సుజాత పేరుతో జయసుధ, బాలనటుడిగా నరేష్ తొలిపరిచయం

June 5, 2024 by M S R

Subramanyam Dogiparthi…….  SVR , జమునల సినిమా . ఎవర్ గ్రీన్ కుటుంబ చిత్రం . సూపర్ స్టార్ కృష్ణ , ప్రభాకరరెడ్డిలు నిర్మించిన బ్లాక్ బస్టర్ . కృష్ణ కెరీర్లో మొదటి స్వర్ణోత్సవ చిత్రం . ఉమ్మడి కుటుంబం లాంటి బ్లాక్ బస్టర్లు ఈ సినిమాకు ముందే ఉన్నా , ఈ సినిమాలో జమున పాత్ర ఈ సినిమాను డిఫరెంట్ కుటుంబ చిత్రంగా మార్చేసింది . Quite afresh even now . ఓ అయిదారు రోజుల కింద కూడా ఏదో ఒక టి వి చానల్లో వచ్చింది . బహుశా ఈ టివి అనుకుంటా .

కధను తయారు చేసుకున్న ప్రభాకరరెడ్డిని అభినందించాలి . ఆ తర్వాత యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వం . పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి . లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో వచ్చిన ఈ పండంటి కాపురం సినిమా 1972 జూలై 21 వ విడుదలయి 21 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారాన్ని , ఫిలిం ఫేర్ అవార్డుని పొందింది . తమిళంలో , హిందీలో రీమేక్ అయింది . తమిళంలో కూడా సక్సెస్ అయింది కానీ హిందీలో సక్సెస్ కాలేదు .

జయసుధ సుజాత పేరుతో ఈ సినిమా ద్వారానే పరిచయమయింది . విజయనిర్మల కొడుకు నరేష్ కూడా ఈ సినిమా ద్వారానే బాల నటుడిగా పరిచయమయ్యాడు . SVR , గుమ్మడి , ప్రభాకరరెడ్డి , కృష్ణ అన్నదమ్ములు . దేవిక , బి సరోజాదేవి , విజయనిర్మల తోడికోడళ్ళు . ఇతర పాత్రల్లో మిక్కిలినేని , రామ్మోహన్ , రాజబాబు , పండరీబాయి , సంధ్యారాణి , రాధాకుమారి , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు .

Ads

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు , బాబూ వినరా అన్నాతమ్ముల కధ ఒకటి , ఆడే పాడే కాలంలోనే అనుభవించాలి , ఇదిగో దేవుడు చేసిన బొమ్మ , ఏవమ్మా జగడాల వదినమ్మా , మనసా కవ్వించకే నన్నిలా పాటలు చాలా చాలా శ్రావ్యంగా ఉంటాయి .

మా నరసరావుపేటలో కాలేజి రోజుల్లో ఎన్ని సార్లు చూసానో !! టివిలో వచ్చినప్పుడల్లా కాసేపయినా చూస్తుంటా . Excellent , entertaining , feel good movie .

బహుశా ఈ తరంలో కూడా చూడనివారు ఉండరేమో ! ఒకరూ అరా ఉంటే చూసేయండి . యూట్యూబులో ఉంది . నటీనటుల నటన , మద్దిపట్ల సూరి డైలాగులు , దర్శకత్వం అన్నీ బాగుంటాయి . ముఖ్యంగా SVR , జమునల నటన . An unmissable movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

May be an image of 2 people and text

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions