“ఎక్కడున్నావ్ రవీ, నువ్వు?”
“ఎందుకు?”
“నేను వస్తున్నాను”.
“ఇప్పుడా?”
“అవును. ఇప్పుడే!”
“వద్దు, వద్దు” అన్నాడతడు.
“అదేమిటి రవీ?”
అతడు సమాధానం చెప్పటానికి తటపటాయించాడు. ఆమెని కూడా ప్రమాదంలోకి లాగటం అతడికి ఇష్టంలేదు. అయినా ముఖ్య కారణం అదికాదు. ఈ ఊరు, ఈ దేశం, ఈ మనుష్యులు అన్నీ వదిలేస్తూ అతడు దూరంగా వెళ్ళిపోవటానికి తయారవుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆమెను చూడటం అతడికి ఇష్టంలేదు.
“మనం ఇంతవరకూ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. నాకు మీ పేరు కూడా తెలీదు. ఇదేదో తెలియని బంధం. నేను హత్య చేయలేదన్న సంగతి మీరొక్కరూ నమ్మితే చాలని ఫోన్ చేయించింది. ఉ౦టాను…” ఫోన్ పెట్టేశాడు.
Ads
అతడికి “హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీ వే” అన్న ఆంగ్ల చిత్రం గుర్తొచ్చింది. అందులో కధానాయకుడు ప్రకృతిని ఆరాధించే ఒక అద్భుతమైన చిత్రకారుడు. యువకుడు. అతడికి జీవితం పూలపాన్పు.
అటువంటి సమయంలో ఒక ఆక్సిడెంట్ జరిగి, మెడ నుంచి క్రింది భాగమంతా పూర్తిగా చచ్చుబడిపోతుంది. కేవలం తల ఒకటే కదలగల స్థితిలో ఉ౦టుంది. అతడి ప్రియురాలు మరొక కుర్రవాడి ప్రేమలో పడి అతడిని వదిలేసి వెళ్లిపోతుంది. తను చనిపోవటానికి అనుమతి నివ్వమని అతడు కోర్టుని కోరుకుంటాడు.
హాస్పటల్‌కి వచ్చి అతని వాదన వింటాడు జడ్జి. తనెందుకు చనిపోవాలనుకుంటున్నాడో అతడు కరుణాపూరితంగా వాదిస్తాడు. (ఇక్కడ అతడు “ ఉడక బెట్టిన కూరగాయ” అన్న పదం వాడినప్పుడు ప్రేక్షకుల కళ్ళు సజాలాలవుతాయి). అతడి మెర్సీకిల్లింగ్‌కి కోర్టు ఒప్పుకుంటుంది.
అతడిని ట్రీట్ చేస్తున్న డాక్టరు ఆర్ధ్రతతో కదిలిపోతుంది. మరణానికి ముందు… నీళ్ళు నిండిన కళ్ళతో అతడిని ముద్దు పెట్టుకోవటానికి ముందుకు వంగుతుంది. అతడు వద్దంటాడు.
“ఈ ప్రకృతీ- ఈ పూలు- ఈ వర్షం రాత్రులు- నాకిష్టమైన చిత్రాలు… అన్నిటి నుంచీ శలవు తీసుకుంటున్నాను. జీవితం అంటే ఏమీలేదు అన్న వైరాగ్య భావాన్ని బలవంతంగా పెంచుకుంటూ మరణాన్ని ఆహ్వానిస్తూన్న నన్ను, మీ ఈ ముద్దు తిరిగి జీవితంలోకి లాగుతుంది. జీవించాలనే ఆశ పెంచుతుంది. వద్దు…” అని అంటాడు. (ఈ సినిమా హిందీలో కూడా వచ్చింది)…
ఇదంతా యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఓ పాత నవల తెల్లంచు నల్లచీర అనే నవలలోనిది… అప్పట్లోనే ఆయన మెర్సీ కిల్లింగ్ సబ్జెక్టు టచ్ చేశాడు, గ్రేట్… నిజానికి ఈరోజుకూ మెర్సీ కిల్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఓ డిబేట్… ఇలాంటి విధాన నిర్ణయాలు తీసుకోవాలంటే గట్స్ ఉండాలి ఏ ప్రభుత్వానికైనా…
సరే, నవల కాబట్టి, ఏదో కాస్త మెలోడ్రామా, డ్రామా క్రియేట్ చేసి ఉండొచ్చుగాక… నిజంగా శల్యావస్థలో ఉన్న ప్రాణాల్ని అపారమైన కరుణతో పైకి పంపించడం ఎంత సంచలనాత్మకం… ఎవడో ఏదో కూస్తాడు గానీ… అన్ని ఆశలూ ఉడిగి, అన్ని శక్తులూ ఉడిగి, ఇక ఏ ఆశా లేని స్థితిలో వాళ్లను పంపించేయడం ఎంత మంచిది..?
మన చెత్తా ప్రభుత్వాలు ఎలాగూ ఆ కోణాల్లో ఆలోచించేంత దమ్మున్నవి కావు… అంతటి సరుకున్న నాయకుడెవడూ ఇంకా రాలేదు… కనీసం డిబేట్లు, సాధ్యాసాధ్యాలపై ఇలా సాహిత్యంలోనైనా టచ్ చేయలేమా..? ఆ పని యండమూరి ఎన్నో ఏళ్ల క్రితం చేశాడు… అందుకు అభినందనలు…
Share this Article