తమిళుడు తమిళుడే… వాడు ఇంకెవడినీ దగ్గరకు రానివ్వడు… ఒక రజినీకాంత్, ఒక కమల్‌హాసన్, ఒక సూర్య దగ్గర నుంచి చివరకు చిన్నాచితకా హీరోలను కూడా మనం మన హీరోల్లాగే అభిమానిస్తాం… ఒక మురుగదాస్ నుంచి ఒక మణిరత్నం దాకా అందరినీ నెత్తిన మోస్తాం… మన స్ట్రెయిట్ సినిమాల్లాగే ఆదరిస్తాం… కానీ వాళ్లు…
వేరే భాషల వాళ్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే దగ్గరకు రానివ్వరు… అది ఏ రంగమైనా సరే, వాళ్లు పోటీపడతారే తప్ప ఇంకెవడినీ పోటీకి రానివ్వరు… కల్కి బుకింగులు మరో తాజా ఉదాహరణ… అమెరికాలో అలా, తెలుగు రాష్ట్రాల్లో ఇలా, హిందీ బెల్టులో అలా… అని రాసుకుంటున్నాం కదా… తమిళనాట వెరీ వెరీ పూర్ బుకింగ్స్, దేకినోడే లేడు… అక్కడ కూడా తెలుగు వెర్షన్‌కు బుకింగులున్నాయి… అంటే చెన్నైలోని మన తెలుగు వాళ్లు, నెల్లూరు, చిత్తూరు బ్యాచులు బుక్ చేసుకుంటున్నవే తప్ప తమిళులు కాదు…
Ads
నిన్నగాక మొన్న వచ్చిన విజయ్ సేతుపతి మహారాజ సినిమా ఒక్క వైజాగ్‌లోనే కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది… ఒక్క బాహుబలి -2 తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు సినిమా తమిళ స్ట్రెయిట్ సినిమా దగ్గరలోకి వెళ్లలేదు… వాడు రానివ్వడు… ఆ మార్కెట్‌ను క్రాక్ చేయకపోవడానికి ఏకైక కారణం సన్ గ్రూప్… వినోదరంగంలో తమిళనాడులో సన్ గ్రూపుకి తెలియకుండా చీమ కూడా కదలదు… గుత్తాధిపత్యం…
ఇప్పటికే స్టార్, జీ, సోనీలు మార్కెట్‌లో సన్ గ్రూపుకి కనీస పోటీ ఇవ్వలేకపోతున్నాయి… రేడియోలో రేడియో మిర్చి (Times group), బిగ్ ఎఫ్ఎం (రిలయెన్స్), రేడియో సిటీ (హిందుస్తాన్ టైమ్స్) కనీసం సూర్యన్ ఎఫ్ఎం దరిదాపుల్లోకి కూడా వేళ్లడం లేదు… అలాగే టైమ్స్ ఇఫ్ ఇండియా ఇండియా మొత్తమ్మీద టాప్ అయినా సరే తమిళనాడులో ది హిందూను మాత్రం బీట్ చేయలేకపోతోంది… నిజంగానే తమిళ మార్కెట్ ఇండియాలోనే ఓ పెద్ద మార్కెటింగ్ కేస్ స్టడీ…
తమిళనాట సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో కూడా రెడ్ జెయింట్ అని సన్ గ్రూపుదే గుత్తాధిపత్యం… తెలుగులో మేం తోపులం, మేం ఊపులం అని జబ్బలు చరుచుకునే పెద్ద పెద్ద హీరోలు సైతం తమిళ మార్కెట్‌ను కొట్టలేకపోతున్నారు… ఓటీటీల్లో కూడా సన్ నెక్స్ట్ దే మోనోపలీ అక్కడ… అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ కూడా ప్రొడ్యూసర్లతో నేరుగా అగ్రిమెంట్లు చేసుకున్నా సరే, సన్ నెక్స్ట్‌లో కనీసం ఒక్క వారమైనా కంటెంట్ షేర్ చేసుకోవాల్సిందే…
ఈలెక్కన మనం అక్కడి హీరోలను, డైరెక్టర్లను నెత్తిన పెట్టుకోవడం తప్పే అనిపిస్తుంది కొన్నిసార్లు… కాకపోతే మనం అంత రిజిడ్‌గా ఉండలేం, మన తత్వం అది… తమిళులకు పూర్తి కంట్రాస్టు మనం… నిజంగానే తమిళ కల్చర్, తమిళ సినిమా, తమిళ మీడియా, తమిళ వినోదరంగం అన్నీ ఎప్పుడూ ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థాలే… పాపం, కల్కి ప్రొడ్యూసర్లు ఇది తెలిసే తమిళ మార్కెట్ కోసం ఏకంగా కమలహాసన్‌ను తీసుకున్నారు… ఐనా సరే ఎవరూ దేకడం లేదు… (పైగా ఓ వింత మేకప్పుతో అసలు కమలహాసన్‌ను గుర్తుపట్టే రీతిలో కూడా లేదు…)
దారుణం ఏమిటంటే..? కనీసం వేరే తమిళ గ్రూపులు కూడా సన్ గ్రూపుకి పోటీ ఇవ్వలేకపోవడం… జయలలిత సీఎంగా ఉన్నప్పుడు కూడా సన్ నెట్‌వర్క్‌ను దెబ్బకొట్టలేకపోయింది… అంత బలమైన ప్రాబల్యం వాళ్లది… అదే చాన్స్ మన మార్కెట్‌లో ఈటీవీ చేజార్చుకుంది… కారణం, కాంగ్రెస్ పార్టీ… అంతేకాదు, మన వినోద వ్యాపార రంగాలు మరీ రెడ్లు, కమ్మలుగా విడిపోవడం కూడా ఓ కారణమే… చెబుతూ పోతే ఇలా ఎన్నో… మొత్తానికి తమిళుడు తమిళుడే… వాడెవ్వడికీ అర్థం కాడు…
Share this Article