తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది… పాత జగన్ వాసనలన్నీ అధికార యంత్రాంగం నుంచి, నామినేటెడ్ పోస్టుల నుంచి… ప్రత్యేకించి ఖజానాకు వైరసుల్లా ఆశించిన సలహాదారుల నుంచి తొలగించే పని చేస్తాడు చంద్రబాబు… ఎలాగూ తప్పదు, తన వారిని నియమించుకోవాలి కదా…
అన్నింటికన్నా ముందు కీలకమైన పోస్టుల్లో ఉన్న అధికారులను వదిలించుకుంటాడు… జవహర్‌రెడ్డి ఆల్రెడీ వెళ్లిపోయాడు, కొత్త సీఎస్ ఎంపిక జరిగిపోయింది… చివరకు టీడీడీ ఈవో, సమాచార కమిషనర్ తదితరులూ మేం వెళ్లిపోతాం అంటున్నారు… అప్పుడే వెళ్లిపోతే ఎలా..? తవ్వాల్సిన కథలు చాలా ఉన్నాయి, వెయిట్ అంటున్నాడు చంద్రబాబు… కానీ కొందరికి కనీసం ఇంటికి వెళ్తే కలవడానికీ ససేమిరా అంటున్నాడు…
అంటే, తను మర్యాదకు కలవటానికి కూడా ఇష్టపడటం లేదంటే, మీమీద వైరాగ్యం వచ్చిందిరా భయ్ అని చెప్పడం… పచ్చిగా చెప్పుకోవాలంటే గతంలో జగన్ హయాంలో రెడ్డి అధికార్లకు ప్రయారిటీ… ఇప్పుడు వాళ్లందరికీ గడ్డుకాలమే… అసలు ఏపీ పాలిటిక్స్, యంత్రాంగం అంటేనే రెడ్డి వర్సెస్ కమ్మ అన్న చందంగా మారిపోయిన స్థితిలో ఇవన్నీ ఇక చూడాల్సిందే…
Ads
సరే, ఇవన్నీ ఎలా ఉన్నా… ఎవరెవరికి ఏమేం పోస్టులు దక్కుతాయి అనేది మరో ప్రశ్న… ఎలాగూ జనసేన, బీజేపీ మంత్రివర్గంలో చేరతాయి… కేంద్రంలో కూడా చంద్రబాబు మంత్రి పోస్టులు అడుగుతాడని, గతంలోలాగా కేవలం స్పీకర్ పదవితో వదిలేయడనీ అంటున్నారు… వీలైతే ఎన్డీయే కన్వీనర్ పోస్టులోకి కూడా బీజేపీ ఆహ్వానించవచ్చునని బాబు మీడియా ఆల్రెడీ ప్రచారం చేస్తోంది…
ఆస్తికుడో, నాస్తికుడో, అనాసక్తుడో తెలియని భూమన టీటీడీ చైర్మన్ పదవి నుంచి వైదొలిగాడు కదా… ఆ ప్లేసులో పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును నియమిస్తారని ప్రచారం జరిగింది,., నో, నో, అదంతా ఫేక్ అని నాగబాబు తనకు అలవాటైన రీతిలో ఓ సోషల్ వీడియో పెట్టేసి ఖండించాడు… ఈలోపు తనకు దేవుడంటే నమ్మకం లేదని తేల్చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది… (అఫ్ కోర్స్, వృత్తి వేరు, నమ్మకాలు వేరు… నాస్తికుడు అజయ్ కల్లం ఇదే టీటీడీ ఈవోగా మంచి వర్క్ కనబరిచాడు…)
కానీ చైర్మన్ పోస్టులో నాస్తికుడిని నియమించడం యాంటీ సెంటిమెంట్ అవుతుంది… అడిగితే ఏకంగా రాజ్యసభ అడుగుతాడేమో పవన్ కల్యాణ్ తన సోదరుడి కోసం…! చిరంజీవికి ఇంకాస్త ఎక్కువ పదవి… మరి టీటీడీ ఛైర్మన్ పదవి..? రకరకాల పేర్లు వినిపిస్తున్నా సరే, ఆల్రెడీ టీవీ5 బీఆర్ నాయుడు పేరు ఫైనలైనట్లు సమాచారం… ఆల్రెడీ ఈమేరకు హింట్స్ కూడా వచ్చేశాయంటున్నారు…
ఎన్ని కష్టాలు ఎదురైనా, తమ సామాజికవర్గ చంద్రబాబుకు నైతికంగా, మీడియాగా వెన్నుదన్నుగా నిలబడింది ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు… రామోజీరావు ఇప్పుడు ఎవరెస్టు మీద ఉన్నాడు, తనకు అధికార పదవులు అక్కర్లేదు, అవి తనకు సరిపోవు… రాధాకృష్ణ కూడా రాజ్యసభ ఆశించవచ్చునేమో అంటున్నారు… టీవీ5 నాయుడకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి కొంతమేరకు కృతజ్ఞతను, తన అభిమానాన్ని చంద్రబాబు చాటుకుంటున్నాడని టాక్… గుడ్… ఎటొచ్చీ ఇప్పటికే తిరుమల పాలనను భ్రష్టుపట్టించారు… కాస్త మెరుగుపరిచే దిశలో నాయుడు వర్క్ చేస్తాడని ఆశిద్దాం… మరీ టీవీ5 చెత్త డిబేట్లలాగా గాాకుండా..!!
ఐనా చంద్రబాబు తుది ఎంపికలు అప్పుడే చెప్పలేం… అందరూ విజయానంద్ కొత్త సీఎస్ అని రాసేశారు కదా… తీరా ఆయనేమో నీరబ్ కుమార్‌ను తెచ్చిపెట్టాడు… చందబాబును అంచనా వేయడం, ఆయన అడుగుల్ని కొలవడం అంత వీజీ కాదు..!!
Share this Article