ప్చ్, నిరాశపరిచావ్ సుడిగాలి సుధీర్… అనే అంటోంది టీవీ మార్కెట్..! నిజానికి సుడిగాలి సుధీర్ అంటేనే తెలుగు టీవీ సూపర్ స్టార్… సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే టీవీలకు సంబంధించి గుడ్ పర్‌ఫార్మర్… పాడతాడు, ఆడతాడు, హోస్ట్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, అన్నింటికీ మించి పెద్దగా అసభ్యంగా అనిపించని ఓ ప్లేబాయ్ ఇమేజీని ప్రదర్శిస్తాడు…
అప్పట్లో ఈటీవీ నుంచి వెళ్లిపోయాడు… నిజానికి అదే తన అడ్డా చాలా ఏళ్ల నుంచీ… ఓ చిన్న మెజిషియన్‌గా షో చేస్తూ పొట్టపోసుకునే స్థితి నుంచి ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్స్… ఎందులోనైనా సుధీర్ ప్రజెన్స్ మస్ట్… అలాంటిది వెళ్లిపోయాడు, బయట సినిమాల్లో కాస్త, ఇంకేవో టీవీల్లో యాంకర్, హోస్టుగా సెటిల్… మళ్లీ ఈటీవీ పట్టుకొచ్చింది… ఈసారి ఫ్యామిలీ స్టార్స్ అనబడే షో అప్పగించింది… సుధీర్ బ్యాక్ అని ప్రచారం హోరెత్తించింది…
పర్లేదు, బాగానే ఉంది… కొత్తదనం ఏమీ లేకపోయినా టీవీ మేల్, ఫిమేల్ సెలబ్రిటీలను పట్టుకొచ్చి ఏదో కిట్టీ పార్టీలాంటి షో నిర్వహించడమే… తను కాబట్టి కాస్త రక్తికడుతోంది… అదే సుమలాంటి సీనియర్ యాంకర్లు చేస్తున్నా సుమ అడ్డా ఫ్లాప్ షో… ఈసారి బార్క్ రేటింగుల్లో చూస్తే ఈ సుధీర్ రీఎంట్రీ షో ఫ్యామిలీ స్టార్స్ జస్ట్, 2.96 జీఆర్పీలు… చాలా చాలా తక్కువ సుధీర్ స్థాయికి..!
Ads
కానీ ఏమాటకామాట… ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ న్యూస్ చానెల్స్ మరీ నాసిరకం రేటింగ్స్ నమోదు చేస్తున్నాయి గానీ… ఈటీవీ మెయిన్ చానెల్‌లో రాత్రి 9 గంటలకు వచ్చే ప్రైమ్ టైమ్ న్యూస్ బులెటిన్ మాత్రం ఈరోజుకూ క్రెడిబులిటీని కాపాడుకుంటోంది… మొన్నటి ఎన్నికల ఫలితాల రోజు ఏకంగా 7.10 జీఆర్పీలు కొట్టింది… ఈ దెబ్బకు ఆల్ చానెల్స్ టాప్ 30 జాబితాలోకి వచ్చింది ఈటీవీ… నిజానికి ఆ చానెల్ పేరు టాప్ 30లో ఎప్పుడూ కనిపించదు…
ఒక వినోద చానెల్ తన న్యూస్ ప్రోగ్రామ్‌తో రేటింగ్స్ కాపాడుకోవడం నిజంగా ఓ విశేషమే… ఈటీవీ టాప్ 30 షోలలో వరుసగా టాప్ సెవన్ (వారంలో ప్రతిరోజూ) ప్రోగ్రామ్స్ ఈ ఈటీవీ న్యూస్ బులెటినే… మిగతా రియాలిటీ షోలన్నీ ఎప్పటిలాగే పూర్ పర్‌ఫామెన్స్…
బోలెడు అంచనాలతో కార్తీకదీపం సీక్వెల్ వస్తోంది కదా… నిజానికి అది సీక్వెల్ కాదు, ఆ పేరుకున్న బ్రాండ్ వాల్యూ వాడుకుని ఓ కొత్త కథ చెప్పడం… కాకపోతే అదే హీరో నిరుపమ్, అదే హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్… కానీ అస్సలు బాగుండటం లేదు… ప్రేక్షకులు కూడా పెదవి విరుస్తున్నారు… ఒక సోమవారం రోజు బ్రహ్మముడి సీరియల్ 10 దాటి జీఆర్పీ కొట్టగా… ఒక శనివారం కార్తీకదీపం 6.76 రేటింగ్స్… పేరుకు స్టార్ మాటీవీలో సెకండ్ పాపులర్ సీరియల్, కానీ ఒకప్పటి కార్తీకదీపంతో పోలిస్తే పూర్ పర్‌ఫామెన్స్…
ఒక్కసారి జీతెలుగు ప్రోగ్రామ్స్‌కు వస్తే… విఠలాచార్య సీరియల్ తెలుసు కదా… త్రినయని… మాయలు, మంత్రాలు, మూఢనమ్మకాలు, జంతువులు, ఆత్మలు గట్రా… ఈసారి ఆల్ చానెల్స్ టాప్ 30 జాబితాలోనే లేకుండా పోయింది అది… చివరకు జీతెలుగు టాప్ సీరియళ్ల జాబితాలో కూడా మూడో ప్లేసుకు పడిపోయింది… పడమటి సంధ్యారాగం, జగద్ధాత్రి ముందుకొచ్చేశాయి… ఒకప్పుడు మంచి రేటింగ్స్ సాధించిన ప్రేమ ఎంత మధురం సీరియల్ మరీ ఘోరంగా పడిపోయింది… అఫ్‌కోర్స్, ఆ కథ, ఆ కథనాలకు అంతకుమించి రేటింగ్స్ అసాధ్యం కూడా..!
Share this Article