Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సమాజ హిత కథనమే… కానీ పెద్దగా పదును లేని కృష్ణ ఆయుధం …

February 12, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మరో దుష్టశిక్షణ సినిమా ఇది . టైటిల్ ఆయుధం… అయితే ఈ దుష్టశిక్షణ చట్టప్రకారం కలెక్టర్ గారి పాత్రలో కృష్ణ చేసే దుష్టశిక్షణ . సినిమా చూడబుల్ గా ఉండేదానికి ప్రధాన కారణం పరుచూరి బ్రదర్స్ కధ , సంభాషణలు .

1990s లో మద్యపానానికి వ్యతిరేకంగా జనం ఉద్యమాలు చేయటమే కాకుండా ఈనాడు వంటి పత్రికలు , సినిమా మాధ్యమం కూడా బాగా కష్టపడ్డాయి . ఈ సినిమాలో సారాయి కాంట్రాక్టులు , సిండికేట్లు వంటి అంశాలతో పాటు భూకబ్జా మీద కూడా చెణుకులు ఉన్నాయి .

Ads

జిల్లా పరిషత్ చైర్మన్ పాత్రలో సత్యనారాయణ 300 ఎకరాల పోరంబోకు భూమిని కబ్జా చేసి మెడికల్ కాలేజీ కట్టడం , దానిని ఏకరానికి వెయ్యి రూపాయలు కట్టి రెగ్యలరైజ్ చేయించుకోవటం వంటి విషయాల మీద చెణుకులు ఉంటాయి .

ఈ 35 ఏళ్ళలో సమాజం ఆలోచించే విధానంలో మార్పులు చాలా వచ్చాయి . మద్యపానాన్ని పత్రికలు , టివిలు , ప్రభుత్వాలు , మేధావులు తప్పు అనటం మానేసారు . పైగా తప్పేముంది అని కూడా దబాయిస్తున్నారు .

అలాగే భూకబ్జాలు . బడాబాబులు కబ్జాలు చేయటమే కాదు ; డబ్బులు కడుతున్నాం కదా అని కూడా దబాయిస్తున్నారు . కొండొకచో ప్రభుత్వాలే రూపాయికి , పావలాకు సంతర్పణ చేస్తున్నాయి .

రాధ

ఈ సినిమాలో ఈ రెండు అంశాలూ ఉన్నాయి . ఈ దురాగతాలను ఆపే పాత్రలో కృష్ణ చాలా హుందాగా , ఎనర్జిటిగ్గా నటించారు . చైర్మన్ పెంపుడు రౌడీగా రమేష్ బాబు బాగానే నటించాడు . వీరిద్దరికి జోడీలుగా రాధ , వాణీ విశ్వనాధ్ గ్లామర్ స్పేసుని బ్రహ్మాండంగా ఫిల్ చేసారు . చాదస్తపు , డాబుసరి , ఆశబోతు కలెక్టర్ గారి భార్యగా రాధ ఓ కొత్త పాత్రలో కనిపిస్తుంది .

విలనుగా సత్యనారాయణ ఎడం చేత్తో చేసేసాడు . చైర్మన్ కొడుకుగా , కుర్ర విలనుగా సాయికుమార్ అక్షరాలు దిద్దుకునే స్టేజిలో కనిపిస్తాడు . ఇతర ప్రధాన పాత్రల్లో పి యల్ నారాయణ , సుత్తి వేలు , మాడా , అనిత , అనూరాధ , బట్టల సత్యం , యువశ్రీ  తదితరులు నటించారు .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి పాటలను బాలసుబ్రమణ్యం , జానకమ్మ , మనో శ్రావ్యంగా పాడారు . బయట హిట్ కాకపోయినా థియేటర్లలో బాగానే ఉంటాయి . ప్రౌఢ జంట కృష్ణ , రాధల డ్యూయెట్లు కూడా బాగానే ఉంటాయి .

కె మురళీమోహన్ రావు దర్శకత్వంలో 1990 మే నెలలో వచ్చిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతో ట్రై చేయొచ్చు . చూడబులే .It’s a Krishna-mark action movie.

నేను పరిచయం చేస్తున్న 1236 వ సినిమా. #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు (ఆయుధం అనే టైటిల్‌తో తరువాత కాలంలో రాజశేఖర్ హీరోగా కూడా ఓ సినిమా వచ్చింది)…

ఆయుధం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హెరిటేజ్ ఆనవాళ్ల పరిరక్షకుడు- ఈ ఆగాఖాన్ ఎవరో తెలుసా?
  • KTR ట్వీట్లు, ఆరోపణలు సరే… ఇంతకీ ఠాణాలో దాడి ఘటన జరిగిందా?
  • ట్రూ కామ్రేడ్ వెళ్లిపోయాడు – ఆ ఎరుపు రంగూ వెలిసిపోయింది !!
  • అచ్యుతం కేశవం … బాగున్నట్టే ఉంది… కానీ ఏదో తెలియని అసంతృప్తి !!
  • GDN – మాధవన్ మరో మంచి పాత్ర! చూడదగిన ఓ బయోపిక్ !!
  • 72 వేల మందికి పీఆర్సీ కట్?… అపోహలేమిటి – నిజాలేమిటి?
  • ‘ది హిందూ’ ఎందుకు గుంజీలు తీసింది? తను చేసిన తప్పేమిటంటే?
  • తెలంగాణ రెడ్లు, కోమట్లు – వందల తరాలుగా ఓ జన్యులోప వారసత్వం!!
  • కొరగాని వారసులు! ఘోషిస్తున్న బాల్ ఠాక్రే ఆత్మ! – అసలెవరు ఈ దిశా ?
  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions