పాయల్ రాజపుత్… మొదటి నుంచీ బోల్డ్ టైప్ కేరక్టర్లు, స్కిన్ షో గట్రా చేసేది… పెద్దగా నటించాల్సిన కష్టం కూడా అవసరం లేదు… అందుకే ఆమె కూడా పెద్దగా కష్టపడలేదు… ఆమధ్య వచ్చిన మంగళవారం అనే సినిమాలో కాస్త బెటర్ అనుకుంటా…
మూణ్నాలుగేళ్ల క్రితం ఓ సినిమా ఒప్పుకుంది… రక్షణ ఆ సినిమా పేరు… ఓ పోలీసాఫీసర్ పాత్ర… సినిమాను కిందామీదా పడి పూర్తిచేశారు… రీసెంటుగా రిలీజ్ చేయడానికి ముందు ఓ రచ్చ… ప్రమోషన్లకు రానంటుంది ఆమె… నాకు బాకీ ఉన్న మిగతా సొమ్ము కక్కండి అంటుంది… నో, ప్రమోషన్లకు వస్తేనే ఆ డబ్బు ఇస్తాం అంటాడు నిర్మాత కమ్ దర్శకుడు ప్రణదీప్ ఠాకూర్…
తనను బూతులు తిట్టారని బహిరంగంగానే ఆరోపించింది… నిర్మాతలకు మరింత మండి నిర్మాతల మండలి వద్దకు వెళ్తే, వాళ్లు సైలెంటుగా మాకెందుకు ఈ గోకుడు అనుకుని ‘మా’కు అప్పగించారట… అసలు ఆమె అందులో సభ్యురాలే కాదు… చివరకు అది ఎటూ తెగలేదు, ఆమె ప్రమోషన్లకు రాలేదు, సినిమా రిలీజైంది…
Ads
తీరా సినిమా చూస్తే, సేమ్, కాజల్ అగర్వాల్ సినిమా సత్యభామ కూడా రిలీజైంది కదా ఈరోజే… ప్చ్, రెండు సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లది సేమ్ ఏసీపీ పాత్రలే… వుమెన్ సెంట్రిక్ సినిమాలే… అటు అంత సీనియారిటీ ఉన్న కాజల్ గానీ, ఇటు బోల్డ్ ముద్ర తప్ప వేరే పెద్దగా ఎమోషన్లు పలికించిన ట్రాక్ లేని పాయల్ గానీ… సేమ్ నటించారు… నిజానికి పెద్దగా ఎమోషన్లు పలికించే భిన్నమైన కేరక్టరైజేషన్ ఏమీ లేదు… అందులో వాళ్ల తప్పు లేదు…
ఒక స్నేహితురాలి ఆత్మహత్య… కాదేమో, హత్యేమోనని ఏసీపీ ట్రెయినింగులో ఉన్న పాయల్ డౌట్… ఎవడో లాలీపాప్ హంతకుడు వరుసగా చేస్తుంటాడు… మధ్యలో బిగ్‌బాస్ శోభన్‌బాబు మానస్ మీద సందేహం, తరువాత తనూ సూసైడ్… కథ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది గానీ… అన్నిరకాల క్రైమ్ థ్రిల్లర్లలాగే ఈ సినిమా కూడా నడుస్తుంది… పర్లేదు, పెద్దగా ఆకట్టుకునేంత స్థాయలో ప్రజెంటేషన్ లేకపోయినా, పెద్దగా లోపాలేమీ కనిపించవు సినిమాలో…
సినిమా మొత్తం పాయల్ రాజ్‌పుత్ తన భుజాల మీదే మోసింది… యాక్షన్ సీన్లు కూడా…! సేమ్, సత్యభామలో కాజల్‌లాగానే… కానీ రెండూ థియేటర్ దాకా వెళ్లి చూడదగ్గ రేంజ్ అయితే కాదు… ఓటీటీలో రాకపోదు, వెయిట్ చేస్తే పోలా అనుకున్నారా.. గుడ్, ఆ మాట మీదే ఉండండి… పర్సుకు ఫాయిదా…!!
Share this Article